Janasena : జనసేనలోకి ముద్రగడ - 2 రోజుల్లో పార్టీలో చేరికకు ఆహ్వానించనున్న పవన్ !
Pawan Kalyan : రెండు రోజుల్లో ముద్రగడను కలిసి పార్టీలోకి పవన్ కల్యాణ్ ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ప్రకటించారు.
Pawan to Meet Mudragada : జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు, మూడు రోజుల్లో కాపు ఉద్యమ నేత ముద్రగ పద్మనాభంను కలిసే అవకాశం ఉంది. ముద్రగడ పద్మనాభం నివాసానికి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి వెళ్లారు. ముద్రగడ, బొలిశెట్టి ఇద్దరే అరగంటకు పైగా చర్చలు జరిపారు. ముద్రగడను బొల్లిశెట్టి కలవడం ఇది రెండోసారి. ఈ క్రమంలోనే ముద్రగడ జనసేనలో చేరడం ఖరారైంది. పవన్ కళ్యాణ్ స్వయంగా ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ స్వయంగా కిర్లంపూడి వచ్చి ముద్రగడని పార్టీలోకి ఆహ్వానిస్తారని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. ఈనెల 20 లేదా 23న పవన్ ముద్రగడ దగ్గరకివస్తారని, ఆయనతో సమావేశమవుతారని తెలిపారు. ఉద్యమ నాయకుడిని నేను వచ్చే ఆహ్వానిస్తే గౌరవంగా ఉంటుందని పవన్ చెప్పారన్నారు. జనసేనలో చేరడానికి ముద్రగడ పద్మనాభం అంగీకరించారన్నారు.
తాను వైసీపీలోకి వచ్చే ప్రసక్తే లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను కలవడానికి ముద్రగడ పద్మనాభం ఇష్టపడలేదు. తోట త్రిమూర్తులను రావొద్దని, వచ్చినా కలవనని పద్మనాభం చెప్పారు. మీకు మాకు సెట్ అవ్వదని .. టీడీపీ లేదా జనసేనలోకి వెళ్తాం, లేదా ఇంట్లో కూర్చుంటాము అని స్పష్టత ఇచ్చారు. వైసీపీలోకి వచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. వచ్చి మీసమయం వృధా చేసుకోవద్దు, మీ పని మీరు చూసుకోండి అంటూ వైసీపీకి క్లారిటీ ఇచ్చి పంపించడంతో ముద్రగడ టీడీపీ, లేదా జనసేనలో చేరడం ఖాయమని రెండు రోజుల కిందట స్పష్టత వచ్చింది.
ఏపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఆయా పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 12 నుండి 15 శాతం ఉంటాయి. ఆయా పార్టీల గెలుపు, ఓటములను కాపు సామాజిక వర్గం ఓటర్లు ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల సాధన కోసం గత కొంత కాలంగా ముద్రగడ పద్మనాభం పోరాటం చేశారు. అయితే వైసీపీ వచ్చిన తర్వాత పోరాటాన్ని విరమించుకున్నారు. ఆ పార్టీతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేసినప్పుడు పవన్ పై విరుచుకుపడ్డారు. తనపై పోటీకి రావాలని సవాల్ చేశారు. లేదా కాకినాడో పోటీ చేయాలన్నారు
ఇప్పుడు ముద్రగడకు టిక్కెట్ ఇచ్చేందుకు వైసీపీ నిరాకరించడంతో ఆయన నొచ్చుకున్నారు. ఆ పార్టీలో కాకండా.జనసేనలో చేరాలని అనుకుంటున్నారు. గతంలో టీడీపీలో పని చేశారు. కానీ టీడీపీతో ఆయనకు తీవ్రమైన విబేధాలున్నాయి. టీడీపీ నేతలు కూడా ఆయన మద్దతు ఇస్తే సరే అంటారు కానీ తమ పార్టీలో చేరాలని కోరుకోవడం లేదు. అందుకే జనసేన అయితే బెటర్ అని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు.