అన్వేషించండి

Nara Lokesh Key Statement: తెలుగుప్రజల భవిష్యత్ కోసం 6 శాసనాలు: మహానాడులో నారా లోకేష్ కీలక ప్రకటన

Andhra Pradesh News | తెలుగు ప్రజల భవిష్యత్తు, అభివౄద్ధి కోసం కడప వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడులో నారా లోకేష్ ఆరు శాసనాలు ప్రతిపాదించారు.

కడప: పార్టీ మూల సిద్దాంతం స్ఫూర్తితో ప్రస్తుత ప్రజా అవసరాలకు అనుగుణంగా కీలక విధానపరమైన మార్పులు తీసుకురావాలి, ఇందుకోసం ఆరు శాసనాలను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిపాదించారు. కడప మహానాడు వేదికపై తొలిరోజు నారా లోకేష్ మాట్లాడుతూ... స్వర్గీయ నందమూరి తారకరామారావు పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పది. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వం.  అన్న‌దాత‌ల‌కు అండ‌గా నిలిచేందుకు, కార్మికుల క‌ష్టాలు తీర్చేందుకు, పేదవాళ్లకు కనీస అవసరాలైన కడుపు నిండా భోజనం, కట్టుకోవడానికి బట్టలు, ఉండేందుకు పక్కా ఇల్లు ఇవ్వాలన్న ధ్యేయంతో ఎన్టీఆర్ ఈ పార్టీ పెట్టారని లోకేష్ పేర్కొన్నారు. 

ఏ కష్టమొచ్చినా మొదటి స్పందించేది మనమే

43ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాం. మనకు అధికారం కొత్తకాదు... ప్రతిపక్షమూ కొత్తకాదు. అధికారం ఉన్నా లేకపోయినా తెలుగు వారికి కష్టం వస్తే మొదట స్పందించే పార్టీ టీడీపీ అని లోకేష్ పేర్కొన్నారు. తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం ఆరు శాసనాలను ప్రతిపాదించారు. అవి 1. తెలుగుజాతి విశ్వఖ్యాతి, 2. యువగళం, 3. స్త్రీ శక్తి, 4. పేదల సేవల్లో సోషల్‌ రీ ఇంజినీరింగ్‌, 5. అన్నదాతకు అండగా 6. కార్యకర్తలే అధినేత.


Nara Lokesh Key Statement: తెలుగుప్రజల భవిష్యత్ కోసం 6 శాసనాలు: మహానాడులో నారా లోకేష్ కీలక ప్రకటన

ఆరు శాసనాలతో భవిష్యత్ ప్రణాళికలు

1) తెలుగుజాతి విశ్వఖ్యాతి:  దేశంలో తెలుగుదేశం వల్లే తెలుగువారికి ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉంది. ఒకనాడు అన్న ఎన్టీఆర్ ను బర్త్ రఫ్ చేస్తే డిల్లీ మెడలు వంచి మళ్లీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అదీ తెలుగుజాతి పౌరుషం. తెలుగువారిని ప్రపంచ పటంలో పెట్టింది చంద్రబాబు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగువారు ప్రపంచంలో నెం. 1 స్థానంలో ఉండాలి. అన్నిరంగాల్లో తెలుగువారే ముందుండాలి. దీనినే అజెండాగా పెట్టుకొని మనం పనిచేయాలి. 

2) యువగళం: తెలుగుదేశంలో యువతకు పెద్దపీట వేయబోతున్నాం. సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తాం, పనిచేసేవారిని ప్రోత్సహిస్తాం. గత ప్రభుత్వం హెచ్ ఎస్ బిసి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అమర్ రాజా, జాకీ వంటి పరిశ్రమలను తరిమేసింది. మన ప్రభుత్వంలో టిసిఎస్, ఎల్ జి ఎలక్ట్రానిక్స్, ఎన్ టిపిసి, బిపిసిఎల్, రిలయన్స్ సిబిజి, ఆర్సెలార్ మిట్టల్ వంటి బడా కంపెనీలను తీసుకువచ్చాం. మెగా డిఎస్సీ ద్వారా 16,347 పోస్టులో జూన్ మాసంలో భర్తీచేస్తున్నాం. యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం. మనరాష్ట్రంలో బలమైన యువశక్తి ఉంది. వారికి సరైన అవకాశాలు ఇస్తే దూసుకుపోతారు. అన్నిరంగాల్లో వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే మన లక్ష్యం. 


