Chandrayaan 3 Launch: చంద్రయాన్-3 ప్రయోగానికి డేట్, టైం ఫిక్స్ - ఇస్రో అధికారిక ప్రకటన
చంద్రయాన్ 3 ప్రయోగానికి తేదీ, సమయాన్ని ఇస్రో ప్రకటించింది. జూలై 14న మధ్యాహ్నం 2.35 నిమిషాలకి ప్రయోగం చేపడతామని ఇస్రో ట్వీట్ చేసింది.
చంద్రుడిపై పరిశోధనలు లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపడుతున్న చంద్రయాన్ 3 ప్రయోగానికి తేదీ, సమయాన్ని ఇస్రో ప్రకటించింది. జూలై 14న మధ్యాహ్నం 2.35 నిమిషాలకి ప్రయోగం చేపడతామని ఇస్రో ట్వీట్ చేసింది.
Announcing the launch of Chandrayaan-3:
— ISRO (@isro) July 6, 2023
🚀LVM3-M4/Chandrayaan-3 🛰️Mission:
The launch is now scheduled for
📆July 14, 2023, at 2:35 pm IST
from SDSC, Sriharikota
Stay tuned for the updates!
ఇటీవలే ఈ ప్రయోగంలో భాగంగా చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎంకే III (జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్ మార్క్ III) తో అనుసంధానించారు. చంద్రుడిపైకి భారత్ ఉపగ్రహాన్ని పంపుతున్న మూడో ప్రయోగం ఇది. చంద్రయాన్-2 కు కొనసాగింపుగా దీన్ని ఇస్రో చేపడుతోంది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా మాత్రమే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగాయి. జులై 13వ తేదీన చంద్రయాన్ -3 ప్రయోగాన్ని చేపట్టేందుకు అన్ని సిద్ధం చేస్తోంది ఇస్రో. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరి కోట స్పేస్ సెంటర్ నుంచి ఈ మిషన్ ను చేపట్టనున్నారు.