అన్వేషించండి

Ysrcp News : అధికారంలోకి వస్తే ఎంత మందిని బలిస్తారో ? - చంద్రబాబును శాశ్వతంగా జైల్లో ఉంచాలన్న్ వైసీపీ నేత !

చంద్రబాబును శాశ్వతంగా జైల్లో ఉంచాలని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. బెయిల్ వచ్చిందని జంతుబలి ఇచ్చారని అధికారంలోకి వస్తే ఎంత మందిని బలిస్తారోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Ysrcp News :  చంద్రబాబు నాయుడు బెయిల్ పై విడుదలైన సందర్భంగా పొట్టేళ్లను బలివ్వడంపై అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు  విడుదల సందర్భంగా టీడీపీ నాయకులు జంతు బలి ఇవ్వడం దారుణమన్నారు.  కోర్టులు ఎక్కడా చంద్రబాబు నేరం చేయలేదని చెప్పలేదన్నారు.  చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని  టీడీపీ శ్రేణులు విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని మండిపడ్డారు.  చంద్రబాబు విషయంలో న్యాయం గెలిచిందా? రోగం గెలిచిందా? అని ప్రశ్నించారు. మానవతా దృక్పదంతోనే కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్నారు. 

చంద్రబాబు చిత్ర పటానికి పొట్టేళ్ళను బలి ఇచ్చి....రక్తం పూసి హేయమైన కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.  చంద్రబాబు బయటకు రాగానే జంతు బలులు ఇస్తున్నారు.... చంద్రబాబుకు అధికారం వస్తే ఇంకెంత మందిని బలి ఇస్తారో అని అనుమానం వ్యక్తం చేశారు.  శాశ్వతంగా జైలులో ఉండాల్సిన చంద్రబాబు... నాలుగు వారాలు వైద్యం కోసం మాత్రమే బయటకు వచ్చారని అన్నారు.  చంద్రబాబు ఇంకొక పదిహేనేళ్లు బతకాలి...జగన్ సీఎంగా ఉండాలన్నారు.  చంద్రబాబు బతికి ఉన్నంత కాలం....ప్రజలు జగన్ ను సీఎంగా గెలిపిస్తారని జోస్యం చెప్పాపు.  వైద్యం కోసం బయటకు వచ్చిన చంద్రబాబు తిరిగి ఆరోగ్యంగా జైలుకు వెళ్ళాల్సి ఉందన్నారు.  2024 కురుక్షేత్ర యుద్దంలో కౌరవులకు పట్టిన గతే...టీడీపీ కి పడుతుందన్నారు.  తప్పు చేసిన వాళ్ళు బయట తిరిగితే....ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయి ఈ దేశం పాకిస్థాన్ లా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.                        

చంద్రబాబు జైలు నుంచి బెయిల్ పై విడుదలైన సందర్భంగా అనంతపురం జిల్లాలో వినూత్నంగా సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం బెయిల్ పై విడుదల అయిన సందర్భంగా అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. అందరూ బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకొని పసుపు రంగు చల్లుకొని సంబరాలు చేసుకుంటే.. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం సిద్దరాంపురం గ్రామంలో మాత్రం పొట్టేళ్లను నరికి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు. జైలు నుంచి చంద్రబాబు బయటికి వస్తే పొట్టేళ్లు నైవేద్యంగా పెడతామని గ్రామ ప్రజలు మొక్కుకున్నారు. మంగళవారం చంద్రబాబు విడుదల సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున పొట్టేలను నరికి గ్రామస్తులు సంబరాలు చేస్తున్నారు. చంద్రబాబు చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు.                                      

అనంతపురం నగరంలో చంద్రబాబు బెయిల్ పై విడుదల అయిన సందర్భంగా టీడీపీ యువకులు స్కార్పియో వాహనంపై క్రాకర్స్ తో సంబరాలు చేసుకున్నారు. తారాజువ్వల పెట్టెను స్కార్పియో వాహనంపై ఉంచి వెలిగించి, డ్రైవ్ చేస్తూనే వాటిని పేల్చారు. ఈ దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. దీనిపై రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget