Sajjala Ramakrishna Reddy: 'గనులు దోచేసి అక్రమాలకు పాల్పడ్డారు' - వైసీపీ నేత సజ్జలపై సీఐడీకి ఫిర్యాదు
Andhrapradesh News: వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై.. నెల్లూరు జిల్లాకు చెందిన గనుల యజమాని సీఐడీకి ఫిర్యాదు చేశారు. తమను బెదిరించి తమ పొలాల్లో గనులు అక్రమంగా దోచేశారని ఆరోపించారు.
Compalint To CID Against Sajjala Ramakrishna Reddy: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన గనుల యజమాని.. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై (Sajjala Ramakrishna Reddy) సీఐడీకి (AP CID) ఫిర్యాదు చేశారు. సజ్జల కనుసన్నల్లోనే గనులు దోచేశారని ఆరోపించారు. ఈ మేరకు గనుల యజమాని బద్రీనాథ్.. సజ్జల, ఆయన అనుచరులపైనా సీఐడీ డీఎస్పీకి మంగళవారం ఫిర్యాదు చేశారు. సైదాపురం మండలం జోగుపల్లిలో తమకున్న 240 ఎకరాల్లో 8 గనులు ఉన్నాయని చెప్పారు. రెండేళ్లుగా తమ పొలాల్లోని గనులను అక్రమంగా దోచేశారని ఆరోపించారు. సజ్జల అనుచరులు శ్రీకాంత్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి దౌర్జన్యం చేశారని.. అదూరు శ్రీచరణ్, కృష్ణయ్యను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 500 నుంచి 800 కోట్ల టన్నులు తవ్వేసి రూ.వేల కోట్లు దోచుకున్నారని.. లక్షల టన్నుల క్వార్జ్‌ను మార్కెట్‌లో అక్రమంగా విక్రయించారని చెప్పారు. దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించారని అన్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారని.. సీఐడీకి ఫిర్యాదులో గనుల యజమాని పేర్కొన్నారు.
Also Read: Ys Jagan: 'ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వరా?' - స్పీకర్‌కు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ లేఖ