Modi gift to Pawan: పవన్ కల్యాణ్‌కు చిన్న గిఫ్ట్ ఇచ్చిన మోదీ - అదేమిటంటే ?
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ చిన్న గిఫ్ట్ ఇచ్చారు. అది ఏమిటన్నది క్లారిటీ లేదు కానీ.. దాన్ని తీసుకుని పవన్ మురిసిపోయారు.

Prime Minister Modi small gift to Pawan Kalyan: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పవన్ కల్యాణ్ మధ్య ఓ ప్రత్యేకమైన బాండింగ్ ఉంది. అది మరోసారి కనిపించింది. అమరావతి రీ స్టార్ట్ సభా వేదికపై పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ చిన్న గిఫ్ట్ ఇచ్చారు. అదేమిటన్నది మాత్రం ఇంకా స్పష్టత లేదు. పవన్ కల్యాణ్ సభా వేదికపై ప్రసంగించారు. ప్రధాని మోదీకి అర్థమయ్యేలా కొన్ని వాక్యాలను ఇంగ్లిష్ , హిందీలోనూ ప్రసంగించారు. పహల్గాం విషయంలో ప్రధాని మోదీకి అందరం అండగా ఉంటామని చెప్పారు.
స్పీచ్ అయిపోయిన తర్వాత పవన్ కల్యాణ్ తన సీట్లో కూర్చునే సమయంలో.. మోదీ పిలిచారు. దగ్గరకు వచ్చిన పవన్‌కు తన చేతిలో ఉన్న చిన్న గిఫ్ట్ ను ఇచ్చారు.
PM Modi calls Pawan Kalyan and gave him Special Gift
— Vidya Sagar Gunti (@GVidya_Sagar) May 2, 2025
డిప్యూటీ సీఎం పవన్ ను పిలిచి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోడీ
ప్రధాని మోడీ ఇచ్చిన గిఫ్ట్ ఎంటా అని ఆసక్తికర చర్చ #PMModi ##PawannKalyan #AmaravatiTheRise pic.twitter.com/LG7ThuZaON
మోదీ ఇచ్చిన గిఫ్ట్ ను పవన్ తీసుకుని .. పెద్దగా నవ్వి .. నమస్కారం పెట్టారు. పవన్ ఆ గిఫ్టుతో చాలా సంతోషంగా కనిపించారు. మోదీ ఏమి గిఫ్ట్ ఇచ్చినా అది అమూల్యమైనదే. చంద్రబాబు కూడా పవన్ కు గిఫ్ట్ ఇచ్చే సమయంలో పవన్ ను అభినందించారు.
ఆ గిఫ్ట్ ఏమిటన్నది పవన్ కల్యాణ్ చెప్పలేదు. కానీ మోదీ చాక్లెట్ లాంటిది ఇచత్చారని అంటున్నారు. మోదీ ఇస్తున్న గిఫ్ట్ దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి.
Pawala ki pawala chocolate gift 🎁 echina modi for his outstanding speech pic.twitter.com/gEeJlvxkZy
— a'BILLA'sh అభిలాష్ (BILLA😎). (@abhilashonfire) May 2, 2025
పవన్ కల్యాణ్‌తో ప్రధాని మోదీ సరదాగా ఉంటారు. గతంలో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ దీక్షా వస్త్రాల్లో ఉన్నారు. అప్పుడు హిమాలయాలకు కానీ వెళ్లిపోతున్నావా పవన్ అని ప్రశ్నించారు. సీరియస్ గా అడిగే సరికి పవన్ కూ అర్థం కాలేదు..కానీ అర్థమయ్యే సరికి బిగ్గరగా నవ్వుకున్నారు. ఇప్పుడు కూడా పవన్ తో మోదీ చాలా సరదాగా ఉన్నారు.
మోదీ గిఫ్ట్ ఇస్తున్న వీడియోను జనసైనికులు వైరల్ చేస్తున్నారు. మా రేంజ్ వేరు అని కాలర్ ఎగరేస్తున్నారు.
Mana pawan ku modi ji oka gift pic.twitter.com/I9dvnLg4sM
— Kotisurya Surya (@KotisuryaS25977) May 2, 2025
మొత్తంగా సభలో పవన్ కు మోదీ ఇచ్చిన గిఫ్ట్ మాత్రం హాట్ టాపిక్ అయింది.





















