Nellore Pistol: నెల్లూరులో రెండు ప్రాణాలు తీసిన పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టిన పోలీసులు, కీలక విషయాలు

Nellore Pistol Case: ఇటీవల నెల్లూరులో ఓ హత్య, మరో ఆత్మహత్యకు కారణమైన పిస్టల్ ఎక్కడిది, ఎలా తెచ్చారు అనే విషయాన్ని నెల్లూరు పోలీసులు కనిపెట్టారు.

FOLLOW US: 

ఇటీవల నెల్లూరులో ఓ హత్య, మరో ఆత్మహత్యకు కారణమైన పిస్టల్ ఎక్కడిది, ఎలా తెచ్చారు అనే విషయాన్ని పోలీసులు కనిపెట్టారు. నిందితుడు సురేష్ రెడ్డి బిహార్ నుంచి పిస్టల్ ని తెప్పించినట్టు గుర్తించారు. సురేష్ రెడ్డికి పిస్టల్ అమ్మిన రమేష్ అనే వ్యక్తిని నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సెల్ ఫోన్ పట్టించింది..
నిందితుడు సురేష్ రెడ్డి నెల్లూరు జిల్లా తాటిపర్తి గ్రామంలో కావ్యశ్రీ అనే యువతిని హత్య చేసి, ఆ తర్వాత అదే పిస్టల్ తో తనూ కాల్చుకుని చనిపోయాడు. ఆ తర్వాత పిస్టల్ గురించి పోలీసులు ఆరా తీశారు. ఆ పిస్టల్ పై మేడిన్ యూఎస్ఏ అని ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. దానిపై లోతుగా విచారణ జరిపారు. నిందితుడు వాడిన సెల్  ఫోన్ ఆధారంగా పిస్టల్ ఎక్కడినుంచి తెప్పించారనే విషయాన్ని తెలుసుకున్నారు. 

పథకం ప్రకారమే హత్య..
2021 అక్టోబర్ నుంచే సురేష్ రెడ్డి కావ్యశ్రీని మట్టుబెట్టాలని అనుకున్నాడు. తనతో పెళ్లికి నిరాకరించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఇంటర్నెట్ లో తుపాకీలు ఎక్కడ దొరుకుతాయి, ఎవరు అమ్ముతారు, ఎలా వాటిని వాడాలి అనే విషయాలను పరిశోధించాడు. చివరకు బీహార్ లోని ఓ గ్యాంగ్ తో సంబంధం ఏర్పరచుకున్నాడు. డిసెంబర్ లో బీహార్ లోని పాట్నాకు వెళ్లాడు సురేష్ రెడ్డి. 

అన్నదమ్ములు ఆయుధాల సప్లయర్స్.. 
పాట్నాలో ఉమేష్, రమేష్ అనే అన్నదమ్ములున్నారు. రమేష్ అనే వ్యక్తి కారు డ్రైవర్. సురేష్ రెడ్డి ఈ రమేష్ తో స్నేహం ఏర్పరచుకుని తుపాకీ కావాలని అడిగాడు. అతను ఉమేష్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ తరత్వాత వారిద్దరూ నమ్మకం కుదుర్చుకుని సురేష్ రెడ్డికి పిస్టల్ అమ్మారు. 20రోజులపాటు అక్కడే ఉండి తుపాకీని కొన్నాడు. ఆ తర్వాత దాన్ని వాడే విధానం తెలుసుకున్నాడు. అక్కడే అన్ని ట్రయల్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత తిరిగి నెల్లూరు జిల్లాకు వచ్చి అదనుకోసం వేచి చూశాడు. 

తుపాకీ కొన్నది 2021 డిసెంబర్ అయితే, పథకం అమలు చేసింది 2022 మే నెలలో. అంటే ఈ మధ్య కాలంలో సురేష్ రెడ్డి చాలా తర్జన భర్జన పడినట్టు తెలుస్తోంది. కావ్యశ్రీని మాత్రమే అంతం చేయాలా, లేక తాను కూడా చనిపోవాలా అని ఆలోచించి ఉంటాడని తెలుస్తోంది. కావ్యశ్రీని చంపేసిన తర్వాత భయంతో సురేష్ రెడ్డి కూడా తనను తాను కాల్చుకుని చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. 

రమేష్ అరెస్ట్.. 
సురేష్ రెడ్డికి తుపాకీని సప్లై చేసిన రమేష్ ని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం బీహార్ నుంచి రమేష్ ని పిలిపించారు. రెండురోజులపాటు అతని నుంచి పూర్తి సమాచారం సేకరించి అరెస్ట్ చేశారు. అతడి అన్న మరో ప్రధాన ముద్దాయి ఉమేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈమేరకు నెల్లూరు అడిషనల్ ఎస్పీ వివరాలు తెలియజేశారు. 

Published at : 19 May 2022 07:12 PM (IST) Tags: AP News ap police nellore nellore police Nellore Pistol Case Pistol

సంబంధిత కథనాలు

Weather Updates: పూర్తిగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు, నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు - ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

Weather Updates: పూర్తిగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు, నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు - ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

PSLV C53 Success : పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం సక్సెస్, నిర్ణీత కక్ష్యలో మూడు ఉపగ్రహాలు

PSLV C53 Success : పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం సక్సెస్, నిర్ణీత కక్ష్యలో మూడు ఉపగ్రహాలు

Kakani On Pawan Kalyan : పవన్ కి మూడు కాదు 30 ఆప్షన్లు ఉన్నా వైసీపీని ఏంచేయలేరు- మంత్రి కాకాణి

Kakani On Pawan Kalyan : పవన్ కి మూడు కాదు 30 ఆప్షన్లు ఉన్నా వైసీపీని ఏంచేయలేరు- మంత్రి కాకాణి

PSLV C53 Launch : నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శాటిలైట్ ప్రయోగానికి అమ్మవారి దీవెనలు

PSLV C53 Launch : నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శాటిలైట్ ప్రయోగానికి అమ్మవారి దీవెనలు

Crime News: తోడు దొంగలకు ఆ తండ్రీకొడుకులే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్

Crime News: తోడు దొంగలకు ఆ తండ్రీకొడుకులే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్

టాప్ స్టోరీస్

Maharashtra News: అసలైన శివసైనికుడు సీఎం అయ్యాడని, ప్రజలు హ్యాపీగా ఉన్నారు-సీఎం షిండే కామెంట్స్

Maharashtra News: అసలైన శివసైనికుడు సీఎం అయ్యాడని, ప్రజలు హ్యాపీగా ఉన్నారు-సీఎం షిండే కామెంట్స్

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

PM Modi Tour: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని టూర్ షెడ్యూల్ ఇదే- భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ

PM Modi Tour: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని టూర్ షెడ్యూల్ ఇదే- భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల