అన్వేషించండి

నెల్లూరు జిల్లాలో ఎన్ఐఏ సోదాలు- కీలక డైరీ స్వాధీనం

నెల్లూరు జిల్లాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఇలియాజ్ అనే వ్యక్తిపై అనుమానంతో అతని ఇంటిలో సోదాలు చేపట్టారు. ఇలియాజ్ డైరీని ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరు జిల్లాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఇలియాజ్ అనే వ్యక్తిపై అనుమానంతో అతని ఇంటిలో సోదాలు చేపట్టారు. ఇలియాజ్ మూడు నెలలుగా కనపడటంలేదు. అయితే అతను తన భార్యతో ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నాడని సమాచారం. ఆమేరకు భార్య సెల్ ఫోన్లో వాట్సప్ మెసేజ్ లు ఉండటంతో ఎన్ఐఏ అధికారులు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని వాట్సప్ చాటింగ్ పరిశీలించారు. ఇలియాజ్ కి చెందిన డైరీని ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అది యోగా పుస్తకంగా కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ దాన్ని ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. 

బుచ్చిలో కలకలం..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉదయం నుంచి ఎన్ఐఏ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో కూడా సోదాలు జరుగుతున్నాయి. బుచ్చిరెడ్డిపాలెంలోని ఖాజా నగర్ లో NIA సిబ్బంది సోదాలు నిర్వహించారు. ఇలియాజ్ అనే వ్యక్తి ఇంట్లో అధికారులు సోదాలు చేపట్టారు. తెల్లవారు ఝామునే పోలీసులు ఇలియాజ్ ఇంటికి వచ్చారు. దాదాపు 8గంటలసేపు సోదాలు జరిగినట్టు సమాచారం. ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు ఆరోణలు రావడంతో ఎన్ఐఏ అధికారులు బుచ్చిరెడ్డిపాలెం వచ్చారు. 

నిజామాబాద్ లో ఓ జిమ్ ట్రైనర్ ని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసి ప్రశ్నించిన సందర్భంలో బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఇలియాజ్ కూడా అక్కడ శిక్షణ పొందినట్టు తేలింది. దీంతో పోలీసులు ఇలియాజ్ కోసం వేట మొదలు పెట్టారు. అతను మూడు నెలలుగా కనిపించడంలేదని నిర్థారించుకున్నారు. గతంలో బుచ్చిరెడ్డిపాలెంలోని ఖాజా నగర్ లో టిఫిన్ సెంటర్ నిర్వహించే ఇలియాజ్ మూడు నెలలుగా కనపడటంలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులను ఎన్ఐఏ సిబ్బంది విచారించారు. ఎన్ఐఏ నుండి ఓ డీఎస్పీ స్థాయి అధికారితో పాటు మరికొంతమంది అధికారులు, నెల్లూరుకు చెందిన ఇద్దరు రెవెన్యూ అధికారులు, భద్రతా సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. 

ఎన్ఐఏ గో బ్యాక్..
బుచ్చిరెడ్డిపాలెంలో ఎన్ఐఏ సిబ్బంది సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో స్థానికులు వారిని అడ్డగించే ప్రయత్నం చేశారు. ఇలియాజ్ ఇంటిలోకి వెళ్లి వచ్చిన అధికారుల్ని స్థానికులు అడ్డుకోవాలని చూశారు. లోపల ఏం జరిగిందో చెప్పాలని నిలదీశారు. మహిళా అధికారి పర్యవేక్షణలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. వారు స్థానికలను పక్కకు తొలగమని చెప్పారు. కానీ స్థానికులు వారి జీపుకి కూడా అడ్డుపడ్డారు. ఎన్ఐఏ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. 

నెల్లూరు జిల్లాలో ఎన్ఐఏ సోదాలు- కీలక డైరీ స్వాధీనం

ఎన్ఐఏ అధికారుల సమాచారంతో బుచ్చిరెడ్డిపాలెం సీఐ కోటేశ్వరరావు, ఎస్సై వీరప్రతాప్ అక్కడికి వచ్చారు. వారు స్థానికులకు అరగంట సేపు నచ్చజెప్పారు.

నెల్లూరు జిల్లాలో ఎన్ఐఏ సోదాలు- కీలక డైరీ స్వాధీనం

వారు తొందరపాటులో ఎన్ఐఏకి అడ్డుపడ్డారని, వారికి సర్దిచెప్పామని తెలిపారు పోలీసులు. ఇలియాజ్ భార్య దగ్గర ఫోన్ నెంబర్లు సేకరించారని, వారి ఇంట్లో కీలక సమాచారం ఉన్న డైరీని స్వాధీనం చేసుకున్నారని స్థానిక పోలీసులు తెలిపారు. ఆ డైరీని ఎన్ఐఏ అధికారులు సీజ్ చేసినట్టు తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget