అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Balineni Srinivas: బాలినేని మౌనవ్రతం, ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ పరిస్థితి ఏంటి?

ప్రకాశం జిల్లాలో ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ కార్యక్రమంపై సమీక్ష, విలేకరుల సమావేశాన్ని ఒంగోలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బాలినేని కూడా హాజరయ్యారు కానీ మాట్లాడకుండానే వెనుదిరిగారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ గెలుచుకుంది 8 మాత్రమే. అంటే ప్రకాశం జిల్లాలో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇవ్వలేకపోయినా తన ఉనికి మాత్రం చాటుకుంది. ఆ తర్వాత కరణం బలరాం వంటివారు వైసీపీవైపు వెళ్లినా.. ఇప్పటికా అక్కడ వైసీపీకి క్లీన్ స్వీప్ చేసేంత బలం లేదనేది బహిరంగ రహస్యమే. దానికి తోడు వైసీపీలోనే వర్గ పోరు ముదిరిపోయింది. ప్రకాశం జిల్లాకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి పెద్ద దిక్కుగా ఉన్నా.. ఇప్పుడు ఆయనతోనే అసలు సమస్య మొదలైంది. మార్కాపురంలో సీఎం జగన్ సభ తర్వాత బాలినేని అలకపాన్పు ఎక్కారు. ఓబీసీ నేస్తం నిధుల్ని బాలినేని చేతులమీదుగానే విడుదల చేసినా ఆయన అలక తీరలేదు. ప్రస్తుతం ఆయన పార్టీపై గుర్రుగానే ఉన్నారు. ఇటీవల మా నమ్మకం నువ్వే జగన్ రివ్యూ మీటింగ్ లో బాలినేని అసలు మైక్ పట్టుకుని మాట్లాడనే లేదు. దీంతో ఆయన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 

మార్కాపురం సభకు సీఎం జగన్ వచ్చే సమయంలో హెలిప్యాడ్ వద్దకు బాలినేని వాహనాన్ని వెళ్లనీయకపోవడంతో అసలు గొడవ మొదలైంది. దీని వెనక ఎవరున్నారు, ఎవరి ప్రోత్సాహం వల్ల బాలినేనిని సదరు సీఐ అడ్డుకున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కానీ బాలినేని మాత్రం, తన సొంత జిల్లాలో తనను ఎవరో తక్కువచేసి చూస్తున్నారని రగిలిపోతున్నారు. అందుకే ఆయన తాజా ప్రెస్ మీట్ లో అసలు మైక్ ముట్టుకోలేదు. సహజంగా పక్క జిల్లాల వ్యవహారాలను కూడా బాలినేని చక్కబెడుతుంటారు. ఆయన సమన్వయకర్త బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. అలాంటి ఆయన.. ఇప్పుడు సొంత జిల్లా విషయంలోనే అలిగి ఉన్నారనే విషయం అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారింది. 

ప్రకాశం జిల్లాలో ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ కార్యక్రమంపై సమీక్ష, విలేకరుల సమావేశాన్ని ఒంగోలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బాలినేని కూడా హాజరయ్యారు కానీ మాట్లాడకుండానే వెనుదిరిగారు. సమీక్షకు జిల్లాలోని ఎమ్మెల్యేలంతా హాజరు కావాల్సి ఉన్నా.. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి రాలేదు. మార్కాపురం సీఎం సభ విషయంలో జరిగిన గందరగోళం తర్వాత ఆయనతో కలిసేందుకు బాలినేని ఇష్టపడలేదని, అందుకే జిల్లా కేంద్రంలో జరిగిన ఆ సమావేశానికి ఆయన రాలేదని అంటున్నారు. 

గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, సంతనూతలపాడు, దర్శి ఎమ్మెల్యేలంతా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. వీరిలో కొంతమంది వ్యక్తిగత పనులున్నాయని చెప్పి అనుమతి తీసుకున్నా, మరికొందరు కావాలనే ఈ కార్యక్రమానికి రాలేదని చెప్పుకోవాలి. దీనికి కారణం కూడా బాలినేని మార్కాపురం ప్రోటొకాల్ గొడవేనని తెలుస్తోంది. పోనీ బాలినేని హాజరైనా, ఆయన మాట్లాడారా అంటే అదీ లేదు. ఆయన కూడా సైలెంట్ గా ఉండటంతో జిల్లా మంత్రి హోదాలో ఆదిమూలపు సురేష్ ఏదో మాట్లాడేసి వెళ్లిపోయారు. ప్రాంతీయ సమన్వయ కర్తగా ఉన్న బాలినేని సైలెంట్ గా ఉండటం చర్చనీయాంశమైంది. 

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పటికే వైసీపీ ఇన్ చార్జ్ లను పెట్టింది. చీరాలలో  కరణం బలరాం వైసీపీలో చేరి ఆయనే అక్కడ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఇన్ చార్జ్ ల వ్యవహారం కొంతమంది స్థానిక నేతలకు మింగుడు పడటంలేదు. ఈ పంచాయితీలు చేయడానికి బాలినేని ప్రయత్నించినా కొన్నిసార్లు సాధ్యపడలేదు. అందులోనూ ఇప్పుడు ఆయనకు సొంత సమస్యే చికాకు పెడుతోంది. సొంత జిల్లాలో బాలినేనికి అవమానం అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోయే సరికి ఆయనకు ఏం చేయాలో తెలియడంలేదు. అందుకే కొన్నాళ్లు ఆయన మౌన వ్రతం పాటించినట్టు ఉన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Embed widget