అన్వేషించండి

Andhra Pradesh: చంద్రబాబు నిజాయితీకి మరక అంటించలేరు, త్వరలో వైసీపీ మొత్తం ఖాళీ: పరిటాల సునీత

Paritala Sunitha Anantapur News: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ సర్కార్ కు చెంప పెట్టు లాంటిదని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు.

Andhra News in Telugu: అనంతపురం: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టినా.. న్యాయస్థానాల్లో ఆయన నిజాయితీ నిరూపించుకుంటున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) అన్నారు. సుప్రీంకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ అంశంపై ప్రభుత్వం వేసిన పిటీషన్ కొట్టివేయడంపై ఆమె స్పందించారు. విజయవాడలో పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతిపై పోరాడుతున్నారనే అక్కసుతో చంద్రబాబు(Chandrababu)పై అవినీతి మరక అంటించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదుచేసి జైలుపాలు చేశారన్నారు. అయినప్పటికీ న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందన్న నమ్మకంతో చంద్రబాబు పోరాడుతున్నారని సునీత అన్నారు. 
నిజం గెలవడానికి ఆలస్యం కావచ్చు కానీ !
తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ సర్కార్ కు చెంప పెట్టు లాంటిది అన్నారు. అధికార గర్వంతో సీఎం జగన్ అండ్ కో పెట్టిన కేసులు నిరాధార కేసులు అని సుప్రీంకోర్టు తీర్పుతో వెల్లడైందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్ఆర్) కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకూ వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. గతంలో హైకోర్టు చెప్పినా వినకుండా మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారన్నారు. నిజం గెలవడానికి ఆలస్యం కావచ్చు కానీ కచ్చితంగా గెలుస్తుందనే విషయాన్ని ఇప్పటికైనా జగన్ రెడ్డి అర్థం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నిర్వహిస్తున్న రా కదలిరా.. సభలకు వస్తున్న జనం చూస్తుంటే ఆయనపై ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థమవుతోందన్నారు. 
టీడీపీకి 5 కోట్ల మంది స్టార్ క్యాంపెయినర్లు..
తెలుగుదేశం పార్టీకి 5 కోట్ల ప్రజలే స్టార్ క్యాంపెయినర్లని.. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజులు ఇక ఎంతో దూరంలో లేవన్నారు. హత్యలు, ఆత్మహత్యలు, వరకట్న వేధింపులు, అత్యాచారాలు, లైంగిక వేధింపులే ఇలా అన్ని నేరాల్లో ఏపీలో ముందంజలో ఉందన్నారు. కానీ ప్రజలకు మంచి చేయడంలో మాత్రం చివరన ఉందని కామెంట్ చేశారు. ఇప్పటికే ప్రజలు టీడీపీ మ్యానిఫెస్టోపై హర్షం వ్యక్తం చేస్తున్నారని.. కచ్చితంగా చంద్రబాబును మరోసారి సీఎం చేసుకుంటారన్నారు. ఈ విషయాన్ని గమనించి.. అలాగే జగన్ రెడ్డి పెత్తందారీ వ్యవస్థకు విసిగిపోయిన వైసీపీ నేతలంతా టీడీపీలో చేరుతున్నారని.. చేరికలు మరిన్ని రోజులు కొనసాగుతాయని పేర్కొన్నారు. త్వరలో వైసీపీ ఖాళీ కావడం ఖాయమని మాజీ మంత్రి పరిటాల సునీత ఎద్దేవా చేశారు.

 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Jal Jeevan Mission 2.0: కడపలో జల్ జీవన్ మిషన్ 2.0 ప్రారంభించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. 3.27 కోట్ల మందికి ప్రయోజనం
కడపలో జల్ జీవన్ మిషన్ 2.0 ప్రారంభించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. 3.27 కోట్ల మందికి ప్రయోజనం
Ramayya Shepherd Boy: బడిబాట పట్టిన చిన్నారి రామయ్య.. మంత్రి లోకేష్ చొరవతో గొర్రెల కాపలా నుంచి విముక్తి!
బడిబాట పట్టిన చిన్నారి రామయ్య.. మంత్రి లోకేష్ చొరవతో గొర్రెల కాపలా నుంచి విముక్తి!
Anant Ambani: నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి... ఏపీకి ఏం చేయగలనో గైడ్ చేయండి: సీఎం చంద్రబాబును కోరిన అనంత్ అంబానీ
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి... ఏపీకి ఏం చేయగలనో గైడ్ చేయండి: సీఎం చంద్రబాబును కోరిన అనంత్ అంబానీ

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget