Pawan Kalyan: ఊపిరాడకుండా పవన్ షెడ్యూల్! సమాంతరంగా సినిమాలు, రాజకీయాలు - అప్పటిదాకా ఇంతే
జనసేనాని పవన్ వారాహి విజయయాత్ర ఇప్పటికే మూడు విడతలు ముగిసింది. ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటించారు.
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత కొన్నేళ్లుగా సినిమాలు, రాజకీయాలు రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డిసెంబర్ దాకా ఆయనకు హెక్టిక్ షెడ్యూల్ ఉండబోతోందని తెలుస్తోంది.
జనసేనాని పవన్ వారాహి విజయయాత్ర ఇప్పటికే మూడు విడతలు ముగిసింది. ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటించారు. అయితే తర్వాతి విడత గురించి తాజాగా అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ ద్వితీయార్ధంలో పవన్ మలి విడత యాత్ర ఉండొచ్చని సమాచారం.
అప్పట్నుంచి డిసెంబర్ చివరిదాకా పవన్ కల్యాణ్ సినిమాలు, వారాహి యాత్రకు ఒకేలా సమయం కేటాయించబోతున్నట్టు సమాచారం. సెప్టెంబర్ రెండో భాగం నుంచి డిసెంబర్ దాకా 15 రోజులు సినిమాల షూటింగ్స్, మరో 15 రోజులు వారాహి యాత్ర ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారట.
డిసెంబర్ చివరి నుంచి మాత్రం ఇక కంప్లీట్ ఫోకస్ రాజకీయాల మీదే ఉండబోతోంది. వరుసగా 100 రోజుల కార్యాచరణ ఉంటుందని ప్రతి రోజూ బహిరంగ సభ ఉంటుందని ప్రతి నియోజకవర్గంలోనూ సభ ఏర్పాటు చేసి పవన్ ప్రసంగిస్తారని సమాచారం. అంటే కొన్నిసార్లు రోజుకు 2-3 నియోజకవర్గాలను కూడా కవర్ చేస్తారన్నమాట.
ఇక పవన్ కల్యాణ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ‘ఓజీ’ సినిమా మాత్రమే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అటు మరో సినిమా ‘హరిహర వీరమల్లు’ నుంచి అప్డేట్ వచ్చి చాలా కాలం అయింది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ది కూడా అదే పరిస్థితి. మరి ఇంతటి టైట్ ప్యాక్డ్ షెడ్యూల్ లో ఎన్నికలు వచ్చేలోగా ఈ సినిమాల షూటింగ్స్ ని పవన్ కల్యాణ్ ఏ మేరకు పూర్తి చేస్తారనేది ఆసక్తిగా మారింది.