By: ABP Desam | Updated at : 10 May 2023 06:05 PM (IST)
Edited By: Srinivas
janasena foundation stone as pavan cm
నెల్లూరులో ఈరోజు ఓ శిలా ఫలకం ఆవిష్కరణ జరిగింది. విచిత్రం ఏంటంటే.. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అని ఉంది. ఈ శిలా ఫలకాన్ని జనసేన నేతలు వేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పవన్ కల్యాణ్ చేతుల మీదుగా పనులు జరుగుతాయని అందులో ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ ఫొటో కూడా అందులో ఉంది.
ఎందుకీ శిలా ఫలకం..
నెల్లూరు నగరంలోని మినీబైపాస్ రోడ్ ఆనుకుని ఉన్న సర్వేపల్లి కాల్వ పనులు సరిగా జరగడంలేదని ఆరోపించారు జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి. ఫ్లైఓవర్ పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని చెప్పారు. వీటిని పూర్తి చేయడం వైసీపీ వల్ల కాదని, జనసేన అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తామని అన్నారు. అయితే అక్కడితో వారు ఆగలేదు.. జనసేన అధికారంలోకి వచ్చాక పనులు పూర్తి చేస్తామంటూ ఓ శిలాఫలకం రెడీ చేశారు. అందులో ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అంటూ ఆయన ఫొటో కూడా వేశారు. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని ముగించుకుని జనసేన నేతలు తిరిగి వెళ్లిపోయే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి పై రాళ్లతో దాడి చేశారు. ఆయన తలకు గాయాలయ్యాయి. దాడికి కారణమైన వ్యక్తిగా అనుమానిస్తున్న ఒకరిని జనసేన నేతలు కొట్టారు. అతడికి కూడా రక్తగాయాలయ్యాయి. పోలీసులు బాధితులను, వారిపై దాడి చేసిన వారిని స్టేషన్ కి తరలించారు. పవన్ కల్యాణ్ సీఎం అంటూ శిలా ఫలకం వేసిన వ్యవహారం నెల్లూరులో రచ్చ రచ్చగా మారింది.
కామెడీ చేసినట్టేనా..?
ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ సభలో సీఎం సీఎం అంటూ నినాదాలు చేసేవారు జనసైనికులు. వారి హడావిడిని కొన్నిసార్లు పవన్ కల్యాణ్ కూడా విసుక్కున్న ఉదాహరణలున్నాయి. సీఎం సీఎం అంటారు, అక్కడ ఓట్లు మాత్రం ఎవరూ వేయరు అనేవారు పవన్. సోషల్ మీడియాలో కూడా సీఎం పవన్ అనే హడావిడి చూస్తూనే ఉన్నాం. అయితే నెల్లూరు నాయకులు ఓ అడుగు ముందుకేసి ఏకంగా శిలా ఫలకాలు వేయించడం చర్చనీయాంశమైంది. 2024 తర్వాత కాబోయే సీఎం అని వేసినా కూడా.. ఇది కామెడీ వ్యవహారంగా మారింది.
ఉన్నది ముగ్గురు.. అందులో గ్రూపులు..
నెల్లూరు జనసేనలో జిల్లా స్థాయి నాయకులు ఉన్నదే ముగ్గురు. అందులోనే మూడు గ్రూపులున్నాయిు. ఆ గ్రూపుల్లో ఒకరంటే ఇంకొకరికి పడదు. ఒకరిపై ఒకరు పైచేయికోసం పనిచేస్తుంటారు. ఇందులో ఓ గ్రూపు నాయకుడు ఇలా శిలా ఫలకం వేశారు. దీనిపై మిగతా వారికి సమాచారం లేదు, వారు ఈ కార్యక్రమానికి రాలేదు కూడా.
+రాష్ట్రంలో ఎవరూ ఇలా శిలా ఫలకాలు వేసి హడావిడి చేయలేదు, ఏకంగా అందులో పవన్ కల్యాణ్ ని సీఎంని చేసేశారు నాయకులు. ఈ వ్యవహారం మరీ వింతగా, విడ్డూరంగా ఉందంటున్నారు స్థానిక నాయకులు. మరీ ఇంత అత్యుత్సాహమేంటని ప్రశ్నిస్తున్నారు. మరి జనసేన అధిష్టానానికి తెలిసే ఈ శిలా ఫలకం వేశారా, లేక అధిష్టానం ఇలాంటి వ్యవహారాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తుందా అనేది తేలాల్సి ఉంది.
TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు
Attack on Anam: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం రమణారెడ్డిపై దాడి, మంత్రి రోజాపై వ్యాఖ్యలే కారణమా?
NMMS RESULTS: ఏపీ ఎన్‌ఎంఎంఎస్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
ఎన్టీఆర్ హైస్కూల్‌లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!
Coromandel Train Accident: రైలు ప్రమాద స్థలం నుంచి ఏపీకి ప్రత్యేక రైలు, రాత్రి విజయవాడకు 50-60 మంది!
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్, కవచ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?
Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు
Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల