అన్వేషించండి

నెల్లూరు బంగారం షాపుల్లో ఐటీ 'గ్యాంగ్'- వ్యాపారులకు సినిమా చూపించారు

ఐటీ అధికారుల పేరుతో నెల్లూరులో భారీ దోపిడీకి యత్నించింది ఓ ముఠా. బంగారు షాపుల యజమానుల్ని బెదిరించిన 12 కేజీల బంగారం ఎత్తుకెళ్లేందుకు యత్నించి అడ్డంగా బుక్కయ్యారు.

ఏయ్, మేం ఐటీ డిపార్ట్ మెంట్ నుంచి వచ్చాం, మీ షాపులో బంగారం లెక్కల్లో తేడాలున్నాయంటూ 8 మంది ముఠా ఈరోజు నెల్లూరులో హల్ చల్ చేసింది. మండపాల వీధిలోని ఓ షాపులో దూరి వారిని బయటకు పోనీయకుండా అడ్డుకుంది. అందులో ఓ వ్యక్తి పోలీస్ యూనిఫామ్ వేసుకోని ఉండటంతో షాపు యజమానులు కంగారు పడ్డారు. రెండు మూడు షాపుల్లో ఇలానే బెదిరించి 12 కేజీల బంగారాన్ని మూటగట్టుకొని పోవడానికి ప్రయత్నించారు. 

అచ్చం గ్యాంగ్‌ సినినిమాలో చూపించినట్టే చేశారు. ఇక్కడ మాత్రం బొమ్మ తిరగబడింది. ముఠాపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే అసలు సంగతి వెలుగు చూసింది. వారి వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకులు నిలదీశారు. ఎందుకైనా మంచిదని పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఫిర్యాదు అందుకొని సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు ఆ ముఠా గుట్టును రట్టు చేశారు. 

నెల్లూరు జిల్లా బంగారు షాపుల్లో పండగ సీజన్లో బిజినెస్ బాగా సాగుతుంది. అయితే ఇక్కడ చాలా షాపుల్లో చెన్నై నుంచి బంగారాన్ని జీఎస్టీ లేకుండా తెచ్చుకుంటారు. ఆభరణాలు చేసి అమ్ముతుంటారు. చిన్న చిన్న షాపుల్లో జరిగే తంతు ఇది. ఇటీవల ఐటీ దాడుల కలవరం పెరిగే సరికి దాదాపుగా అలాంటి బిజినెస్ కి ఫుల్ స్టాప్ పడిందని అంటారు. కానీ ఏడాదికి కనీసం రెండుసార్లు నెల్లూరులోని బంగారు షాపుల్లో ఐటీ దాడులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఈరోజు కూడా ఐటీ డిపార్ట్ మెంట్ దాడులంటూ నెల్లూరులో కలవరం మొదలైంది. కట్ చేస్తే అది ఫేక్ అని తేలింది. మొత్తం 8మంది ముఠా ఐటీ అధికారులం అంటూ నెల్లూరు బంగారు షాపుల్లో చొరబడి లెక్కలు తీయండి అంటూ భయపెట్టారు. హడావిడి చేశారు. 


నెల్లూరు బంగారం షాపుల్లో ఐటీ 'గ్యాంగ్'- వ్యాపారులకు సినిమా చూపించారు

నెల్లూరులో మండపాల వీధిలోని ఓ షాపులో దూరి వారిని బయటకు పోనీయకుండా అడ్డుకుంది. అందులో ఓ వ్యక్తి పోలీస్ యూనిఫామ్ వేసుకోని ఉండటంతో షాపు యజమానులు కంగారు పడ్డారు. రెండు మూడు షాపుల్లో ఇలానే బెదిరించి 12 కేజీల బంగారాన్ని మూటగట్టుకొని పోవడానికి ప్రయత్నించారు. ఇంతలో గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకులు అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు వచ్చి వారు నకిలీ అధికారుగా నిర్థారించారు. అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. 

వాస్తవానికి ఇలాంటి దాడుల్లో అప్పటికప్పుడు సెటిల్మెంట్ లు జరుగుతాయని అంటారు. కానీ.. ఇక్కడ షాపుల్లో తనిఖీలకు వచ్చిన ముఠా మొత్తంగా బంగారాన్ని దోచేయాలని చూసింది. ఏకంగా 12 కేజీల బంగారాన్ని మూటగట్టుకొని కారులో పారిపోవడానికి ప్రయత్నించింది. దీంతో షాపు యజమానులకు, గోల్డ్ మర్చంట్స్ అసోసియేష్ వారికి అనుమానం వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు హుటాహుటిన వచ్చి వారి ఐడీకార్డులు తనిఖీలు చేశారు. వచ్చినవారంతా ఫేక్ అని తేల్చారు. వీరికి తోడుగా ఓ వ్యక్తి ఏకంగా పోలీస్ యూనిఫామ్ వేసుకుని రావడం మరీ విశేషం. పోలీస్ యూనిఫామ్ లో వచ్చిన వ్యక్తి కూడా నకిలీ ఐడీ కార్డ్ తో హల్ చల్ చేశాడు. వీరందర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఒక్కసారిగా నెల్లూరులో నకిలీ ముఠా దిగింది, బంగారు షాపుల యజమానుల్ని బెదిరిస్తోంది అనే విషయం కలకలం రేపింది. తనిఖీలు జరుగుతున్నాయనే వార్తలతో నెల్లూరులోని చిన్న చిన్న షాపులన్నీ మూతబడ్డాయి. ఆ తర్వాత అది నకిలీ ముఠా పని అని తెలిసిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నకిలీ ముఠాని పోలీసులు అరెస్ట్ చేయడంతో బంగారు షాపుల యజమానులు కుదుటపడ్డారు. షాపుల్లో దోపిడీ జరగకుండా పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు త్రీ టౌన్ సీఐ అన్వర్ బాషా, ఎస్సై.. ఇతర సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకుని దొంగల ముఠాని అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు  తరలించారు

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget