కందుకూరు దుర్ఘటనపై సీఎం, గవర్నర్ సహా ప్రముఖుల దిగ్భ్రాంతి- రెండు లక్షల పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కందుకూరు దుర్ఘటనపై చాలా మంది రాజకీయ ప్రముఖులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మృతులకు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
![కందుకూరు దుర్ఘటనపై సీఎం, గవర్నర్ సహా ప్రముఖుల దిగ్భ్రాంతి- రెండు లక్షల పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం Celebrities including the CM and Governor expressed Grief over the Kandukur incident కందుకూరు దుర్ఘటనపై సీఎం, గవర్నర్ సహా ప్రముఖుల దిగ్భ్రాంతి- రెండు లక్షల పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/29/10ddad36e2bd4f9b6495aea190751f2a1672294621395215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందడంతో పాటు పలువురు గాయపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను గవర్నర్ హరిచందన్ ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు
కందుకూరు ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. గాయపడిన క్షతగాత్రులకు యాభై వేలు చొప్పున సాయం అందిస్తామని వెల్లడించారు. ఈ మేరకు జిల్లా అధికారులకు సీఎంవో ఆదేశాలు జారీ చేసింది.
నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం శ్రీ వైయస్.జగన్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మృతులకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 29, 2022
కుందుకూరులో తెలుగుదేశం నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోవడం చాలా బాధ కలిగించిందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇది చాలా దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను అని... అలాంటి కార్యకర్తలు ప్రమాదం బారిన పడి మరణించడం చాలా విచారకరమన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేశారు. ఆయా కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కందుకూరు ప్రమాదం దురదృష్టకరం - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/uDY8UcJ3TA
— JanaSena Party (@JanaSenaParty) December 29, 2022
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా కందుకూరు ప్రమాదంపై స్పందించారు. ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరమన్నారు. మృతు ఆత్మకు శాంతి కలగాలని సంతాప వ్యక్తం చేశారు. సభలు, సమావేశాలు సందర్భంగా రాజకీయ పార్టీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీస్ యంత్రాంగం కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికార పార్టీకి కల్పించినట్టుగానే ప్రతిపక్షాలు చేపట్టే సభలకు కూడా బందోబస్తు ఏర్పాటు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఇది రాజకీయ పార్టీ సభ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరణించిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు.
కందుకూరు ఘటనపై ప్రధాని మోడీ గారు తమ దిగ్భ్రాంతిని తెలియజేసి మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్గ్రేషియాను , అలాగే గాయపడ్డ వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించడం జరిగింది.
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) December 29, 2022
ప్రధాని శ్రీ @narendramodi గారికి @BJP4Andhra ధన్యవాదాలు తెలియజేస్తుంది.
#Kandukur #AndhraPradesh pic.twitter.com/uGXlj346W6
నెల్లూరు జిల్లాలో జరిగిన @JaiTDP బహిరంగ సభ దుర్ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపి క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని పార్టీలకతీతంగా పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబీకులకు 2 లక్షలు & గాయపడిన వారికి రూ.50,000 ప్రకటించిన @narendramodi గారికి ధన్యవాదాలు.
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) December 29, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)