అన్వేషించండి

Nellore Crime: కన్నతండ్రులే నరరూప రాక్షసులు.. నెల్లూరు జిల్లాలో వరుస దారుణాలు

Nellore Crime: కనురెప్పలుగా కన్న బిడ్డల్ని కాపాడుకోవాల్సిన తండ్రులే ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం, నెల్లూరు జిల్లాలో వరుసగా ఇలాంటి ఘటనలు బయటపడటం సంచలనంగా మారింది.

Andhra Pradesh: మద్యం మత్తులో దారుణాలకు తెగబడేవారిని చూస్తూనే ఉన్నాం. గంజాయి మత్తు తలకెక్కితే వావి వరసలు మరచిపోయే కీచకుల ఉదాహరణలు కూడా ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఇలాంటి వరుస ఘటనలు ఉలిక్కిపడేలా చేశాయి. రెండు చోట్లా తండ్రులే దారుణాలకు ఒడిగట్టారు. వారికి పుట్టిన పాపానికి కుమార్తెలు నరకం అనుభవిస్తున్నారు. రోజుల వ్యవధిలో జిల్లాలో జరిగిన ఈ దారుణాలు సంచలనంగా మారాయి. 

నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలో కన్నతండ్రి కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భార్య, ముగ్గురు కుమార్తెలతో స్థానికంగా నివాసం ఉంటున్న ఆ నీఛుడికి మద్యం అలవాటు ఉంది. ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి ఇంట్లోవారిని చావాబాదేవాడు. సోమవారం రాత్రి కూడా మద్యంతాగి ఇటికి వచ్చాడు. భార్య, ఇద్దరు కుమార్తెలను బయటకు పంపి, పెద్ద కుమార్తెను ఇంట్లోకి తీసుకెళ్లి తలుపు వేశాడు. లోపలనుంచి కేకలు వినపడ్డాయి. పసిపిల్లను ఎందుకు కొడుతున్నావంటూ బయట నుంచి భార్య కేకలు వేసింది. సరిగా చదువుకోవడంలేదని, తన మాట వినడంలేదని, క్రమశిక్షణలో పెట్టాలని, అందుకే దండిస్తున్నానని చెప్పాడు తండ్రి. కానీ అరుపులు కేకలు ఎక్కువ కావడంతో తల్లికి అనుమానం వచ్చింది. ఇరుగు పొరుగుని పిలిచినా ఎవరూ రాలేదు. చివరకు తలుపు తెరిచిన తర్వాత కూతురు పరుగు పరుగున తల్లి వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పింది. అప్పుడు కానీ ఆ తండ్రి దుర్మార్గం బయటపడలేదు. ఇంట్లో తలుపులు వేసి కన్న కూతురిపైనే పశువులా ప్రవర్తించాడు తండ్రి. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్న ఈ ఘటనతో స్థానికులు షాకయ్యారు. ఇలాంటి వ్యక్తి తమ పొరుగున ఉన్నాడని తెలిసి భయపడిపోయారు. అందరూ కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షలకు పంపించారు. తండ్రి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మద్యం మత్తులో కన్న తండ్రే కూతురిపై అఘాయిత్యం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. 

నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కొన్నిరోజులుగా తండ్రి చేస్తున్న దారుణాలను మౌనంగా భరిస్తున్న ఆ చిన్నారి చివరకు ధైర్యం చేసి తల్లికి విషయం చెప్పింది. తండ్రి చేష్టల్ని వివరించింది. తన భర్త ఇంత నీఛుడా అని ఆ భార్య భయపడింది. కన్న కుమార్తె విషయంలో జరిగిన దారుణాలను పోలీసులకు వివరించింది. పోలీసులు ఆ నీఛుడ్ని అరెస్ట్ చేశారు. పోక్సో కేసు పెట్టి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ విధించింది. మద్యం మత్తులో ఆ నీఛుడు ప్రతి రోజూ బిడ్డతో దారుణంగా ప్రవర్తించేవాడని తేలింది. తల్లికి అనుమానం రాలేదు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ తండ్రి బెదిరించడంతో కొన్నాళ్లుగా ఆ వేదనను భరిస్తూ వచ్చింది కుమార్తె. చివరకు తల్లితో చెప్పడంతో ఆమె పోలీసులకు కంప్లయింట్ చేసింది. 

కనురెప్పలుగా కన్న బిడ్డల్ని కాపాడుకోవాల్సిన తండ్రులే ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం జిల్లాలో వరుసగా ఇలాంటి ఘటనలు బయటపడటం సంచలనంగా మారింది. మద్యం మత్తులో మృగాలుగా మారిన తండ్రులు.. కన్నబిడ్డల్నే కాటేశారు. తండ్రి స్థానానికే తలవంపులు తెచ్చారు. 

Also Read: ఐ ఫోన్ కోసం డెలివరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Rains: అల్పపీడన ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Rayachoti Issue: రాయచోటిలో అయ్యప్పభక్తులపై దాడి ఘటన కలకలం  - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
రాయచోటిలో అయ్యప్పభక్తులపై దాడి ఘటన కలకలం - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
Embed widget