అన్వేషించండి

Azadi Ka Amrut Mahotsav: పెన్నా తీరంలో దేవుడిగా వెలసిన గాంధీ- తుపాకీ కేంద్రంలో శాంతి మంత్రం

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా వాసులకు గాంధీజీతో మంచి అనుబంధం ఉంది. నెల్లూరు జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో పల్లిపాడు అనే గ్రామంలో గాంధీజీ తన స్వహస్తాలతో ఆశ్రమానికి శంకుస్థాపన చేశారు.

భారత స్వాతంత్ర పోరాటంలో దక్షిణ భారత దేశానికి కూడా ప్రముఖ స్థానం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా వాసులకు గాంధీజీతో మంచి అనుబంధం ఉంది. నెల్లూరు జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో పల్లిపాడు అనే గ్రామంలో గాంధీజీ తన స్వహస్తాలతో ఆశ్రమానికి శంకుస్థాపన చేశారు. రెండుసార్లు ఆయన ఆశ్రమాన్ని సందర్శించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆ జ్ఞాపకాలను ఓసారి చూద్దాం. 

Azadi Ka Amrut Mahotsav: పెన్నా తీరంలో దేవుడిగా వెలసిన గాంధీ- తుపాకీ కేంద్రంలో శాంతి మంత్రం
సబర్మతి ఆశ్రమం తర్వాత ఆ స్థాయిలో దక్షిణాదిన పేరున్న ఆశ్రమం పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం. 1915లో తొలిసారిగా గాంధీజీ నెల్లూరుకి వచ్చారు. ఆ తర్వాత ఆయన దక్షిణ భారత యాత్రలో భాగంగా 1921లో నెల్లూరుకి వచ్చి పినాకిని ఆశ్రమాన్ని స్థాపించారు. ఈ ఆశ్రమ స్థాపనకు స్థానిక స్వాతంత్ర సమరయోధురాలు పొణకా కనకమ్మ కృషి ఉంది. ఆశ్రమానికి స్థల దాత కూడా ఆమే. గాంధీజీ బోధనలతో ప్రభావితమైన ఆమె, మరికొందరితో కలసి ఈ ఆశ్రమాన్ని 1921 ఏప్రిల్ 7న  ఏర్పాటు చేశారు. 

Azadi Ka Amrut Mahotsav: పెన్నా తీరంలో దేవుడిగా వెలసిన గాంధీ- తుపాకీ కేంద్రంలో శాంతి మంత్రం

అప్పట్లో పల్లిపాడు తుపాకి కేంద్రంగా ఉండేదని అంటారు. సాయుధ బలగాలకు అక్కడ శిక్షణ ఇచ్చేవారని కూడా చెబుతుంటారు. గాంధీజి అహింసా సిద్ధాంతాల తర్వాత హింసాత్మక పోరాటాలు మాయమైపోయాయి. అందరూ సత్యాగ్రహ బాటపట్టారు. సబర్మతి ఆశ్రమం తర్వాత నెల్లూరు పినాకిని ఆశ్రమంలో కూడా స్వాతంత్ర పోరాట కార్యక్రమాలు జరిగేవి. దక్షిణాఫ్రికాలో గాంధీజీ అనుచరుడిగా ఉన్న రుస్తుంజీ ఆశ్రమ నిర్మాణానికి విరాళం అందజేశారు. ఆయన గుర్తుగా ఆయన పేరుతో ఇక్కడ రుస్తుంజీ భవనం ఉంటుంది. 

Azadi Ka Amrut Mahotsav: పెన్నా తీరంలో దేవుడిగా వెలసిన గాంధీ- తుపాకీ కేంద్రంలో శాంతి మంత్రం

గాంధీ ఆశ్రమం స్థాపించడంతోపాటు, ఆయన గుర్తులు అనేకం ఉన్నాయని చెబుతుంటారు. గాంధీజీ ఆశ్రమం వద్దకు వచ్చే సమయంలో ఎద్దులబండిపై ఆయన్ను తీసుకొచ్చారు. అయితే ఎద్దులను చర్నాకోలతో కొట్టడం కూడా ఆయనకు ఇష్టం ఉండేది కాదట, ఎద్దుల ఇబ్బంది చూడలేక గాంధీజీ ఆ బండి దిగి కాలినడక ప్రారంభించారని కూడా గుర్తు చేసుకుంటారు. 

Azadi Ka Amrut Mahotsav: పెన్నా తీరంలో దేవుడిగా వెలసిన గాంధీ- తుపాకీ కేంద్రంలో శాంతి మంత్రం

పెన్నా తీరంలో 18 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉన్న గాంధీ ఆశ్రమంలో ప్రతి ఆదివారం గాంధీ బోధనలు వినిపిస్తారు. భజనలు జరుగుతాయి. ఇక్కడే డిజిటల్ లైబ్రరీ ఉంది. అప్పుడప్పుడు విద్యార్థులు విజ్ఞాన యాత్రల్లో భాగంగా గాంధీ ఆశ్రమాన్ని సందర్శించడానికి వస్తుంటారు. ప్రస్తుతం వరదల సమయంలో గాంధీ ఆశ్రమం కోతకు గురవుతుంటుంది. ఇటీవల పెన్నా వరదలకు గాంధీ ఆశ్రమంలోనికి కూడా వరదనీరు వచ్చి చేరింది. ఈ ఆశ్రమాన్ని మరింత ఉన్నతిగా తీర్చిదిద్ది, పర్యాటక కేంద్రంగా మార్చితే గాంధీ గుర్తులు నెల్లూరుకు మరింత పేరు తెస్తాయి. 2005 నుంచి ఈ ఆశ్రమాన్ని రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆశ్రమంలో ఆధునిక సౌకర్యాలు కల్పించారు. 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాలు జరుగుతున్న వేళ, నెల్లూరు గాంధీ ఆశ్రమం, నెల్లూరుకి ఓ మరపురాని మధురానుభూతి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
Bhuvaneswari Audio: భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
Renu Desai: పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB Match Highlights | ఆర్సీబీ విక్టరీతో సంతోషంలో చెన్నై, ముంబై ఇండియన్స్ | ABP DesamSRH vs RCB Match Highlights | సన్ రైజర్స్ మీద మ్యాచ్ గెలిపించిన ఆర్సీబీ బౌలర్లు | IPL 2024 | ABPVirat Kohli Half Century | SRH vs RCB మ్యాచ్ లో మరో అర్థశతకం చేసిన విరాట్ కొహ్లీ | IPL 2024 | ABPSRH vs RCB Match Highlights | ఉప్పల్ లో సన్ రైజర్స్ కి ఓటమి రుచి చూపించిన ఆర్సీబీ | IPL 2024 | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
Bhuvaneswari Audio: భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
Renu Desai: పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
Lok Sabha Election 2024 Phase 2: కొనసాగుతున్న రెండో దశ పోలింగ్, బరిలో రాహుల్ గాంధీ సహా కీలక అభ్యర్థులు
Lok Sabha Election 2024 Phase 2: కొనసాగుతున్న రెండో దశ పోలింగ్, బరిలో రాహుల్ గాంధీ సహా కీలక అభ్యర్థులు
Megha Akash: పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మేఘ ఆకాశ్? ఆ ఫొటోకి అర్థం అదేనా?
పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మేఘ ఆకాశ్? ఆ ఫొటోకి అర్థం అదేనా?
KCR: ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ITR 2024: కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - మీకు ఏది సూటవుతుంది?
కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - మీకు ఏది సూటవుతుంది?
Embed widget