By: ABP Desam | Updated at : 21 Jun 2023 05:51 PM (IST)
దేవాన్ష్‌కు ప్రత్యేకంగా తెలుగు పాఠాలు - ఎందుకో చెప్పిన నారా లోకేష్ !
Devansh Telugu : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మనవడు .. లోకేష్ కుమారుడు దేవాన్ష్ తెలుగు మీడియంలో చదువుతున్నారా ? తెలుగు మీడియంలో కాదు కానీ..తెలుగు బాగా నేర్పించే స్కూల్ వెదికి మరీ చేర్పించామని నారా లోకేష్ ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్.. బుధవారం ఓ పాక హోటల్‌లో రాత్రి బోజనం చేశారు. ఈ సందర్భంగా తన చుట్టూ కూర్చున్న వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందులో నారా దేవాన్ష్ చదువు ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా దేవాన్ష్ ను తెలుగు నేర్పించే స్కూల్‌లో జాయిన్ చేశామని చెప్పారు.
ప్రత్యేకంగా తెలుగును దేవాన్ష్ కు నేర్పించడానికి లోకేష్ చెప్పిన కారణం కూడా భిన్నంగా ఉంది. నారా లోకేష్ పూర్తి స్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నారు. స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో డిగ్రీ చేసి అంతర్జాతీయ కంపెనీలో కొంతకాలం పని చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అయితే చదువు, ఉద్యోగం మొత్తం ఇంగ్లిష్ లోనే జరగడంతో.. తెలుగు మాట్లాడటానికి ఇబ్బంది పడేవారు. దీంతో ఆయన తెలుగుపై అనేక రకాల ట్రోల్స్ వచ్చాయి. ఈ కారణంగా లోకేష్ పట్టుదలతో తెలుగు తప్పుల్లేకుండా నేర్చుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే శ్రమించాల్సి వచ్చింది. అందుకే నారా దేవాన్ష్ కు తెలుగు విషయంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకే.. ఇలా తెలుగు బాగా నేర్పించే స్కూల్ లో చేర్పించినట్లుగా లోకేష్ చెప్పారు.
నారా దేవాన్ష్ వ్యక్తిగత విషయాలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఉత్సాహంగా స్పందిస్తారు లోకేష్. పుత్రోత్సాహం అని అందరికీ అర్థం అవుతుంది. అయితే గతంలో ఇలా నారా దేవాన్ష్ చదువుపై రాజకీయ విమర్శలు వచ్చినప్పుడు మాత్రం స్పందించలేదు. ఏపీలో తెలుగు మీడియంను తీసేసి పూర్తి స్థాయిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలనుకున్నప్పుడు... తెలుగు మీడియం కూడా ఉంచచాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ముఖ్యంగా టీడీపీ.. తెలుగు మీడియంను పూర్తిగా ఎత్తి వేయవద్దని.. ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు మీడియంను కూడా ఉంచాలని డిమాండ్ చేసింది. ఆ సమయంలో వైసీపీ.. పేదలకు ఇంగ్లిష్ మీడియం చదువులు వద్దా అని ఎదురుదాడి చేసింది.
నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ చదివే స్కూల్లో తెలుగు మీడియం ఉందా అని విమర్శలు గుప్పించారు. అయితే రాజకీయ అంశాల విషయంలో దేవాన్ష్ అంశాన్ని తీసుకు రావడం ఇష్టం లేక..లోకేష్.. కానీ టీడీపీ నేతలు కూడా స్పందించలేదు. ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేకుండా పార్టీ నేతలో పిచ్చాపాటిగా మాట్లాడుతూ.. దేవాన్ష్ కు తెలుగు నేర్పడంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లుగా వెల్లడించారు.
GGH Paderu: పాడేరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 256 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ
Tirupati Rains: తుపాన్ ప్రభావంతో తిరుపతిలో భారీ వర్షాలు, పలు విమానాలు దారి మళ్లింపు!
Weather Update: మిచాంగ్ తుపానుగా మారిన వాయుగుండం, ఏపీపై తీవ్ర ప్రభావం - భారీ వర్ష సూచనతో IMD రెడ్ అలర్ట్
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్
/body>