AP Rains: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ - రాబోయే 3 రోజులు వర్షాలు
Andhra News: ఏపీకి వాతావరణ శాఖ తాజాగా రెయిన్ అలర్ట్ ఇచ్చింది. రాబోయే 3 రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
Rain Alert To Andhra Pradesh: ఏపీలో ఇటీవల భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. కృష్ణా నదికి వరద పోటెత్తడం సహా బుడమేరుకు గండ్లు పడడంతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి నుంచి పూర్తిగా బయటపడుతోన్న క్రమంలో తాజాగా వాతావరణ శాఖ మరో అలర్ట్ ఇచ్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా వాయుగుండం కొనసాగుతుండగా.. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజులు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వానలు పడతాయని ప్రకటించింది. పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది.
ఈ జిల్లాలకు అలర్ట్
ఈ క్రమంలో గంటకు 30 - 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.
Also Read: Chandrababu News: చంద్రబాబును ఆకాశానికెత్తేసిన నార్వే మాజీ మంత్రి - సీఎం రిప్లై ఏంటంటే