అన్వేషించండి

Polavaram Project News: 45.72 మీటర్ల వరకు పోలవరం నిర్మాణం..  2027 జూన్‌కల్లా ఫేజ్-1 పనులు పూర్తి: కేంద్రం 

Polavaram Phase 1 Update | పోలవరం ఫేజ్-1 నిధులు 41.15 మీటర్లకే పరిమితమైనా, సివిల్ పనులు 45.72 మీటర్ల వరకు సాగుతాయని, 2027 జూన్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యమని కేంద్రమంత్రి తెలిపారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేంద్రం పోలవరం తొలి దశ పనులు 2027 జూన్‌కు పూర్తి.
  • 41.15 మీటర్ల నీటి నిల్వకు నిధులు, పనులు 45.72 మీటర్లకు.
  • పోలవరంకు రూ.30,436 కోట్ల నిధులు, రూ.12,157 కోట్లు బకాయి.
  • విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వ్యయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాలి; కేంద్రం.

Andhra Pradesh Top Stories | అమరావతి: ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. తొలి దశ కింద కేంద్ర ప్రభుత్వం అందించే నిధులు 41.15 మీటర్ల నీటి నిల్వ మట్టానికే పరిమితమైనప్పటికీ, సివిల్ పనులు మాత్రం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం (FRL) అయిన 45.72 మీటర్ల వరకు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. వైసీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌధరి ఈ వివరాలను లిఖితపూర్వకంగా వెల్లడించారు.

ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని స్పష్టమైన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన సభకు తెలిపారు. ఎంపీ మిథున్ రెడ్డి పోలవరం ఫేజ్-1 నిధుల ఆమోదం, ఇప్పటివరకు విడుదల చేసిన గ్రాంట్లు, 2027 నాటికి నీటి నిల్వ లక్ష్యం, కాలువల నెట్‌వర్క్ పై కేంద్రాన్ని ప్రశ్నలు అడిగారు. వాటితోపాటు విద్యుత్ కేంద్రం, సహాయ పునరావాస బకాయిల వివరాలు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పిస్తున్న తాజా ప్రాజెక్టు నివేదికలు, యుటిలైజేషన్ సర్టిఫికెట్ల పురోగతిపై కేంద్ర మంత్రి సమాధానాలు ఇచ్చారు.

2023 నాటి ధరల ప్రకారం 30,436.95 కోట్ల నిధులు

కేంద్ర మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, 41.15 మీటర్ల ఎలివేషన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసే పోలవరం ఫేజ్ 1 పనులకు 2023 నాటి ధరల అంచనాల ప్రకారం రూ. 30,436.95 కోట్ల నిధులు అందించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ఆమోదించిన మొత్తం బడ్జెట్‌లో ఇంకా కేంద్రం నుంచి రాష్ట్రానికి చెల్లించాల్సిన బాకీ గ్రాంట్ రూ. 12,157.53 కోట్లుగా ఉంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 5,512.40 కోట్లు, గత ఆర్థిక సంవత్సరం 2025-26 లో రూ. 2,810.22 కోట్లను ప్రాజెక్ట్ పనుల కోసం విడుదల చేసింది.

2027 జూన్‌కల్లా పోలవరం ఫేజ్ 1 పూర్తి

ప్రస్తుతం 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసే క్రమంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం సజావుగా సాగుతోందని కేంద్ర మంత్రి వివరించారు. గ్యాప్-1, గ్యాప్-2లలో ప్రధాన డ్యామ్ నిర్మాణంతో పాటు భూసేకరణ, సహాయ పునరావాస పనులు మొత్తం 2027 జూన్‌కల్లా పూర్తి చేస్తామని వెల్లడించారు. అయితే కేంద్ర గ్రాంట్ 41.15 మీటర్ల వరకు ఉండే ఫేజ్-1 పరిధిలోని సివిల్ పనులు, 45.72 మీటర్ల వరకు భూసేకరణ, పునరావాస కార్యక్రమాలు, కాలువల నిర్మాణానికే వర్తిస్తుందని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణ వ్యయాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఏపీ ప్రభుత్వం అవసరమైన టెక్నికల్ డాక్యుమెంట్లు, యుటిలైజేషన్ సర్టిఫికెట్లను సకాలంలో సమర్పిస్తోందని ఆయన తెలిపారు.

 

Frequently Asked Questions

పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులను ఎప్పటిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?

పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేస్తారు.

పోలవరం ప్రాజెక్టులో సివిల్ పనులు ఎంత ఎత్తు వరకు కొనసాగుతాయి?

పోలవరం ప్రాజెక్టులో సివిల్ పనులు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం (FRL) అయిన 45.72 మీటర్ల వరకు కొనసాగుతాయి. అయితే, తొలి దశ నిధులు 41.15 మీటర్ల నీటి నిల్వ మట్టానికే పరిమితం.

పోలవరం ప్రాజెక్టులోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణ వ్యయాన్ని ఎవరు భరిస్తారు?

పోలవరం ప్రాజెక్టులోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణ వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా భరించాల్సి ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదు.

పోలవరం తొలి దశ పనులకు కేంద్రం ఎంత నిధులు ఆమోదించింది?

పోలవరం తొలి దశ (41.15 మీటర్ల నీటి నిల్వ) పనులకు 2023 అంచనాల ప్రకారం కేంద్రం రూ. 30,436.95 కోట్లు ఆమోదించింది. ఇందులో రూ. 12,157.53 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nidadavole Junction: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
Janasena Coordination Committees: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీ.. కోఆర్డినేటర్లు వీరే
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Pawan Kalyan On Fire: సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Advertisement

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
Vijayasai Reddy Political Party: కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
Man Burnt Alive In Car: దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
Crime Thriller OTT : కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
Ranabaali Teaser Date : విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
Embed widget