(Source: ECI/ABP News/ABP Majha)
Pawan Kalyan: సీఎం బిడ్డ అయి, వేలకోట్లుంటే పార్టీ నడవదు - షర్మిలపై పవన్ కీలక వ్యాఖ్యలు, బీఆర్ఎస్ పైన కూడా
తణుకు నియోజకవర్గం నాయకులు, వీర మహిళలతో పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహించారు.
ఒక రాజకీయ పార్టీని నడిపించాలంటే సిద్ధాంతాలు చాలా ముఖ్యమని జనసే అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆ మధ్య షర్మిల పార్టీ పెట్టినప్పుడు తాను అభినందించానని, అలా పార్టీలు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. కానీ, ప్రస్తుతం వారు పార్టీని ఉంచుతారో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. కాంగ్రెస్ లో కలిపేస్తారని తాను కూడా వార్తలు వింటున్నానని అన్నారు. ముఖ్యమంత్రి బిడ్డలైనా, వేల కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నా కూడా రాజకీయ పార్టీకి అవి సరిపోవని అన్నారు. తాము డబ్బులు లేకపోయినా పార్టీని ఎలా నడపగలుగుతున్నామని అన్నారు. భావతీవ్రత, సైద్ధాంతిక బలం, వైఎస్ఆర్ సీపీ లేదా ఇతర పార్టీల ఆరాచకాలను ఎదిరించే తత్వం తమకు ఉంది కాబట్టే, పార్టీని నడిపించగలుగుతున్నామని అన్నారు. ఐడియాలజీ అనేది చాలా ముఖ్యమని అన్నారు. తణుకు నియోజకవర్గం నాయకులు, వీర మహిళలతో పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహించారు.
బీఆర్ఎస్ పైనా కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో వచ్చిన పార్టీ భారత రాష్ట్ర సమితి అని ఎందుకు మారిందని అడిగారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఉద్భవించిన ఒక పార్టీ ఇప్పుడు భారత దేశానికి పని చేస్తామనేలా పేరు మారిదంటే.. కొంత కాలానికి చిన్న ఐడియాలజీ సరిపోదని అన్నారు. పెద్ద ఐడియాలజీ తీసుకుంటారని అన్నారు. ఇవన్నీ లేకుండా జనసేన ఏడు బలమైన యూనివర్సల్ ప్రిన్సిపల్స్ పాటిస్తోందని అన్నారు. కొంత కాలం తర్వాత భారతదేశపు రాజకీయాల్ని ఆ ఏడు సూత్రాలే నిర్దేశిస్తాయని అన్నారు.
ఓ నేతను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ఎద్దేవా!
Also Read: అక్కడికి వచ్చి తేల్చుకుంటా - శ్రీకాళహస్తి ఘటనపై పవన్, భ్రమల్లో జగ్గుభాయ్ గ్యాంగ్ అని ఎద్దేవా!