By: ABP Desam | Updated at : 26 Apr 2022 07:59 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మర్రిపాడు (Marripadu) మండలం కండ్రిక వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ (Private Travels Bus Accident) బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 10 మంది వరకూ గాయాలు అయ్యాయి. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా అధికారులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కూడా వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ట్రావెల్స్ బస్సు బళ్లారి (Ballari) నుంచి నెల్లూరుకు (Nellore) వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు బస్సు అద్దాలను పగలగొట్టి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసి కాపాడారు.
కానీ, బస్సు ప్రమాదం జరిగిన తీరు మాత్రం తీవ్ర స్థాయిలో జరిగింది. ఆ ప్రమాదం చూసి ఎంతమంది చనిపోయారో అనుకున్నారు స్థానికులు. కానీ అదృష్టవశాత్తు ఒక్కరికి కూడా ప్రాణాపాయం జరగలేదు. ట్రావెల్స్ బస్సులో గాయాలు అయిన వారిని ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని ఇంకో బస్సు ఏర్పాటు చేసి నెల్లూరుకి తరలించారు. ఈ ప్రమాదం నెల్లూరు - ముంబై జాతీయ రహదారిపై మర్రిపాడు మండలం (Marripadu Mandal) పొంగూరు కండ్రిగ (Ponguru Kandriga) వద్ద జరిగింది. బళ్లారి నుంచి నెల్లూరు (Ballari to Nellore Bus Accident) వైపు వెళ్తున్న PSR ప్రైవేట్ ట్రావెల్ బస్సు (PSR Travels Bus) కండ్రీగ వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న హైవే మొబైల్ పెట్రోల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బస్సులో ఉన్న వారిని కాపాడారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 26 మంది ఉండగా ఐదుగురికి గాయాలయ్యాయి. చిన్నారులు కూడా బస్సులో ఉన్నారని, వారందర్నీ వెనుక అద్దం పగల కొట్టి బయటకు తీసుకొని వచ్చామని చెప్పారు స్థానికులు.
ఉత్తరాఖండ్‌లో (Uttarakhand Accident) ఘోర ప్రమాదం
ఉత్తరాఖండ్‌లోనూ ఘోర ప్రమాదం జరిగింది. ఓ పికప్ ట్రక్కు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రయాణికులు పెళ్లికి హాజరై తిరుగు ప్రయాణం కాగా.. సియోలి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్ని పబౌలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించామని పోలీసులు పేర్కొన్నారు.
తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం పౌరిలోని ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు చెప్పారు. మృతులను అంకిత్ కుమార్, హయత్ సింగ్, మెహర్బాన్ సింగ్, దాబ్డే, అంబిక, కుమారి మోనికగా గుర్తించారు.
Nellore Wonder Kid: అక్షరాలతో ఆటలు, మ్యాథ్స్ తో గేమ్స్ - ఈ నెల్లూరు బాలిక సూపర్ అంతే
Nellore Pistol: నెల్లూరులో రెండు ప్రాణాలు తీసిన పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టిన పోలీసులు, కీలక విషయాలు
Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్‌కు మహిళల సూటిప్రశ్న
Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !
Sri Talpa Giri: దక్షిణ శ్రీరంగం తల్పగిరి రంగనాథ మందిరం- ఈ గుడిలో అదే జరిగితే కలియగం అంతమైనట్టేనటా!
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం