అన్వేషించండి

TDP News : సీఐడీ చీఫ్ సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారు - కేంద్ర హోంమంత్రి ఫిర్యాదు చేసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు !

ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై కేంద్ర హోంమంత్రికి ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్ ఉల్లంఘిస్తున్నందున చర్యలు తీసుకోవాలన్నారు.


TDP News :   ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పూర్తి స్థాయిలో సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు.  సర్వీస్ రూల్స్ అతిక్రమించి మ‌రీ సంజయ్ వైసీపీకి అనుకూలంగా ప‌నిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఆల్ ఇండియ‌న్ స‌ర్వీస్ రూల్స్ మేర‌కు రాజ‌కీయ ప‌క్షపాతాలు లేకుండా ప‌నిచేయాల్సిన సీఐడీ చీఫ్ అన్నింటినీ ఉల్లంఘించార‌ని హోం మంత్రికి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యక‌ర్త మాదిరిగా ప‌నిచేస్తున్న ఐపీఎస్ అధికారి సంజ‌య్, సీఎం వైఎస్ జ‌గ‌న్ కోసం ప్రతిప‌క్షాల‌పై బుర‌ద చ‌ల్లుతున్నారని ఫిర్యాదులో ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ సీఐడీ చీఫ్ సంజయ్ వ్యవహరిస్తున్నారని రామ్మోహన్ నాయుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వీస్ రూల్స్ అతిక్రమిస్తున్నారు అని ఆరోపించారు.ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం రాజకీయ పక్షపాతం లేకుండా పనిచేయాల్సిందిపోయి అన్నింటిని ఉల్లంఘిస్తున్నారు అని ఆరోపించారు.

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో ప్రతిపక్షనేత చంద్రబాబుని అరెస్టు చేసి విచార‌ణ చేయాల్సిన అధికారి, ఎటువంటి విచార‌ణ జ‌ర‌ప‌కుండానే స‌ర్వీసు నిబంధ‌న‌ల‌కి వ్యతిరేకంగా దేశ‌వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెడుతూ ఆరోప‌ణ‌లు చేయ‌డం తీవ్రమైన నేరంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ద‌ర్యాప్తు అంశాలు రూపొందించి కోర్టుల‌కి నివేదించాల్సిన బాధ్యత కలిగిన ఐపీఎస్ అధికారి ఫ‌క్తు వైసీపీ నేత‌లాగ ఢిల్లీ, హైద‌రాబాద్, అమ‌రావ‌తిలో ప్రెస్ మీట్లు పెడుతూ ప్రతిప‌క్ష నేత‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నారన్నారు. అలాగే ద‌ర్యాప్తులో గోప్యంగా ఉంచాల్సిన అంశాలను మీడియాకి విడుద‌ల చేస్తున్నారని ఫిర్యాదులో ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సీఐడీ చీఫ్ సంజ‌య్ ఉల్లంఘించిన స‌ర్వీస్ రూల్స్, అతిక్రమించిన నిబంధ‌న‌లు ఆధారాల‌ను హోం మంత్రికి ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు పంపించార‌ు. సీఐడీ చీఫ్ సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

స్కిల్ స్కాంలో చంద్రబాబును ఎనిమిదో తేదీన అరెస్టు చేసిన రోజున.. ఆయను విజయవాడ తీసుకు రాక ముందే మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. తర్వాత పలు చోట్ల ప్రెస్ మీట్ పెట్టారు. అవసరం లేకపోయినా హైదరాబాద్ ఢిల్లీల్లోనూ ప్రెస్ మీట్లు పెట్టడం వివాదాస్పదమయింది. కోర్టుకు సమర్పించాల్సిన సన్నితమైన అంశాలను కూడా మీడియా ముందు ప్రదర్శించడంతో న్యాయనిపుణులు విస్మయానికి గురయ్యారు. ఇదే అంశంపై ఇప్పుడు.. రామ్మోహన్ నాయుడు హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. 

సీఐడీ చీఫ్ వ్యవహారశైలిపై టీడీపీ నేతలు తీవ్రమైన  విమర్శలు చేస్తున్నారు.  వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త మాదిరి వ్యవహరిస్తున్నారని అంటున్నారు.  సీఐడీ చీఫ్ హోదాలో ఆయన పెట్టే ప్రెస్ మీట్లలో రాజకీయ విమర్శలు చేస్తూండటంతో  .. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని టీడీపీ నిర్ణయించుకున్నట్లుగా  తెలుస్తోంది.                                                                                

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Jeedimetla Fire Accident Today: జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
Lucky Bhaskar OTT Streaming: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
Embed widget