అన్వేషించండి

AP BJP President: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ఎన్నిక లాంఛనం - ఆశావహులంతా సైలెంట్

Madhav: ఏపీ బీజేపీ అధ్యక్షునిగా మాధవ్ ఎన్నికల లాంఛనమే కానుంది. పదవి ఆశించి తీవ్ర ప్రయత్నాలు చేసిన వారు సైలెంట్ అయ్యారు.

Madhav election as AP BJP president will be a formality: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షునిగా పీవీఎన్ మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఆయనే అభ్యర్థి అని...హైకమాండ్  సమాచారం పంపడంతో ఆశావహుల్లో ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. అందరూ సైలెంట్ అయిపోయారు.  ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పలువురు పోటీ పడ్డారు. రాయలసీమ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పార్థసారధి, సుజనా చౌదరి పేర్లు ఎక్కువగా వినిపించాయి. అందరూ ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. అయితే బీజేపీ హైకమాండ్  ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత అందరూ సైలెంట్ అయ్యారు. మాధవ్  ఎన్నికయిన అధికారిక ప్రకటన మంగళవారం విడుదల కానుంది.                           

పొకల వంశీ నాగేంద్ర మాధవ్ కుటుంబం మొదటి నుంచి బీజేపీతో అనుబంధం కలిగి ఉంది.  మాధవ్ తన రాజకీయ జీవితాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)తో ప్రారంభించారు. ఆ తర్వాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో విశాఖ  నగర కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,  రాష్ట్ర ఉమ్మడి కార్యదర్శిగా పనిచేశారు. స్వదేశీ జాగరణ్ మంచ్‌లో పూర్తి సమయం కార్యకర్తగా భారతదేశం అంతటా పనిచేశారు. 2003-2007 మధ్య భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం)లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, 2007-2010 మధ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా,  2010-2013 మధ్య జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.                      
 
2009లో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2017లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. 2023లో అదే నియోజకవర్గం నుంచి రెండవసారి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలోపేతం కావడానికి మాధవ్ నాయకత్వం కీలకం కానుంది, ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీ ఇమేజ్‌ను ఉపయోగించి సభ్యత్వ డ్రైవ్‌ను విజయవంతం చేయడంలో ఆయన పాత్ర ముఖ్యమైనదని భావిస్తున్నారు.  బీజేపీ విధానాలను పక్కాగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో  పీవీఎన్ మాధవ్ మంచి ప్రతిభ చూపిస్తారు.  మంచి వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం ఇంకాచెప్పాలంటే బీజేపీ విధానాలపై స్పష్టమైన అవగాహన ఉన్న నేత మాధవ్.  

 బీజేపీ విధానాలను పక్కాగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో  పీవీఎన్ మాధవ్ మంచి ప్రతిభ చూపిస్తారు.  మంచి వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం ఇంకాచెప్పాలంటే బీజేపీ విధానాలపై స్పష్టమైన అవగాహన ఉన్న నేత మాధవ్.  

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: కొలిక్కిరాని చర్చలు.. నేడు పవన్ కళ్యాణ్‌తో టీడీపీ నేతల భేటీ- చంద్రబాబుతో మాధవ్‌ సమావేశం
కొలిక్కిరాని చర్చలు.. నేడు పవన్ కళ్యాణ్‌తో టీడీపీ నేతల భేటీ- చంద్రబాబుతో మాధవ్‌ సమావేశం
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
AP Local Body Elections 2026 : ఏపీలో ఎన్నికల పండుగ - రాజకీయ పార్టీలకు టెన్షన్...టెన్షన్!
ఏపీలో ఎన్నికల పండుగ - రాజకీయ పార్టీలకు టెన్షన్...టెన్షన్!
AP Local Body Elections: ఈ నెల 14న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్.. సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ
ఈ నెల 14న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్.. సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
Windies Duo Penalised: విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Embed widget