News
News
X

Nellore Airport : నెల్లూరుకు ఎయిర్ పోర్ట్, ఆ కల తీరేనా?

నెల్లూరు జిల్లా దగదర్తిలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ కు టీడీపీ హయాంలోనే బీజం పడింది. అప్పట్లోనే భూసేకరణ చేపట్టారు అధికారులు. డీపీఆర్ తయారు చేశారు కూడా.

FOLLOW US: 

రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేస్తామంటూ వైసీపీ ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. మరోవైపు గ్రామాల్లో రోడ్లు సరిగా వేయలేని ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ లు ఏర్పాటు చేస్తామంటే నమ్మేదెట్లా అని ప్రతిపక్షం విమర్శిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో కొత్తగా ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం అంటే అది నమ్మశక్యం కాదనే అర్థం చేసుకోవాలి. పోనీ కొత్త ఎయిర్ పోర్ట్ ల అవసరం మరీ అంత ఎక్కువగా ఉందా అంటే అది కూడా అనుమానమే. విశాఖకు ప్రత్యామ్నాయంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేస్తున్నారంటే, అక్కడ పరిపాలనా రాజధాని పెడితే ఆమేరకు అవసరం ఉంటుంది కాబట్టి భోగాపురం వరకు ఎయిర్ పోర్ట్ సాకారమవుతుందంటే నమ్మొచ్చు. కానీ నెల్లూరులాంటి పట్టణాలకు ఎయిర్ పోర్ట్ అవసరం ఎంతమేర ఉంది అంటే సమాధానం దొరకదు. 

దగదర్తి వద్ద ఎయిర్ పోర్ట్..
నెల్లూరు జిల్లా దగదర్తిలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ కు టీడీపీ హయాంలోనే బీజం పడింది. అప్పట్లోనే భూసేకరణ చేపట్టారు అధికారులు. డీపీఆర్ తయారు చేశారు కూడా. కానీ ఆ తర్వాత పనులు మొదలు కాలేదు. నెల్లూరుకి ఎయిర్ పోర్ట్ వస్తుందంటే అందరూ సంతోషించారు కానీ, ఆ తర్వాత పనులు ఆగిపోయే సరికి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అసలు నెల్లూరుకి ఎయిర్ పోర్ట్ ఏమేరకు అవసరం అనేది కూడా చర్చకు రాలేదు. ఇక వైసీపీ హయాంలో డీపీఆర్ కు మరోసారి టెండర్లు పిలిచారు. ప్రయాణికులు, కార్గో ఎయిర్‌ క్రాఫ్ట్‌ లను నిర్వహించే విధంగా డీపీఆర్‌ తయారు చేయడానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించారు. ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఇన్‌క్యాప్‌) నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. 


నెల్లూరుకి సమీపంలో చెన్నై ఎయిర్‌ పోర్టు ఉంది, ఆ తర్వాత రేణిగుంట కూడా దగ్గర్లోనే ఉంది. ఈ రెండూ కాకుండా ఇప్పుడు నెల్లూరులోనే ఎయిర్ పోర్ట్ వస్తే జిల్లా వాసులకు ఉపయోగమే. అయితే సరకు  రవాణా విషయంలో ఆ ఉపయోగం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్ట్ నుంచి కార్గో రవాణా గరిష్ట స్థాయికి చేరుకుంది. దీనికి ప్రత్యామ్నాయంగా జిల్లాలోనే రామాయపట్నం వద్ద మరో పోర్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో భారీ పరిశ్రమలు కూడా వచ్చే అవకాశముంది. దీంతో దగ్గర్లోనే ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి అవకాశాలున్నాయని అంటున్నారు. దగదర్తి ఎయిర్ పోర్ట్ అన్నిటికీ అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. సుమారు 1,350 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో ఎయిర్‌ పోర్టు నిర్మాణం చేపట్టాలని ఏపీఏడీసీఎల్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఎయిర్ పోర్ట్ డీపీఆర్ కి కేబినెట్ ఆమోద ముద్ర పడితే పనులు ముందుకు సాగుతాయి. 

తాజా పరిస్థితి ఏంటి..?
తాజాగా నెల్లూరుజిల్లా దగదర్తి ఎయిర్ పోర్ట్ వ్యవహారం మరోసారి వార్తల్లోకెక్కింది. దగదర్తిలో విమానాశ్రయ ఏర్పాటుకు సేకరించిన భూములకు పూర్తి స్థాయి పరిహారం ఇవ్వాలని దళిత సంఘర్షణ సమితి నాయకులు డిమాండ్‌ చేశారు. కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద నేతలు నిరసన చేపట్టారు. మూడున్నరేళ్లుగా దగదర్తిలో విమానాశ్రయ పనులు నిలిచిపోయాయని వారు ఆరోపిస్తున్నారు. భూసేకరణ సందర్భంతోనే పొలాల్లో రైతులకు చెందిన బావులు, బోర్లు ధ్వంసం చేశారని, భూములు లాగేసుకున్నారని, కానీ పరిహారం మాత్రం పూర్తిగా ఇవ్వలేదంటున్నారు. అటు భూములు సాగుకి పనికిరాక, ఇటు రైతులకు పరిహారం రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. 

ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాలకే సతమతం అవ్వాల్సిన పరిస్థితి ఉందని, ఇలాంటి సమయంలో ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం కలగానే మిగిలిపోతుందని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. నెల్లూరు ఎయిర్ పోర్ట్ అనేది కలకాకుండా మిగలాలంటే స్థానిక నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. స్థానిక అవసరాలకోసం సొంత పార్టీయే అయినా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఎయిర్ పోర్ట్ పనులు మొదలయ్యేలా చూడాలి. ప్రభుత్వాలు మారినా ఎయిర్ పోర్ట్ పనులు అంగుళం కూడా ముందుకు జరగలేదనే అపవాదు తొలగించుకోవాలంటే మాత్రం వైసీపీ నేతలు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాల్సి ఉంటుంది. 

Published at : 16 Sep 2022 09:43 PM (IST) Tags: Nellore news nellore airport dagadarthi airport

సంబంధిత కథనాలు

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

RK Roja On Balakrishna: ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌నన్న ముందు కాదు - బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్

RK Roja On Balakrishna: ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌నన్న ముందు కాదు - బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్

Vijayawada Traffic: విజయవాడ మీదుగా వెళ్తున్నారా? నగరంలోకి నో ఎంట్రీ - మళ్లింపులు ఇలా: పోలీసులు

Vijayawada Traffic: విజయవాడ మీదుగా వెళ్తున్నారా? నగరంలోకి నో ఎంట్రీ - మళ్లింపులు ఇలా: పోలీసులు

Tirumala News: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, ఆదివారం శ్రీవారికి నిర్వహించే పూజలు ఇవే

Tirumala News: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, ఆదివారం శ్రీవారికి నిర్వహించే పూజలు ఇవే

Special Trains: దసరా కోసం తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ట్రైన్స్ ఇవే, ఈ మార్గాల్లో రైళ్లు క్యాన్సిల్

Special Trains: దసరా కోసం తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ట్రైన్స్ ఇవే, ఈ మార్గాల్లో రైళ్లు క్యాన్సిల్

టాప్ స్టోరీస్

Jinping House Arrest: షాకింగ్! గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు- సైన్యం చేతిలోకి దేశం!

Jinping House Arrest: షాకింగ్! గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు- సైన్యం చేతిలోకి దేశం!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!