అన్వేషించండి

Raghurama Krishna Raju: ఏపీ గవర్నర్‌కు వైసీపీ ఎంపీ లేఖ - చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన

Raghurama Krishna Raju: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ గవర్నర్‌కు శుక్రవారం లేఖ రాశారు.

Raghurama Krishna Raju: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ గవర్నర్‌కు శుక్రవారం లేఖ రాశారు. చంద్రబాబు ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. డీహైడ్రేషన్‌, అలర్జీ సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఐదు కిలోల బరువు తగ్గారని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

మరింత బరువు తగ్గితే కిడ్నీలు దెబ్బతినే పరిస్థితి వస్తుందన్నారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం, అధికారులు యత్నిస్తున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. హానికరమైన స్టెరాయిడ్లు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, తక్షణం చంద్రబాబు ఆరోగ్య విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రజా నాయకుడు చంద్రబాబుకు వెంటనే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను అభ్యర్థించారు.

చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, టీడీపీ నేతల ఆందోళన
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినే చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అరెస్టైన మొదటి  రోజు నుంచి ఆయనకు సరైన వసతులు కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. ఆయన తరచూ అనారోగ్యం బారిన పడటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత  ఎక్కువగా ఉంది. వేడి వాతావరణం కారణంగా చంద్రబాబు స్వల్ప అస్వస్థతకు గురి అయ్యారని వార్తలు వచ్చాయి. మొన్న డీహైడ్రేషన్ అయ్యారని, నిన్న అలర్జీ వచ్చిందని చెప్పుకుంటున్నారు. 

చంద్రబాబుకు ప్రమాదం పొంచి ఉందని ట్వీట్ చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆయన విషయంలో ప్రభుత్వం ఏదో దాస్తోందని ఆరోపించారు. జైలులో అపరిశుభ్రమైన వాతావరణంలో చంద్రబాబును ఉంచారని దీని వల్ల ఆయన తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారని అభిప్రాయపడ్డారు. దీని వల్ల ఆయనకు ఆరోగ్య సమస్యలతోపాటు ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఆయనకు స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఏదో దాస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే దానికి పూర్తి బాధ్యత జగన్ మోహన్ రెడ్డే తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

చంద్రబాబు హెల్త్‌పై, జైలు అధికారుల తీర్పు ఆయన సతీమణి భువనేశ్వరి ఉదయం ట్వీట్ చేశారు. ఆయన ఆరోగ్యం , వయసు రీత్య సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని ఆరోపించారు. ఇప్పటి ఆయన ఐదు కిలోల బరువు తగ్గారని... ఇలా బరువు తగ్గుతూ పోతే ఆయన కిడ్నీలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో నీళ్లు సరఫరా చేసే ఓవర్‌ హెడ్ ట్యాంక్‌ సరిగా శుభ్రం చేయడం లేదని కూడా విమర్శించారు. ఇలాంటి వాతావరణమే అనారోగ్యానికి ప్రధాన కారణమని అన్నారు. ఇలాంటి అపరిశుభ్రమైన వాతావరణం తన భర్త ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 

చంద్రబాబు కోడలు నారా లోకేష్ భార్య బ్రహ్మణీ కూడా ట్వీట్ చేశారు. అపరిశుభ్రమైన వాతావరణంలో జైలులో ఉంచడం హృదయవిదారకరమైన ఘటనగా అభివర్ణించారు. ఇలాంటి పరిస్థితి ఆయనకు ప్రమాదకరమన్నారు. ఆయన ఆరోగ్య, వయసు రీత్య మెరుగైన వైద్య సేవలు అవసరం అని అభిప్రాయపడ్డారు. ఆయనకు కావాల్సిన వైద్యం సకాలంలో అందడం లేదన్నారు.  టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లు కాకుండా డిప్యూటీ సూపరింటెండెంట్ ఎలా రిపోర్టు ఇస్తారని ప్రశ్నించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election JPC:  జమిలీకి  జేపీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీకి జేపీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Nandamuri Mokshagna: మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election JPC:  జమిలీకి  జేపీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీకి జేపీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Nandamuri Mokshagna: మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
Embed widget