అన్వేషించండి

internal fight in venkatagiri ysrcp: వెంకటగిరి వైసీపీలో వర్గపోరు.. 

ఇటీవల రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు నెల్లూరులో క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఉగాది సందర్భంగా ఆయన వెంకటగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేపడతారనే ప్రచారం కూడా జరిగింది.

నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజకీయ రసవత్తరంగా మారింది. అధికార పార్టీలోనే రెండు పవర్ సెంటర్లు ఇక్కడ ఉన్నాయి. ఒకటి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కాగా, రెండోది మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఆనందే హవా. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. వైసీపీ అధికారంలోకి రాగానే ఆనం లాంటి సీనియర్ ని మంత్రివర్గంలోకి తీసుకోకుండా పక్కనపెడతారని ఎవరూ అనుకోలేదు. అయితే అనూహ్యంగా ఆనంను పక్కనపెట్టారు జగన్. అప్పటి వరకూ టీడీపీలో ఉండి తీరా ఎన్నికల ముందు వైసీపీ కండువా కప్పుకోవడంతో ఆనంను కేవలం ఎమ్మెల్యేగానే పరిమితం చేశారు. 

అయితే మంత్రి పదవి దక్కకపోవడంతో ఆనం కొంత ధిక్కార స్వరాన్ని వినిపించారు. జిల్లా వైసీపీ నాయకులపై ఆయన గతంలో విమర్శలు చేశారు. పోలీసులు కొంతమంది నాయకుల చెప్పుచేతల్లో ఉన్నారనే విమర్శకూడా చేశారు. ఆ తర్వాత జిల్లాల విభజన సమయంలో ఆనం మూడు మండలాలకోసం పట్టుబట్టారు. చివరకు తాను అనుకున్నది సాధించినా నిరాహార దీక్షల పేరుతో హడావిడి చేయడంతో జగన్ దృష్టిలో ఆయనకు మంచి మార్కులు పడలేదని అంటారు. అయితే ఇదే సమయంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి లైన్లోకి వచ్చారు. ఆయనకు ఏపీ బోర్డ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ చైర్మన్ గా ఇదివరకే కీలక పదవి ఇచ్చారు సీఎం జగన్. అయితే ఆయనకు వెంకటగిరినుంచి పోటీ చేయాలనే ఆలోచన ఉంది. 2024నాటికి వైసీపీలో పరిస్థితులు అనుకూలిస్తే వెంకటగిరి సీటు తనకే దక్కుతుందని అనుకుంటున్నారు రామ్ కుమార్ రెడ్డి. 

రామ్ కుమార్ మంత్రాంగం.. 
ఇటీవల రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు నెల్లూరులో క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఉగాది సందర్భంగా ఆయన వెంకటగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేపడతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఆయన పెంచలకోన పుణ్యక్షేత్రానికి వచ్చారు. భారీ కార్ల ర్యాలీతో ఓ రాజకీయ యాత్రలాగా ఆయన అభిమాన గణంతో తరలి వచ్చారు. అక్కడే ప్రెస్ మీట్ పెట్టి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. 2024లో మీరు వెంకటగిరిలో పోటీ చేస్తారా అంటే.. ఇప్పుడే ఏం చెబుతామంటూ దాటవేశారు. 

వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో మరో నేత అంత ధైర్యంగా మందీ మార్బలంతో యాత్ర మొదలు పెడుతున్నారంటే అధిష్టానం అండదండలు ఉన్నట్టే లెక్క. అందులోనూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అంటే.. కొట్టిపారేయలేదు సరికదా.. అప్పటి సంగతి అప్పుడు చూద్దామంటూ దాటవేశారు. అంటే రామ్ కుమార్ రెడ్డికి జగన్ నుంచి గట్టిగానే హామీ లభించిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. మరి రామనారాయణ రెడ్డి పరిస్థితి ఏంటి..? వెంకటగిరిలో వైసీపీ నుంచి సీటు నిరాకరిస్తే ఆయన ఏంచేయాలి. పొమ్మనే వరకు ఆయన ఉంటారా, లేక పొగ పెట్టేముందే బయటపడతారా..? ఇవేవీ కాకుండా.. జగన్ అభిమానం చూరగొని.. వచ్చే దఫా ఆయనే బరిలో నిలుస్తారా..? వేచి చూడాలి. 

టాప్ హెడ్ లైన్స్

Cyclone Musuru Helpline Numbers: ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
Cyclone Murasu: 22 కి.మీ వేగంతో దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
22 కి.మీ వేగంతో దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Cyclone Arnab Live Updates: కాకినాడ సమీపంలో సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక
కాకినాడ సమీపంలో సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rains Update: తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
Revanth Reddy Delhi Vote Chori Rally Mobilisation: ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
OTT Crime Thriller: రెండు ఓటీటీల్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్... మాఫియాలో మిడిల్ క్లాస్ కుర్రాడి ప్రేమకథ - మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
రెండు ఓటీటీల్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్... మాఫియాలో మిడిల్ క్లాస్ కుర్రాడి ప్రేమకథ - మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
LLR Online Test: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
Skoda Kodiaq vs Volkswagen Tayron.. ఏ SUV ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఆసక్తికర ఫలితాలు
రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌: స్కోడా కొడియాక్‌, వోక్స్‌వ్యాగన్ టైరాన్‌లో ఏది బెస్ట్‌?
Embed widget