Deputy CM meets CM : సచివాలయంలో చంద్రబాబుతో పవన్ భేటీ - చర్చించిన అంశాలు ఇవే
Andhra News : అమరావతి సచివాలయంలో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. బుధవారం బాధ్యతలు చేపట్టనున్నందున పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
Pawan Kalyan had a meeting with Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమరావతిలోని సచివాలయంలో సమావేశం అయ్యారు. పవన్ కల్యాణ్ బుధవారం మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో మర్యాదపూర్వక భేటీ నిర్వహించారు. తనకు కేటాయించిన శాఖలకు సంబంధంచిన కీలక వివరాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ మొదటి సారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఉపముఖ్యమంత్రి అయ్యారు. అంతే కాకండా కీలకమైన శాఖలను ఆయనకు కేటాయించారు. ఈ క్రమంలో పవన్, చంద్రబాబు భేటీ పై ఆసక్తి ఏర్పడింది.
పవన్ కల్యాణ్ సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్‌ను పరిశీలించారు. అంతకు ముందు విజయవాడలో తన క్యాంపు కార్యాలయన్ని పరిశీలించారు. తన కార్యాలయంలోనే ఆయన మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అంతకు ముందు పవన్ కల్యాణ్ ర్యాలీగా సచివాలయానికి వచ్చారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారి రావడంతో అమరావతి రైతులు ఘనస్వాగతం పలికారు. సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం పూలు చల్లుతూ స్వాగతం పలికారు. పలు చోట్ల గ్రామస్తులు ఆయనపై పూలవర్షం కురిపించారు.
పవన్ కల్యాణ్ వెంట జనసేన పార్టీకి చెందిన మరో ఇద్దరు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. వారు ఇప్పటికే తమకు కేటాయించిన శాఖల బాధ్యతలను తీసుకున్నారు. పవన్ చంద్రబాబు మధ్య రాష్ట్రంలో రాజకీయంగా, పాలనా పరంగా ఎదురు కానున్న సవాళ్ల గురించి చర్చ జరిగినట్లుగా తెలస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ సందర్శన..అక్కడి పరిస్థితుల్ని చంద్రబాబు పవన్ కల్యాణ్‌కు వివరించారు. పోలవరం పూర్తి చేయాలంటే ఎంతో కష్టపడాల్సి ఉందని చెప్పినట్లుగా తెలుస్తోంది. మరో వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా చర్చించు. అసెంబ్లలో ప్రతీ విభాగానికి సంబంధించిన శ్వేతపత్రం ప్రకటించాలని ఇప్పటికే నిర్ణయించారు. అప్పుల విషయంలో ఒక్క చిన్న తప్పు లేకుండా మొత్తం ప్రజల ముందు పెట్టాలని అనుకుంటున్నారు.
మరో వైపు పవన్ కు ప్రభుత్వం వై ప్లస్ సెక్యూరిటీ కల్పించింది. ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. గతంలో జగనమోహన్ రెడ్డి ఉపయోగించిన కాన్వాయ్ లోని బుల్లెట్ ఫ్రూఫ్ కారును పవన్ ను కేటాయించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. మిగతా అందరికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంచిన ప్రోటోకాల్ ప్రకారం భద్రత ఉంటుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భద్రతను ఇంకా రివ్యూ చేయనందున ఇప్పటికీ 50d మందికిపైగా పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. అధికారిక కాన్వాయ్‌లు మాత్రం వెనక్కి తీసేసుకున్నారు.