Somu Veerraju : విశాఖ గర్జన ప్రభుత్వ స్పాన్సర్డ్ ప్రోగ్రాం, పవన్ ను నిర్బంధించడం అప్రజాస్వామికం- సోము వీర్రాజు
Somu Veerraju : విశాఖలో పవన్ కల్యాణ్ ను అక్రమంగా నిర్బంధించారని సోము వీర్రాజు అన్నారు. బీజేపీ, జనసేన కలిసి వైసీపీ దమన చర్యలపై పోరాటం చేస్తాయన్నారు.
Somu Veerraju : బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేనాని పవన్ కల్యాణ్ తో సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. విశాఖలో జరిగిన పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. విజయనగరంలో బీజేపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు చేస్తున్నారని పవన్ ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు నేతలపై దాడులతో భయపెడుతున్నారన్నారు. జనసేన నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టారని ఆరోపించారు. నిన్న ఘటన పూర్తిగా ప్రభుత్వం కుట్రగా భావిస్తున్నామన్నారు. తనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. సన్నాసులు ఏదో వాగుతారు వారి మాటలను పట్టించుకోనవసరం లేదని మాజీ మంత్రి పేర్ని నానికి కౌంటర్ ఇచ్చారు.
విశాఖ గర్జన విఫలమవ్వడంతో కుట్రలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ యాత్రను అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో ఆందోళన కలిగించే అంశమన్నారు. జనసేనాధిపతిగా అనేక కార్యక్రమాలు, పర్యటనలు చేపట్టారన్నారు. వైసీపీ వాళ్లు ఒక ఉద్యమం చేస్తున్నారని, వాళ్ల కార్యక్రమానికి స్పందన రాకపోవడంతో జనసేన పై కుట్ర చేశారని ఆరోపించారు. ప్రతిపక్షాలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమన్నారు. ఈ అంశాలను కేంద్ర పెద్దలకు కూడా వివరించామన్నారు. వారు కూడా వైసీపీ ప్రభుత్వం దుశ్చర్యలపై పోరాడాలని సూచించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దమన చర్యలపై పోరు సాగిస్తామని సోము వీర్రాజు అన్నారు. విశాఖ గర్జన రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్ ప్రోగ్రాం అన్నారు. జన స్పందన లేకపోవడంతో కుట్రకు తెరలేపారన్నారు. ఇక నుంచి ఇటువంటి వాటిని అడ్డుకుని తీరుతామన్నారు.
2017లో జగన్మోహన్ రెడ్డి గారిని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బయటకు వెళ్లి ప్రత్యేక హోదా కార్యక్రమంలో పాల్గొనకొండా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆపింది. అది అప్రజాస్వామికం అయితే @PawanKalyan గారిని అడ్డుకోవడం ప్రజాస్వామ్య చర్యా @YSJagan గారు. మీ చర్యలు జనసేన-బీజేపీ విజయానికి నాంది. @BJP4Andhra https://t.co/YwG6aEgGnF
— GVL Narasimha Rao (@GVLNRAO) October 16, 2022
పోలీసుల తీరు అభ్యంతరకరం
"పవన్ కల్యాణ్ తో పోలీసులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరం. ప్రజల సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్న ప్రజానాయకుడ్ని నిర్బంధించడం సరైన పద్దతి కాదు. జనసేన కార్యకర్తల మీద హత్యాయత్నం కేసులు పెట్టడం చాలా అప్రజాస్వామ్య చర్యలివి. వైసీపీ ప్రభుత్వం పాల్పడుతున్న చర్యలను కేంద్ర పెద్దలకు కూడా వివరించాం. వాళ్లు వైసీపీ దుశ్చర్యలను ధైర్యం ఎదుర్కోండని సూచించారు. జనసేన, బీజేపీ కలిసి వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాం. " - సోము వీర్రాజు
జనవాణిని కావాలనే అడ్డుకున్నారు- నారాయణ
విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ను టార్గెట్ చేసుకొని జనసైనికులను రెచ్చగొట్టారని ఆరోపించారు. విశాఖలో వైసీపీ నేతలు చేపట్టిన విశాఖ గర్జనకు ఎలాంటి ఆటంకాలు సృష్టించని పోలీసులు జనసేన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. అమరావతి విషయంలో సీఎం జగన్ మాట తప్పి మోసం చేశారన్నారు. దున్నపోతు మీద వర్షం పడిన చందంగా వైసీపీ పాలన ఉందని నారాయణ వ్యాఖ్యానించారు.
Also Read : ఏపీలో వైసీపీ పాలనతో తెలంగాణ నష్టపోతుంది- క్రిమినల్స్‌కు ఐపీఎస్‌లు సలాం కొట్టడమేంటి?: పవన్