(Source: ECI/ABP News/ABP Majha)
AP News: అయ్యప్ప భక్తుడి సాహసం.. ఒకే కాలుతో 750 కి.మీ. నడిచి శబరిమలకు.. కారణం ఏంటంటే..
నెల్లూరు నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న అమ్మ వారి ఆలయంలో ఇరుముడి కట్టుకుని శబరిమలకు కాలి నడకన పయనం అయ్యాడు. రెండు రోజుల క్రితమే యాత్ర పూర్తయింది.
అయ్యప్ప భక్తులు ఏటా స్వామి దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి దర్శనం చేసుకోవడం మామూలే. ఇలా దీక్ష చేపట్టిన ఇంకొందరు తమ ఊరి నుంచి కాలినడకన శబరిమలకు వెళ్తుండడం మాత్రం ఎంతో ప్రత్యేకం. ఇలాంటివారు అయ్యప్ప దీక్ష మొదలుపెట్టిన నాటి నుంచే శబరిమలకు నడక ప్రారంభిస్తారు. రోజుల తరబడి వారి ప్రయాణం సాగి దీక్షా కాలం పూర్తయ్యే నాటికి స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. కానీ, ఈ పరమ భక్తుడు మాత్రం అంతకుమించిన భక్తి చూపాడు. తాను విభిన్న ప్రతిభావంతుడైనా కాలి నడకన నెల్లూరు నుంచి శబరిమలకు చేరుకున్నాడు. ఏకంగా 750 కిలో మీటర్ల ఒంటి కాలుతో నడిచి స్వామిని చేరుకున్నాడు.
నెల్లూరు నగరానికి చెందిన అకరపాక సురేష్ దివ్యాంగుడు. గతంలో ప్రమాదవశాత్తు ఒక కాలును కోల్పోయాడు. తనకు గతంలో ఉన్న వ్యసనాల నుంచి కాపాడటంతోపాటు సమాజంలో వెక్కిరింపుల నుంచి గౌరవంతో కూడిన గుర్తింపు వచ్చిందని అతను నమ్మాడు. అందుకు కారణం అయ్యప్ప స్వామి అని భావించాడు. అందుకే ఆ స్వామిని దర్శించుకునేందుకు ఏకంగా 750 కిలో మీటర్లు ఒంటి కాలుతో నడిచి అయ్యప్పస్వామిని దర్శించుకున్నాడు.
గతేడాది 2021 సెప్టెంబరు 20న నెల్లూరు నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న అమ్మ వారి ఆలయంలో ఇరుముడి కట్టుకుని శబరిమలకు కాలి నడకన పయనం అయ్యాడు. కరోనా కేసులు పెరుగుతున్నా, కాలి నడకలో ఎన్నో సవాళ్లు, ఇబ్బందులు ఉంటాయని తెలిసినా వాటిని అధిగమించి ఆత్మవిశ్వాసంతో మనసంతా అయ్యప్పస్వామిని నింపుకుని చివరికి గమ్యం చేరాడు. పవిత్రమైన ఇరుముడిని తలపై మోస్తూ ఊతకర్రల సాయంతో ఒక్కడే నడుచుకుంటూ దాదాపు 105 రోజులు శ్రమించి తన పాదయాత్ర కొనసాగించాడు.
గత సెప్టెంబరులో మొదలైన పాదయాత్ర రెండు రోజుల క్రితమే పూర్తయింది. ప్రతి రోజు ఉదయం 4 గంటలకు బయలుదేరి ఎండ వచ్చే సమయానికి ఏదో ఒక ఆలయానికి చేరుకునేవాడు. అక్కడ విశ్రాంతి తీసుకొని, భిక్ష చేసిన తర్వాత తిరిగి పాదయాత్ర కొనసాగించేవాడు. రాత్రి కూడా ఆలయాలే విశ్రాంతి కేంద్రాలయ్యేవి. ఇప్పటికే చాలాసార్లు ఈయన అయ్యప్ప దీక్ష చేపట్టినా.. నడిచి వెళ్లడం మాత్రం ఇది రెండోసారి అని తెలిపారు. శబరిమల ఆలయ సిబ్బంది కూడా సురేష్‌కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
Also Read: ఆర్జీవీ 10 ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కౌంటర్.. ‘ఆ ఫార్ములా ఏంటి వర్మగారూ’ అంటూ వరుస ట్వీట్లు
Also Read: RGV Questions AP Govt: వర్మ వదలడం లేదుగా... ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ సంధించిన తాజా ప్రశ్నలు!
Also Read: ఖరీదైన ఆడి కారు కొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్... అంత రేటు పెట్టి కొన్నారా?
Also Read: గతం గురించి కామెంట్... సమంత మాటల్లో చాలా మీనింగ్ ఉందిగా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి