అన్వేషించండి

Andhra News : ఎయిమ్స్ కోసం నీళ్లు కూడా ఇవ్వట్లేదు - ఏపీ ప్రభుత్వంపై పురందేశ్వరి తీవ్ర ఆరోపణ !

Purandeshwari : మంగళగిరి ఎయిమ్స్ కు ప్రభుత్వం నీరు కూడా ఇవ్వడం లేదని పురందేశ్వరి ఆరోపించారు. కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించినా అభివృద్ధి జరగడం లేదన్నారు.

Andhra News : పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. గుంటూరులో పర్యటిస్తున్న ఆమె.. ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.  కేంద్రం  1600 కోట్ల రూపాయలతో మంగళగిరి ప్రాంతంలో ఎయిడ్స్ హాస్పిటల్ నిర్మించారన్నారు.  పది రూపాయల ఫీజుతో  అత్యంత నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది.. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆస్పత్రికి కనీస సహకారం కూడా  అందించడం లేదన్నారు. 

ఆస్పత్రికి వెళ్లే దారిలో  అడ్డంగా ఉన్న విద్యుత్ తీగలు కూడా పక్కకు తొలగించలేదని.. కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేకపోయిందని మండిపడ్డారు.  పేదవాళ్లకు సేవ చేసే సంస్థకు, మౌలిక వసతులు కల్పించకపోవడం క్షమించరాని నేరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి రహిత, సమర్థవంత పాలన అందిస్తున్నారు.. బీజేపీ పాలనలో ఒక స్కాం కూడా లేదన్నారు పురంధేశ్వరి.. అణగారిన వర్గాల వారికి మేలు చేయాలన్న భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.. కరోనా లేక పోయిన పేదలకు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమం అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. 

గ్రామ సచివాలయాలు ఏర్పాటు కూడా కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ పథకం కింద నిర్మించారు అనే విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలన్నారు. అమరావతి రాజధాని రైతులు ఇచ్చిన భూములకు కౌలు కూడా ఇవ్వడం లేదు.. అమరావతి వెళ్లిపోయింది అనే బాధతో ఆందోళన చేస్తున్న మహిళలను, పోలీసులు అడ్డుపెట్టుకొని ఈ ప్రభుత్వం వేధించిందన్నారు. అమరావతి రాజధానిగా ఉంటుందన్న ఆలోచనతో 20 వేల కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం- అమరావతి హైవే రోడ్డును 28 వేల కోట్ల రూపాయలతో కేంద్రం ఖరారు చేసింది.. చివరకు ఆ రోడ్లకు భూములు సేకరించే పని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరిగా చేయడం లేదన్నారు. విభజన సమయంలో ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ లాం లో ఏర్పాటు చేసేందుకు నిధులు ఇచ్చారు.. గత ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడం వల్ల 350 కోట్ల నిధులు వెనక్కి వెళ్లాయన్నారు.                                   

 ఏపీలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి కేంద్రమే నిధులు ఇస్తోందని పురందేశ్వరి స్పష్టం చేశారు.  ఏపీ ప్రభుత్వానికి అప్పులు చేసే విషయంలో ఉన్న శ్రద్ధ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో లేదు అని విమర్శించారు  . ఒక పెద్ద పరిశ్రమ రాష్ట్రానికి రాలేదు.. మన పిల్లలకు ఉపాధి కల్పించే పరిస్థితి లేదు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.. గ్రామీణ అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చారు.. కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లించి జేబులు నింపుకోవడం తప్ప వైసీపీ నాయకులకు అభివృద్ధి మీద దృష్టి లేదని విమర్శలు గుప్పించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget