Kotam Reddy News: ఏడాది క్రితమే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఇప్పుడు వ్యతిరేక కార్యకలాపాలకు ఎలా పాల్పడతాం: కోటంరెడ్డి
Nellore News: ఏడాది క్రితమే వైసీపీ తమను సస్పెండ్ చేస్తే ఇప్పుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎలా పాల్పడతామని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ఆనాడే నలుగురిపై అనర్హత ఎందుకు వేయలేదన్నారు
![Kotam Reddy News: ఏడాది క్రితమే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఇప్పుడు వ్యతిరేక కార్యకలాపాలకు ఎలా పాల్పడతాం: కోటంరెడ్డి MLA Kotam Reddy is angry about the disqualification Sridhar Reddy said that the party was suspended a year ago Kotam Reddy News: ఏడాది క్రితమే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఇప్పుడు వ్యతిరేక కార్యకలాపాలకు ఎలా పాల్పడతాం: కోటంరెడ్డి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/148efafde5fb84ca688af9cda3ed3bdb1709043434572952_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kotam Reddy: వైసీపీ(YCP) ఎప్పుడో ఏడాది క్రితమే తమను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే....ఇప్పుడు కొత్తగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తాము ఎలా పాల్పడతామని వైసీపీ బహిష్కృత నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy) అన్నారు. సస్పెండ్ చేయాలనుకుంటే తాము పార్టీ నుంచి బయటకు వెళ్లిన రోజే చేసి ఉండాల్సింది కదా అన్నారు. వైసీపీ(YCP)లోకి రావాలంటే పార్టీలకు రాజీనామా చేసి రావాలని జగన్(Jagan) చేసిన ప్రగల్బాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేల వేటు
పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదు నేపథ్యంలో 8 మంది ఎమ్మెల్యేలపై ఏపీ సభాపతి అనర్హత వేటు వేశారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధ్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(Mekapati Chandrashekar Reddy), ఆనం రాంనారాయరెడ్డి(Aanam Ramnarayana Reddy), ఉండవల్లి శ్రీదేవి(Undavalli Sridevi) పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు తీసుకున్నారు అదే విధంగా టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుతో వల్లభనేని వంశీ(Vallabaneni Vamsi), మద్దాలి గిరి(Madhali Giri), కరణం బలరాం(Karanam Balaram), వాసుపల్లి గణేశ్(Vasupalli Ganesh) పైనా సభాపతి వేటు వేశారు.
కోటంరెడ్డి ఆగ్రహం
సభాపతి తనపై అనర్హత వేటు విషయంలో ఇంకా అధికారికంగా తమకు ఎలాంటి నోటీసులు అందలేదని...మీడియాలో చూసే విషయం తెలుసుకున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అయినా తాము ఎప్పుడూ ఏడాది క్రితమే పార్టీకి రాజీనామా చేశామని..అప్పుడు తమను సస్పెండ్ చేశామంటూ వైసీపీ ప్రకటించిందన్నారు. తీరిగ్గా ఇప్పుడు అనర్హత వేటు వేయడమేంటని ప్రశ్నించారు. ఒక పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత...ఆ వ్యక్తి స్వతంత్రుడిగా మారతడాని...అప్పుడు అతను తనకు ఇష్టమైన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనే స్వేచ్ఛ ఉంటుందన్నారు. అలాంటప్పుడు తాము పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటానికి ఆస్కారం ఎక్కడ ఉంటుందన్నారు.ఒకవేళ తమపై చర్యలు తీసుకోవాల్సి ఉంటే..ఆనాడే తీసుకుని ఉండాల్సిందని బదులిచ్చారు. వైసీపీలో చేరాలంటే అవతలి పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే చేర్చుకుంటామని ప్రగల్బాలు పలికిన సీఎం జగన్....తెలుగుదేశం నుంచి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. అప్పుడు ఏమయ్యాయని వీరి నీతులు అని మండిపడ్డారు.
అయితే ఈసారి టిక్కెట్ తనకు ఇవ్వరని ముందుగానే గ్రహించిన నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన తెలుగుదేశంలో చేరారు. ఆయనతోపాటు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి సైతం వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు వీరందిరిపైనా సభాపతి వేటు వేశారు. వైసీపీ ఫిర్యాదుకు ప్రతీగా తెలుగుదేశం పార్టీ సైతం తమ పార్టీ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్, కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలిగిరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేసింది. వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు తెలుగుదేశం ఎమ్మెల్యేలపైనా సభాపతి వేటు వేశారు. రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన తరుణంలో వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉందన్న సమాచరం మేరకే వైసీపీ అప్రమత్తమైంది. వైసీపీ అనర్హత పిటిషన్ దాఖలు చేయడంతో తెలుగుదేశం రాజ్యసభ ఎన్నికల రేసు నుంచి వెనక్కి తగ్గింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)