![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Idi Manchi Prabhutvam: "ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Prakasam:ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయినందుకు తీసుకొచ్చిన పథకాలు ప్రజలకు వివరిస్తూనే వారి సమస్యలు తెలుసుకునేందుకు ఇది మంచి ప్రభుత్వం పేరుతో కార్యక్రమం చేపట్టింది.
![Idi Manchi Prabhutvam: Andhra Pradesh CM Chandrababu will Start the Idi Manchi Prabhutvam Programme At Santhanuthalapadu in the Prakasam District Idi Manchi Prabhutvam:](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/20/f55d92fd142040aa8d7952d36952b5441726792700640215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chandra Babu Tour In Santhanuthalapadu: ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న వంద రోజుల తర్వాత చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిరాలపాడులో ఇవాళ పర్యటిస్తారు. అక్కడ జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి వంద రోజులు అయిన సందర్భంగా మద్దిరాలపాడు గ్రామంలో"ఇది మంచి ప్రభుత్వం(Idi Manchi Prabhutvam)" కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ఇది మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఇవాళ్టి నుంచి ఆరు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతిని ప్రతి ఇంటికి చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ గ్రామంలోనే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
తొలుత శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురంలో కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. కానీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆఖరి నిమిషంలో పర్యటన వాయిదా పడింది. హెలికాప్టర్ వెళ్లేందుకు అధికారులు ఓకే చెప్పకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇది మన ప్రభుత్వం కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు ఇంటింటికీ వెళ్లి ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన పథకాలు గురించి వివరిస్తారు. ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. చివరకు ఆ గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేసిన జరిగిన మంచి వివరిస్తూనే వాళ్లు ఇచ్చిన వినతులు స్వీకరించారు. తర్వాత ఆ గ్రామంలో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించి జనం నుంచి వినతులు స్వీకరించాలి. వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి.
Also Read: అనిల్‌కి షాక్, విజయసాయికి నో ఛాన్స్.. నెల్లూరు వైసీపీలో మార్పులు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)