అన్వేషించండి

ఐటీ కారిడార్‌లో పొలిటికల్ కేక- చంద్రబాబు అరెస్ట్ పై భగ్గుమన్న ఐటీ ఉద్యోగులు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై అన్ని వర్గాల భగ్గుమంటున్నారు. 24గంటలూ కార్యాలయాలకే పరిమితమయ్యే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, తొలిసారి రోడ్డెక్కారు. చంద్రబాబు అరెస్ట్ ను నిరసించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై అన్ని వర్గాల భగ్గుమంటున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడి వాహనాలను అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొన్నటి వరకు ఏపీకే పరిమితమమైన నిరసనలు, ఇప్పుడు పక్క రాష్ట్రాలకు పాకాయి. ఐటీకి కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. 

24గంటలూ కార్యాలయాలకే పరిమితమయ్యే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, తొలిసారి రోడ్డెక్కారు. చంద్రబాబు అరెస్ట్ ను నిరసించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలనే నినదించడంతో హైదరాబాద్‌ ఐటీ క్షేత్రం దద్దరిల్లింది. మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గంలో...వేల మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఆందోళనకు దిగారు. చంద్రబాబు అరెస్ట్ అమానుషమని, తామంతా ఉన్నత స్థితిలో ఉన్నామంటే కారణం చంద్రబాబేనని స్పష్టం చేశారు. చంద్రబాబును విడుదల చేసేదాకా ఆందోళనలు కొనసాగిస్తామని తెలంగాణ తెదేపా ఐటీ విభాగం అధ్యక్షుడు హరికృష్ణ తెలిపారు. నగరంలో ఐటీ వృద్ధికి ఆద్యుడైన ఆయనను అరెస్టు చేయడం అమానుషమన్నారు.

తెలంగాణ తెదేపా ఐటీ విభాగం ఆధ్వర్యంలో విప్రో కూడలిలో మానవహారం, మౌన దీక్ష చేపడుతున్నట్లు ఆ విభాగం అధ్యక్షుడు హరికృష్ణ పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం అందుకున్న ఐటీ ఉద్యోగులు...మధ్యాహ్నం 3గంటలకు పెద్దసంఖ్యలో విప్రో సర్కిల్ కు చేరుకున్నారు. నగరం నలుమూలల నుంచీ స్వచ్ఛందంగా కదలివచ్చిన టెకీలు నానక్‌రామ్‌గూడ విప్రో కూడలిలో ధర్నాలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక దశలో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సాయంత్రం 4.30 గంటల వరకు నిరసన కొనసాగింది. జై బాబు, జైజై బాబు అంటూ నినదించారు. ఐఎం విత్ సీబీఎన్ ప్లకార్డులను ప్రదర్శించారు. 

బాబును వెంటనే విడుదల చేయాలి, ఐ యాం ఫర్‌ బ్రింగ్‌ బాబు బ్యాక్‌, నిరంతర శ్రామికుడు చంద్రబాబును వెంటనే విడుదల చేయాలి, ఐటీ అంటే బాబు, బాబు అంటే ఐటీ అనే నినాదాలున్న ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. నిరసన ప్రదర్శనకు మహిళలూ భారీ సంఖ్యలో హాజరయ్యారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువ టెకీలతోపాటు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారూ తరలివచ్చారు. చంద్రబాబు వల్లే మైక్రోసాప్ట్‌లో ఉద్యోగం వచ్చిందని...పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు ఓ యువతి వెల్లడించింది. ఆయన్ను అరెస్టు చేయడం అన్యాయమంటూ రోదించారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చూపిస్తామంటూ...కొందరు మహిళలు సీఎం జగన్ కు వార్నింగ్ ఇచ్చారు. 

హైదరాబాద్ కేపీహెచ్ బీలో ఐటీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ కు వ్యతిరేకంగా నినదించారు. ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కేపీహెచ్ బీ కాలనీలోని రోడ్ నెంబరు-1 వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వందలాది మంది ఐటీ ప్రొఫెషనల్స్ పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా జై బాబు జైజై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vikatakavi Web Series: 'వికటకవి' టైటిల్ ఎందుకు... సిరీస్‌లో ఏం చేశారు? ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన దర్శకుడు ప్రదీప్ మద్దాలి
'వికటకవి' టైటిల్ ఎందుకు... సిరీస్‌లో ఏం చేశారు? ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన దర్శకుడు ప్రదీప్ మద్దాలి
Embed widget