అన్వేషించండి

Raghurama Vs Ysrcp : రఘురామ సర్వేలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కి ఎన్ని సీట్లంటే..?

తన పనితీరుపై సర్వే చేసినట్లుగా వైసీపీ నేతలు ప్రచారం చేయడంపై ఎంపీ రఘురామ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై తాను చేయించిన సర్వేను విడుదల చేశారు.


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్రంలో తాను జరిపించిన సర్వేను వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50 ఎమ్మెల్యే సీట్లు కూడా రావని తేలిలిందనిప్రకటించారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోనూ తాను సర్వే చేయించానని..ఇరువరం పోటీ చేస్తే జగన్ కన్నా తనకు 19 శాతం ఓట్లు ఎక్కువగా వస్తాయన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో గ్రంథి శ్రీనివాస్, తానేటి వనిత, శ్రీనివాసులు నాయుడు తప్ప ఎవరి పరిస్థితి సరిగా లేదన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చెవిరెడ్డి, చంద్రబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాధ్ రెడ్డి తప్ప ఎవరూ గెలవని ఆయన ప్రకటించారు.

తాను ఈ సర్వేను బయట పెట్టాలనుకోలేదని కానీ పెట్టేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేశారని వ్యాఖ్యానించారు. రఘురామ పార్లమెంటుకు వెళ్లడం లేదని సర్వే చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. పార్లమెంట్ రికార్డు... అటెండెన్స్..ఎన్ని ప్రశ్నలు అడిగానో వాళ్లు తెలుసుకోవాలనిసూచించారు. అన్ని జిల్లాలకు సంబంధించి పూర్తి సర్వేసమాచారం తనదగ్గర ఉందన్నారు.  ప్రస్తుత పరిస్థితి ఇలా ఉందని... పరిస్థితి మారితే ప్రస్తుతం ఉన్న 150 కంటే ఎక్కువే రావొచ్చు లేకపోతే.. 50 కన్నా తక్కువే రావొచ్చని జోస్యం చెప్పారు.

వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో  విషయంలో విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనలపై సీబీఐ విచారణ చేయాల్సి ఉందని రఘురామ అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి విజయసాయిరెడ్డికి గుండెపోటు అని ఎవరు చెప్పారో సీబీఐ తెలుసుకోవాలన్నారు. హత్యను గుండెపోటుగా నమ్మించేందుకు ప్రయత్నించడమే కాకుండా రక్తపు మరకలను తుడిచేసిన వారిని ప్రశ్నించకుండా పేపర్లో ప్రకటనలు ఇస్తే ఏం ప్రయోజనమని.. ప్రజలు అనుకుంటున్నారని రఘురామ వ్యాఖ్యానించారు.  

ఏపీలో మద్యం శాంపిల్స్ తీసుకుని పరిశీలిస్తామని తనకు కేంద్ర మంత్రి నుంచిలేఖ వచ్చిందని ఎప్పుడు శాంపిల్స్ తీసుకుంటారో తెలియదన్నారు. ఇండియాలో ఎక్కడా అమ్మని మద్యం బ్రాండ్లు ఏపీలో ఉన్నాయని అవి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వారం రోజులుగా మీడియా ముందుకు రాకపోవడంపై సెటైర్లు వేశారు. ఆయన వారం రోజులుగా కనిపించడం లేదని ఎక్కడికి వెళ్లారో ఏమైందో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

వైసీపీ నేతల ఆడియో టేపుల వివాదంపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించాన్ని ఆహ్వానించారు. తమ పార్టీ పరువు కాపాడాలని ఆమె కోరారు. తక్షణం విచారణ చేయించి.. ఆటేపులు ఎవరివో బయట పెట్టాలన్నారు. మిమిక్రి చేసిన వాళ్లని గుర్తించి శిక్షించాలన్నారు.  రోజువారీ ప్రెస్‌మీట్లలో రోజూ విమర్శలు చేసే రఘురామ ఈసారి సర్వే ఫలితాలను ప్రకటించడంతో అందరితోనూ ఆసక్తి వ్యక్తమయింది. 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
Nandamuri Deepika: ఎన్టీఆర్ వదిన రాజకీయాల్లోకి వస్తారా? సేవా కార్యక్రమాల్లో హరికృష్ణ పెద్ద కోడలు
ఎన్టీఆర్ వదిన రాజకీయాల్లోకి వస్తారా? సేవా కార్యక్రమాల్లో హరికృష్ణ పెద్ద కోడలు
TDP YSRCP Political Row: అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!
అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
కొత్త మారుతి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేసుకోండి, మరోసారి ధరల పెంపు!
మారుతి సుజుకీ గట్టి షాక్‌ ఇవ్వబోతోంది, కొత్త కారు కొనేవాళ్ల జేబుకు చిల్లు!
CPM West Bengal Revival: బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
Embed widget