అన్వేషించండి

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

టీచర్లకే కాదు త్వరలో ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ అమలు చేస్తామని మంత్రి బొత్స ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాల నేతల భేటీలో ఆయనీ ప్రకటన చేశారు.


AP News:   ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులకు ఫేస్ అటెండెన్స్ తప్పదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. రెండు రోజుల నుంచి తిప్పలు పడుతున్న ఉపాధ్యాయ సంఘాలను ఆయన చర్చలకు పిలిచారు. ఈ చర్చల్లో ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగ ఫోన్లలో ఫేస్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోలేమని.. అది డేటా సెక్యూరిటీకి ఇబ్బంది అవుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రతి ఒక్కరిగా అటెండెన్స్ రిజిస్టర్ కోసం డివైస్‌లు ఇవ్వాలన్నారు. చాలా చోట్ల సిగ్నల్ ఉండటం లేదని దానికీ పరిష్కారం చూపాలన్నారు. అలాగే వివిధ రకాల యాప్‌ల వాడకంలో వస్తున్న ఇబ్బందుల గురించి వివరించారు. అయితే ఎన్ని సమస్యలు వచ్చినా ఫేస్ యాప్‌ను వినియోగించి తీరాలని బొత్స సత్యనారాయణ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. 

ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ 

ఒక్క ఉపాధ్యాయులకు మాత్రమే కాదని.. ప్రభుత్వ ఉద్యోగులందరికీ త్వరలో ఫేస్ యాప్ అటెండెన్స్ అమలు చేస్తామని బొత్స సత్యనారాయణ చెప్పినట్లుగా ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.  గంటన్నరకు‌పైగా సాగిన ఈ సమావేశంలో ముఖ ఆధారిత యాప్‌పై ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సొంత ఫోన్లను వాడటం తమకు సాధ్యం కాదని  ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. సొంత ఫోన్లు‌ వాడాల్సిందేనని మంత్రి తేల్చి చెప్పారు. అన్ని‌ ప్రభుత్వ శాఖల్లో ఈ యాప్ త్వరలో అమల్లోకి వస్తుందని బొత్స చెప్పారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు  పదిహేను రోజుల తర్వాత మళ్లీ భేటీ కావాలని నిర్ణయించుకున్నాయి.  ‘‘అన్ని ప్రభుత్వ శాఖల్లో యాప్ వినియోగంలోకి వస్తుందని మంత్రి చెప్పారు. అందరికీ సెల్ ఫోన్లు కొనివ్వాలంటే.. రూ. 200 కోట్లు  ఖర్చవుతుందన్నారు. మా ఫోన్ల ద్వారా‌నే యాప్ వాడాలని’’ చెప్పారని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. 

డివైజ్‌లు ఇవ్వాలంటున్న ఉపాధ్యాయులు

రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన తొలిరోజే ఈ ఫేస్‌ క్యాప్చరింగ్‌ అటెండెన్స్‌ ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతోంది. '' మేం విద్యార్ధులకు పాఠాలే చెప్పాలా..యాప్‌ లతో కుస్తీ పట్టాలా'' అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు. యాప్‌ అటెండెన్స్‌ విధానం వల్ల తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఫేస్‌ క్యాప్చరింగ్‌ అటెండెన్స్‌ విధానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. యాప్‌ డౌన్‌లోడ్‌కు తోడు.. ఫొటో అప్‌లోడ్‌ చేయడానికి ఉపాధ్యాయులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.. ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరోసారి సమావేశం అవుదామని చెప్పిన బొత్స  

నెట్‌ లేక కొంతమంది, స్మార్ట్స్‌ ఫోన్స్‌ లేక ఇంకొంత మంది ఈ యాప్‌తో ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు.. డౌన్‌లోడ్‌ ప్రాబ్లమ్‌, నెట్‌ వర్క్‌ ప్రాబ్లెమ్‌ తో ఏం చేయాలో తెలియక టీచర్స్‌ తలాలు పట్టుకుంటున్నారు. గతంలో ఉన్న బయోమెట్రిక్‌ విధానాన్ని పక్కన పడేసి.. ప్రభుత్వం కొత్తగా తీసుకుని వచ్చిన ఈ యాప్‌ పై మండిపడుతున్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే తమ విధులను బారు కాట్‌ చేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు. మంత్రితో జరిగిన చర్చల్లోనూ స్పష్టత లేకపోవడంతో తదుపరి ఉపాధ్యాయ సంఘాలు ఏం చేస్తాయన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balakrishna: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABPNandamuri Balakrishna Files Nomination | Hindupur | హిందూపురంలో నామినేష్ వేసిన నందమూరి బాలకృష్ణ |ABPMadhavi Latha Shoots Arrow At Mosque |Viral Video | బాణం వేసిన మాధవి లత... అది మసీదు వైపే వేశారా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balakrishna: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
Itel Super Guru 4G: ‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Embed widget