News
News
X

MP Magunta Srinivasulu: ఆ స్కామ్‌తో మాకే సంబంధం లేదు, త్వరలో అన్ని విషయాలు చెప్తా - ఎంపీ మాగుంట క్లారిటీ

లిక్కర్ స్కాం వ్యవహారంలో తన పేరు కూడా చేర్చడంతో తాను ఆశ్చర్యపోయానని ఎంపీ అన్నారు. గతంలో తాను లిక్కర్ వ్యాపారాలు చేసిన మాట కరెక్టేనని అన్నారు.

FOLLOW US: 
Share:

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈడీ కోర్టులో ప్రవేశపెట్టిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఏపీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా రావడంపై ఆయన స్పందించారు. ఇదంతా ఒక కుట్ర అని కొట్టిపారేశారు. ఇది సౌత్ ఇండియా వ్యాపారులపై ఉత్తరాది వారు చేస్తున్న కుట్ర అని విమర్శించారు. అందులో భాగంగానే ఛార్జ్ షీట్ లో తమ పేర్లు చేర్చారని పేర్కొన్నారు. తనకు, తన కుమారుడికి సౌత్ గ్రూప్ లో ఎలాంటి షేర్లు లేవని ఎంపీ మాగుంట చెప్పారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అనుచరుడైన అమిత్ అరోరాతో తాను కానీ, తన కుమారుడు కానీ ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. తప్పుడు ఆరోపణలపై గతంలో కూడా తాను వివరణ ఇచ్చినట్టు గుర్తు చేశారు. మళ్లీ తీరిక చూసుకొని త్వరలోనే ప్రెస్ మీట్ పెడతానని, అన్నీ వివరిస్తానని ఎంపీ మాగుంట చెప్పారు.

లిక్కర్ స్కాం వ్యవహారంలో తన పేరు కూడా చేర్చడంతో తాను ఆశ్చర్యపోయానని ఎంపీ అన్నారు. గతంలో తాను లిక్కర్ వ్యాపారాలు చేసిన మాట కరెక్టేనని, ఇప్పుడు తాము గానీ, తమ కుటుంబ సభ్యులు గానీ అసలు ఆ వ్యాపారాలు చేయడం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు చెప్తానని అన్నారు.

ప్రస్తుతం వెలుగు చూసిన స్కాంలో అమిత్ అరోరా పాత్ర కీలకమని ఈడీ అధికారులు చెప్పిన సంగతి తెలిసిందే. అమిత్ అరోరా కస్టడీ కోరుతూ బుధవారం కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల పేర్లు సహా మరికొందరు ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు, శరత్ రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్, స్రుజన్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఉన్నారు. సౌత్ గ్రూప్ నుంచి రూ. వంద కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చారని ఈడీ తేల్చింది. ఈ విషయాన్ని  అరోరా అంగీకరించారని తెలిపారు. ఈ డీల్‌ను సౌత్ గ్రూప్ నుంచి శరత్ రెడ్డి, కవిత చూసుకోగా..  వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమన్వయపరిచారని ఈడీ చెబుతోంది. ఈ మొత్తం స్కాం గురించి బయటకు రాకుండా ఎప్పటికప్పుడు ఫోన్లు వాడారాని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కవిత కూడా ఫోన్లు మార్చారని.. వాటిని దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ తెలిపింది.

అమిత్ అరోరా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడు. ఇక ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. గురుగ్రామ్ కు చెందిన అమిత్ అరోరా.. దినేష్ అరోరా, అర్జున్ పాండేలతో కలిసి పాలసీని రూపొందించడంలో కీలకంగా పని చేసినట్లు ఈడీ చెబుతోంది. వీరిలో దినేష్ అరోరా ఇప్పటికే అప్రూవర్‌గా మారారు. అమిత్ అరోరా బడ్జీ అనే ప్రైవేట్ కంపెనీ యజమానిగా ఉన్నాడు. సీబీఐ, ఈడీ FIRలో అమిత్ అరోరా తొమ్మిదవ నిందితుడిగా ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు.

Published at : 01 Dec 2022 12:04 PM (IST) Tags: Magunta Srinivasulu Reddy Delhi Liquor Scam Ongole MP Amit arora remand report

సంబంధిత కథనాలు

Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని

Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని

దమ్ముంటే వెంకటగిరి వచ్చి పోటీ చెయ్- ఆనం రాంనారాయణ రెడ్డికి నేదురుమల్లి సవాల్

దమ్ముంటే వెంకటగిరి వచ్చి పోటీ చెయ్- ఆనం రాంనారాయణ రెడ్డికి  నేదురుమల్లి సవాల్

Breaking News Live Telugu Updates: చిక్కడపల్లిలో భారీ అగ్ని ప్రమాదం, సమీప బస్తీల్లో జనం భయాందోళన

Breaking News Live Telugu Updates: చిక్కడపల్లిలో భారీ అగ్ని ప్రమాదం, సమీప బస్తీల్లో జనం భయాందోళన

Srikakulam Drone: శ్రీకాకుళం జిల్లాలో వింత డ్రోన్ కలకలం! విమాన తరహాలో, కొన్ని సెన్సార్లు కూడా

Srikakulam Drone: శ్రీకాకుళం జిల్లాలో వింత డ్రోన్ కలకలం! విమాన తరహాలో, కొన్ని సెన్సార్లు కూడా

రసవత్తరంగా నెల్లూరు రాజకీయం- కోటం రెడ్డి స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి!

రసవత్తరంగా నెల్లూరు రాజకీయం- కోటం రెడ్డి స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి!

టాప్ స్టోరీస్

Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు

Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?

Budget 2023: ఇన్‌కం టాక్స్‌లో మోదీ సర్కార్‌ అతిపెద్ద కనికట్టు ఇదే - మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!

Budget 2023: ఇన్‌కం టాక్స్‌లో మోదీ సర్కార్‌ అతిపెద్ద కనికట్టు ఇదే - మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!

Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన

Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన