By: ABP Desam | Updated at : 10 Jun 2023 11:59 AM (IST)
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు- వైసీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ లీడర్ల భేటీ
ఎన్నికలకు వ్యూహాలను సిద్ధం చేస్తున్న టీడీపీ అధినాయకత్వం ఇప్పుడు నెల్లూరు జిల్లాపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే వైసీపీలో తిరుగుబాటు జెండా ఎగరేసి టీడీపీవైపు చూస్తున్న ఇద్దరు లీడర్లతో మంతనాలు ప్రారంభించింది. లోకేష్ పాదయాత్ర నెల్లూరుకు వచ్చే లోపు వారిద్దర్ని పార్టీవైపు ఆకర్షించాలని ప్లాన్ చేస్తోంది.
నెల్లూరులోని వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిని టీడీపీ లీడర్లు కలిశారు. మాజీ మంత్రి అమర్‌నాథ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, వేమిరెడ్డి పట్టాభి వీళ్లద్దరితో మంతనాలు జరిపాారు. సుదీర్ఘంగా చర్చల అనంతరం పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
షెడ్యూల్ ప్రకారం మరో మూడు రోజుల్లో లోకేష్ చేపడుతున్న పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. ఆ జిల్లాలో పాదయాత్రను విజయవంతం చేసేలా టీడీపీ వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పాదయాత్రను శ్రేణులు హిట్ చేశారు. అదే ఊపు నెల్లూరులో కూడా చూపించాలని భావిస్తున్నారు. అందుకే వైసీపీ అధిష్ఠానంతో విభేదిస్తున్న ఇద్దరి నేతలతో మంతనాలు జరుపుతున్నారు.
నెల్లూరు జిల్లాలో వైసీపీ అంతర్గత కుమ్ములాటతో సతమతమవుతోంది. ముగ్గురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బయటకు వచ్చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేశారన్న కారణంతో ఆనం, కోటం రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిపై వేటు వేసింది వైసీపీ హైకమాండ్. దీంతో పార్టీలో కీలకమైన నేతలు లేకపోవడం ఒక ఎత్తైతే... అంతర్గత విభేదాలు మరింత కుంగదీస్తున్నాయి.
ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న ఈ పరిస్థితులో కచ్చితంగా మరికొందరి కీలకమైన నేతలను ఆకర్షించి పార్టీని పటిష్టం చేయాలని భావిస్తోంది టీడీపీ. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు తాము క్లీన్ స్వీప్ చేస్తామని టీడీపీ లీడర్లు భావిస్తున్నారు. అందుకే అనుకూలంగా ఉండే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తోంది.
ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం రాత్రి చంద్రబాబుతో సమావేశమైనట్టు తెలుస్తోంది. ఇప్పుడు టీడీపీ నేతలు ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం ఆసక్తిగా మారింది.
AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్ 'స్పాట్ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం
ANGRAU Admissions: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలకు 27 నుంచి వెబ్ ఆప్షన్లు
Breaking News Live Telugu Updates: ఆసియా గేమ్స్‌లో మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణం
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు నిర్ణయం
Top Headlines Today: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య యూటర్న్- రికార్డుల వేటలో గిల్- మార్నింగ్ టాప్ టెన్ న్యూస్
CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు
Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !
Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్
Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!
/body>