ప్రాథమిక కనెక్టివిటీ పనులు డిసెంబర్ 2026 నాటికి, ప్రాజెక్టును పూర్తిగా సిద్ధం చేయడం జూన్ 2027 నాటికి లక్ష్యంగా పెట్టుకున్నారు.
Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో మరో కీలక మైలురాయి.. 90.1 శాతం ఫిజికల్ ప్రోగ్రెస్.. వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయడమే లక్ష్యం
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు 90.1 శాతం ఫిజికల్ ప్రోగ్రెస్ సాధించిందని అధికారులు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.

- డిసెంబర్ 2026 నాటికి కనెక్టివిటీ, జూన్ 2027కు పూర్తి లక్ష్యం.
Polavaram Project: ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతుంది. తాజాగా పోలవరం ప్రాజెక్టు మరో ప్రధాన మైలురాయిని చేరుకుంది. సెప్టెంబర్ నాటికి ఈ ప్రాజెక్టు మొత్తం నిర్మాణంలో 90.1 శాతం ఫిజికల్ ప్రోగ్రెస్ సాధించగా, మొదటి విడత (Phase I) కింద 78 శాతం పనులు పూర్తైనట్లు అధికారులు తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నీటి వనరుల శాఖ కార్యదర్శి అధ్యక్షతన అక్టోబర్ 12న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సమర్పించిన నివేదిక ప్రకారం ప్రాజెక్టుకు సంబంధించిన హెడ్‌వర్క్స్, ప్రధాన కాలువల పనులు తుది దశకు చేరుకున్నాయి.
పూర్తైన ప్రధాన పనులు, ఆర్ అండ్ ఆర్
స్పిల్‌వే, గ్యాప్-3లో మెయిన్ డ్యామ్, గ్యాప్-1, 2లలో డయాఫ్రమ్ వాల్స్, అప్‌స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్ కాఫర్ డ్యామ్‌లు, అప్‌స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ బట్రెస్, కుడి కాలువ పనులు వంద శాతం పూర్తయ్యాయి. సివిల్ పనుల్లో 88 శాతం ఆర్థిక పురోగతి, భూసేకరణలో 95.6 శాతం పూర్తైందని నివేదిక తెలిపింది. అయితే, నిర్వాసితుల పునరావాసం, పునర్నిర్మాణం పనులు ప్రస్తుతం 51.9 శాతం వద్ద ఉండటంతో, ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి అధికారులు దీనిపై దృష్టి సారించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు
ఆగస్టు 28, 2024న కేంద్ర క్యాబినెట్ ఫేజ్-1 వ్యయం రూ. 30,436.95 కోట్లకు సవరించి ఆమోదం తెలిపింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాజెక్టుకు నిరంతరంగా ఆర్థిక సహాయం అందుతోంది. ఏప్రిల్ 1, 2014 నుండి ఇప్పటివరకు కేంద్రం రూ. 23,485.31 కోట్లను విడుదల చేసింది. ఇందులో నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసేందుకు 2024–25, 2025–26 సంవత్సరాలకు గానూ రూ. 7,862.93 కోట్ల ముందస్తు గ్రాంట్ మంజూరు చేసింది.
Also Read: కుట్రలతో ఎన్నికలను అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యం.. ఎస్ఈసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం- కూటమి పార్టీల ఉమ్మడి ప్రకటన
ప్లానింగ్
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశాయి. డిసెంబర్ 2026 నాటికి ప్రాజెక్టు ప్రాథమిక కనెక్టివిటీ పనులన్నీ పూర్తి చేయనున్నారు. మార్చి 2027 నాటికి గ్యాప్-1లోని ఎర్త్-కమ్-రాక్-ఫిల్ డ్యామ్ ఎంబ్యాంక్మెంట్ పనులు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. జూన్ 2027 నాటికి గ్యాప్-2 ఎంబ్యాంక్మెంట్ పనులతో పాటు స్కాడా కంట్రోల్ బిల్డింగ్, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లు, యాక్సెస్ రోడ్లు, స్లోప్ ప్రొటెక్షన్ పనులు పూర్తి చేసి ప్రాజెక్టును రెడీ చేయనున్నారు.
Also Read: ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు బ్రేక్.. ఎస్ఈసీ సంచలన ప్రకటన.. అభ్యర్థుల తుది జాబితాపై ఉత్కంఠ!
Frequently Asked Questions
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్న సమయం ఎంత?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















