By: ABP Desam | Updated at : 29 Jan 2023 03:58 PM (IST)
Edited By: Srinivas
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. ఆమధ్య సామాజిక పెన్షన్ల తొలగింపు సమయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బాంబు పేల్చారు. తన ఫోన్ ట్యాపింగ్ కి గురవుతోందని, మూడు నెలలుగా ఆ విషయం తనకు తెలుసని, అవతలి వాళ్లు తననుంచి ఏం వినాలనుకుంటున్నారో అదే తాను చెబుతున్నానని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ చెప్పడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇంతకీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తున్నవారు ఎవరు..? దానివల్ల వారికి ఏంటి లాభం..? సొంత పార్టీ నేతలపైనే నిఘా పెట్టడం ప్రభుత్వానికి మంచిదా, లేక ఇది మరో విపరీతానికి దారి తీస్తుందా అనే చర్చ మొదలైంది.
అసలేం జరిగిందంటే..?
ఆరోగ్యశ్రీ లాంటి మరో కార్యక్రమాన్ని ప్రకటించేందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శనివారం ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ కి ముందు ఆయన రిపోర్టర్లతో మాట్లాడుతున్నారు. సరిగ్గా అదే సమయానికి అక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ కి చెందిన స్టాఫ్ కనిపించారు. ఈ కార్యక్రమానికి మీరెందుకొచ్చారని ప్రశ్నించిన ఎమ్మెల్యే, ఆ తర్వాత వారిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయినా నో ఫోన్లు 3 నెలలుగా ట్యాప్ చేస్తున్నారు కదా ఇంకా ఈ నిఘా అవసరమా అన్నట్టు మాట్లాడారు. దీంతో ఇంటెలిజెన్స్ స్టాఫ్ షాకయ్యారు.
సహజంగా ప్రతిపక్ష నేతల కార్యక్రమాలకు, విద్యార్థులు, ఇతర సామాజిక సంస్థల నిరసన కార్యక్రమాలు జరిగే సమయంలో ఇంటెలిజెన్స్ సిబ్బంది అక్కడి పరిస్థితులను అంచనా వేస్తారు. రహస్యంగా సమాచారం సేకరించి డిపార్ట్ మెంట్ కి చేరవేస్తారు. ఈ క్రమంలో వారు ప్రధానంగా ప్రతిపక్ష నేతల ప్రెస్ మీట్లపై ఫోకస్ పెడుతుంటారు. కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రోగ్రామ్ కి కూడా వారు రావడంతో ఆయన షాకయ్యారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగే జరిగిందని, అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇలా చేస్తే ఎలా అని వారిని నిలదీశారు. తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే విషయాన్ని అప్పుడే ఆయన బయటపెట్టారు. అయితే కేవలం ఇంటెలిజెన్స్ సిబ్బందిని హెచ్చరించడానికే ఆయన అలా మాట్లాడారా, లేక ఆయన ఫోన్ నిజంగానే ట్యాప్ చేస్తున్నారా, ఆయనతోపాటు మరికొంతమంది ఫోన్లు ట్యాపింగ్ కి గురవుతున్నాయా అనేది తేలాల్సి ఉంది.
ఫోన్ ట్యాపింగ్ వార్త బయటకొచ్చాక, అధికార పార్టీనుంచి ఎవరూ స్పందించలేదు. అటు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కూడా ఈ వార్తలను ఖండించలేదు. దీంతో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతో కొంత నిజం ఉండి ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఇది కేవలం రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి పరిమితమవుతుందా, లేదా వైసీపీలో ఉన్న అసంతృప్త నేతలపై కూడా ఇలాగే నిఘా పెట్టారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇటీవల ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వారిని పార్టీ దూరం పెట్టినా.. అటు వైపు నుంచి ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు రాలేదు. కానీ శ్రీధర్ రెడ్డి ఆరోపణల తర్వాత ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
APOSS SSC Hall Tickets: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Mask must in Nellore: నెల్లూరులో మాస్క్ పెట్టుకోవాల్సిందే, కొత్త వైరస్ జ్వరాలతో కఠిన ఆంక్షలు
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!
ED Notices To MP Magunta : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు
TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు
Hindenburg Research: మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్