అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టులోని ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మాణ పనులను పరిశీలించింది. గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాల్లో పనులను వీక్షించారు.
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మాణంపై ఆరా!
Polavaram Project: పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణులు, కేంద్ర జలశక్తి శాఖ అధికారులు బుధవారం పరిశీలించారు. వీరి పర్యటన 17వ తేదీ వరకు జరగనుంది.

- అంతర్జాతీయ నిపుణులు పోలవరం ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పనుల పరిశీలన.
- గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాల్లో పనులను నిశితంగా పరిశీలించారు.
- తొలిరోజు పనుల పురోగతిపై నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు.
- ఇది గత సూచనల అమలు పరిశీలనకు 8వ పర్యటన.
Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ నిర్మాణ పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది. ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్‌లోని గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించిన నిపుణులు.. అనంతరం జీ హిల్ వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు నిర్మాణ పనులను వీక్షించారు. ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న నిర్మాణాలను రాష్ట్ర జలవనరుల శాఖ, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ప్రతినిధులను అడిగి తెలుసుకుంది. ఛాయాచిత్రాల ద్వారా ఇప్పటివరకు చేపట్టిన పనులు, నిర్మాణాల ప్రస్తుత స్థితిగతులను సిబ్బంది వారికి తెలియజేశారు. తొలిరోజు పర్యటన అనంతరం నిర్వహించిన సమీక్షలో ఇప్పటివరకు జరిగిన పనుల పట్ల నిపుణులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ముందు సమీక్ష.. ఆపై క్షేత్రస్థాయి పరిశీలన
దిల్లీ నుంచి రాజమహేంద్రవరం చేరుకున్న అంతర్జాతీయ నిపుణులు, కేంద్ర జలశక్తి శాఖకు చెందిన వివిధ విభాగాల అధికారులు అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు ఆఫీసుకు చేరుకున్నారు. వారికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, ఎంఈఐఎల్ ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం పీపీఏ సీఈఓ సంజీవ్ వోహ్రా అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. గత పర్యటనల్లో నిపుణులు చేసిన సూచనలు, సలహాల మేరకు చేపట్టిన చర్యలు, ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిని అధికారులు వారికి వివరించారు.
ఎనిమిదో విడత పర్యటన
పోలవరం ప్రాజెక్టును ఇప్పటికే ఏడు విడతల్లో సందర్శించిన అంతర్జాతీయ నిపుణులు ప్రస్తుతం ఎనిమిదో విడత పర్యటనలో భాగంగా ప్రాజెక్టు పనులను పరిశీలిస్తోంది. ఈ ఏడాది మే నెలలో నిపుణుల బృందం పోలవరాన్ని సందర్శించింది. గతంలో ఇచ్చిన సూచనలు, సలహాలను అమలు చేసిన తీరు, వాటి ఆధారంగా చేపట్టిన పనుల పురోగతిని ప్రస్తుత పర్యటనలో పరిశీలిస్తోంది. అంతర్జాతీయ నిపుణులు, కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం పర్యటన ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగనుంది.
Also Read: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
సమావేశంలో
ఈ సమావేశంలో అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొనెల్లీ, గ్లాన్‌ఫ్రాంకో డి సిక్కో, సీన్ హించ్‌బెర్గర్, డేవిడ్ పాల్ పాల్గొన్నారు. కేంద్ర జలసంఘం డిజైన్స్ విభాగం చీఫ్ ఇంజినీర్ సరబ్జిత్ సింగ్ బక్షి, పీపీఏ సభ్య కార్యదర్శి ఎం. రఘురాం, ఉప సంచాలకుడు ఎ. ప్రవీణ్, చీఫ్ ఇంజినీర్ ఎం. రమేష్‌కుమార్, సహాయ సంచాలకుడు సీహెచ్ సంజీవ్, నేషనల్ వాటర్ సిస్టం డైరెక్టర్ పన్నీర్ సెల్వం, ఉప సంచాలకులు అశ్వనీకుమార్ వర్మ, గౌరవ్ తివారీ, సహాయ సంచాలకుడు హేమంత్ గౌతమ్ పాల్గొన్నారు.
Also Read: స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Frequently Asked Questions
పోలవరం ప్రాజెక్టును ఎవరు పరిశీలించారు?
పోలవరం ప్రాజెక్టు పనులపై నిపుణుల బృందం అభిప్రాయం ఏమిటి?
ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించిన నిపుణులు.. ఇప్పటివరకు జరిగిన పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గత సూచనల అమలు తీరును కూడా వారు పరిశీలించారు.
ఇది నిపుణుల బృందం ఎన్నవ పర్యటన?
అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టును ఎనిమిదో విడత పర్యటనలో భాగంగా పరిశీలిస్తోంది. ఈ ఏడాది మే నెలలో చివరిసారి సందర్శించారు.
పర్యటనకు ముందు నిపుణులు ఎవరితో సమావేశమయ్యారు?
దిల్లీ నుంచి రాజమహేంద్రవరం చేరుకున్న నిపుణులు, కేంద్ర జలశక్తి శాఖ అధికారులు పీపీఏ సీఈఓ సంజీవ్ వోహ్రా అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















