Gorantla Madhav Video: గోరంట్ల మాధవ్ నగ్న వీడియో: ఝలక్ ఇచ్చిన టీడీపీ ఎంపీలు, పదవికి ఎసరు వచ్చేనా?
Gorantla Madhav పై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ ఎంపీలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. మంగళవారం (ఆగస్టు 9) ఉదయం ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాను కలిశారు.
![Gorantla Madhav Video: గోరంట్ల మాధవ్ నగ్న వీడియో: ఝలక్ ఇచ్చిన టీడీపీ ఎంపీలు, పదవికి ఎసరు వచ్చేనా? MP Rammohan naidu other TDP MPs complaints to loksabha speaker to take action against Gorantla madhav Gorantla Madhav Video: గోరంట్ల మాధవ్ నగ్న వీడియో: ఝలక్ ఇచ్చిన టీడీపీ ఎంపీలు, పదవికి ఎసరు వచ్చేనా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/09/6bcc283f7513a91286f75dedf4f4bdba1660037307345234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TDP MPs Complaints to Loksabha Speaker: హిందూపురం ఎంపీ (Hindupur MP) గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) ఓ మహిళతో చేసిన నగ్న వీడియో సంచలనం రేపుతున్న వేళ ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ ఎంపీలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. మంగళవారం (ఆగస్టు 9) ఉదయం ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాను కలిశారు. అనంతరం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు (MP Rammohan Naidu Press Meet) ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
‘‘ప్రజల చేత ఎన్నుకున్న ఓ పార్లమెంటు సభ్యుడు ఇలా చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? మాధవ్ లాంటి వ్యక్తిని కాపాడాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారు. మహిళల గౌరవం కోసం వైఎస్ఆర్ సీపీ ఎంపీనే మాధవ్‌పై (MP Gorantla Madhav) కచ్చితంగా చర్యలు తీసుకొని తీరాలి. మాధవ్ న్యూడ్ వీడియో వెనుక టీడీపీ కుట్ర ఉందని అనడానికి సిగ్గు ఉండాలి’’ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు (MP Rammohan Naidu) ధ్వజమెత్తారు.
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు (Forensic Science Laboratory) పంపేందుకు ఎన్ని రోజులు?
‘‘సజ్జల రామక్రిష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మాట్లాడుతూ.. ఎంపీపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మళ్ళీ మాట ఎందుకు మారుస్తున్నారు. వీడియో ఫోరెన్సిక్ విభాగానికి పంపడానికి ఎన్ని రోజులు పడుతుంది? మాధవ్ పై చర్యలు తీసుకునే పరిస్థితే అసలు కనిపించడం లేదు. చర్యలు తీసుకున్నట్లయితే చాలా మంది వీడియోలు ఉన్నాయి వారి పైన కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జగన్ పార్టీకి భయం. మాధవ్ పై చర్యలు తీసుకుంటారని లోక్ సభ స్పీకర్ (Loksabha Speaker) పై నమ్మకం ఉంది. స్పీకర్ కి ఆ హక్కు ఉంటుంది. మాధవ్ కేసును ఏ విధంగా పక్కదారి పట్టించాలా అని చూస్తున్నారు.’’ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు (MP Rammohan Naidu) మండిపడ్డారు.
ప్రత్యేక హోదా సహా ఏపీ రాష్ట్రానికి చెందిన సమస్యలపై మాత్రం వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ఎందుకు పట్టించుకోవడం లేదని రామ్మోహన్ నాయుడు (MP Rammohan Naidu) విమర్శించారు. కానీ సీఎం జగన్ కు సంబంధించిన కేసుల్లో పనుల కోసం ఎంపీలు ఢిల్లీ మొత్తం తిరుగుతారని అన్నారు.
వారం క్రితం ఆ వీడియో సంచలనం
సోషల్ మీడియాలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు (MP Gorantla Madhav) చెందిన అభ్యంతరకర నగ్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందులో ఆయన, చొక్కా లేకుండా, నగ్నంగా ఒక మహిళతో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆయన నగ్నంగా కాల్ మాట్లాడారు అంటూ ఆ వీడియో వైరల్ అయింది. టీడీపీ నేతలు ఈ వీడియోను విపరీతంగా వైరల్ చేశారు.
అయితే, ఈ అంశంపై ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) తో ఏబీపీ దేశం (ABP Desam) ప్రత్యేకంగా మాట్లాడింది. అయితే, తాను జిమ్ లో ఉండగా ఆ తీసుకున్నానని, ఆ వీడియోను, ఓ మహిళతో మాట్లాడుతున్నట్లుగా మార్ఫింగ్ చేశారని గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) వివరణ ఇచ్చారు. టీడీపీ నేతలు కుట్ర పూరితంగా ఈ పని చేశారని ఆరోపించారు. దీనిపై సైబర్ సెల్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు.
ఈ అంశంపై ఆ రోజు ఢిల్లీలో కూడా గోరంట్ల మాధవ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘వీడియోలను మార్ఫింగ్ చేసి నన్ను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర, కుతంత్రం జరుగుతోంది. నేను ఏ విచారణకైనా సిధ్దం. ఇప్పటికే జిల్లా ఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. సంబంధిత వ్యక్తులను చట్టపరిధిలోకి తీసుకురావాలని కోరాను. ఆ వీడియో ఫోరెన్సిక్ టెస్ట్ కైనా సిధ్దమే. తెలుగు దేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు చేసిన కుట్ర ఇది. సదరు వ్యక్తులపై నేను పరువు నష్టం దావా కూడా వేస్తాను.’’ అని ఎంపీ మాట్లాడారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)