Top Headlines Today: బీఆర్ఎస్ పై తెలంగాణ సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - సాగర్ జల వివాదంపై కేంద్రం కీలక సమావేశం - నేటి టాప్ హెడ్ లైన్స్
Top Headlines: ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా నేటి టాప్ హెడ్ లైన్స్ మీకోసం.
Top Headlines on 2nd December:
1. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ సీఈవోకు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
తెలంగాణ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో అధికారం దుర్వినియోగం కాకుండా చూడాలని కాంగ్రెస్ (Congress) నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ (Viikasraj) ను కోరారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanthreddy), ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంజన్ కుమార్ యాదవ్, ఇతర సీనియర్ నేతలు సీఈవోను కలిసిన వారిలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. సాగర్ జల వివాదంపై ఈ నెల 6న మరోసారి సమావేశం
నాగార్జున సాగర్ నీటి విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశం ముగిసింది. ఆదివారం ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ నెల 6న మళ్లీ సమావేశం కానున్నారు. ఢిల్లీలోని కేంద్ర జల శక్తి శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్ లు), సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు ఛైర్మన్లు నేరుగా పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. తెలంగాణలో రేపటి కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
మరికొన్ని గంటల్లో తెలగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. రేపు (ఆదివారం) ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభకానుండగా... రేపు (ఆదివారం) ఉదయం 10గంటల కల్లా తొలి ఫలితం వచ్చేస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలుసుకోవాలని ఆతృత పడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. సీఎం కేసీఆర్ పై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
ఈ నెల 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు (Telangana Elections Resluts 2023) వెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు (Telangana Exit Polls 2023) కాంగ్రెస్ కు అనుకూలంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Sivakumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ సునాయాసంగా అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఈ నెల 10 నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన ఆయనకు గత నెల హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కంటికి శస్త్ర చికిత్స అనంతరం వారం రోజులు విశ్రాంతి తీసుకోగా, శుక్రవారం సతీమణి భువనేశ్వరితో (Bhuvaneswari) కలిసి తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అమరావతి చేరుకుని టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. శనివారం విజయవాడ దుర్గమ్మను సతీసమేతంగా దర్శించుకుంటారు. వచ్చే వారం రోజుల పాటు రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలు సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 3న (ఆదివారం) సింహాచలం అప్పన్న స్వామిని, 5న శ్రీశైలం మల్లన్న, అనంతరం కడప దర్గా, గుణదల మేరీమాత ఆలయానికి ఆయన వెళ్లనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.