Nara Lokesh Key Statement: తెలుగుప్రజల భవిష్యత్ కోసం 6 శాసనాలు: మహానాడులో నారా లోకేష్ కీలక ప్రకటన

3) స్త్రీ శక్తి: అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చింది మన చంద్రన్న. గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా మహిళలను అవమానించారు. సొంత తల్లిని, చెల్లిని మెడపట్టి రోడ్డుపైకి గెంటేశారు. ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్, మహిళలకు విశ్వవిద్యాలయాలు, దీపం పథకం ప్రవేశపెట్టింది తెలుగుదేశం. రానున్నరోజుల్లో మహిళలను మరింత బలోపతం చేసేందుకు స్త్రీ శక్తిద్వారా మనం కృషిచేయాలి. పార్టీ పదవుల దగ్గర్నుంచి అన్నిరంగాల్లో మహిళలకు సమాన బాధ్యత, భద్రత కల్పించాలి. ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. చట్టాలు, శిక్షల వల్ల సమాజంలో మార్పురాదు. మనం ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక మహిళా మంత్రి నాకు చీర, గాజులు పంపిస్తా అన్నారు. అవి పంపిస్తే నా అక్కచెల్లెమ్మలకు కానుకగా ఇచ్చి కాళ్లు మొక్కుతానని చెప్పాను.

4) పేదల సేవలో – సోషల్ రీఇంజనీరింగ్: పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా ఇళ్లు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. చాలీచాలని పెన్షన్ 5రెట్లు పెంచి 200 నుంచి 1000 రూపాయలు చేసింది, వెయ్యి నుంచి 2వేలు చేసింది మన చంద్రబాబు. ఇప్పుడు దేశంలోనే ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 4వేల రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. డ్వాక్రా, దీపం, అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న. భారతదేశంలో ఏ నాయకుడు సాహసం చేయలేదు.ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా  సూపర్ – 6 హామీని అమలుచేసే దిశగా ముందుకు సాగుతున్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. మెగా డిఎస్సీ ప్రకటించాం.


Nara Lokesh Key Statement: తెలుగుప్రజల భవిష్యత్ కోసం 6 శాసనాలు: మహానాడులో నారా లోకేష్ కీలక ప్రకటన

వచ్చేనెలలో తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు నెలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తాం. ఇప్పుడు పి-4 కాన్సెప్ట్ తో పేదరికం నుంచి కుటుంబాలను బయటకు తీసుకురావడానికి చేయూతనందిస్తున్నారు మన చంద్రన్న. టిడిపి ఆవిర్భావం తర్వాత బడుగు, బలహీనవర్గాలకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది. పార్టీకి పునాదిగా ఉన్న బిసిలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 33శాతం రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అందరి ఆమోదంతో ఎస్సీ వర్గీకరణ చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కుటుంబాలకు సామాజిక సమన్యాయం అందుకే ప్రతివారికి న్యాయం చేసేలా సోషల్ రీఇంజనీరింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

5) అన్నదాతకు అండగా: రైతు లేకపోతే సమాజమే లేదు. ఈ సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన పార్టీ తెలుగుదేశం. అన్న ఎన్టీఆర్ దగ్గర్నుంచి చంద్రబాబు వరకు రైతుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషిచేశాం. డ్రిప్ ఇరిగేషన్ దగ్గరనుంచి నీటిపారుదల ప్రాజెక్టులు, సబ్సిడీలు ఇవ్వడమేగాక ఉద్యాన పంటలను ప్రోత్సహించింది తెలుగుదేశం. ఈరోజు ఆక్వా, పామాయిల్, కోకోలో నెం.1, మామిడి, జీడిపంటల్లో నెం.2 స్థానాల్లో ఉన్నాం. దీనికి కారణం తెలుగుదేశం. అన్నదాతకు తెలుగుదేశం ఎప్పుడూ అండగా ఉంటుంది. పొగాకు, కోకో, మిర్చి ధరలు పడిపోతే మద్దతు ధర ఇచ్చి ఆదుకుంది మన నాయకుడు చంద్రబాబు. బంగారం లాంటి భూములు మన రాష్ట్రంలో ఉన్నాయి. చేయూతనందిస్తే మన రైతులు బంగారం పండిస్తారు. అందుకే అన్నదాతకు అండగా అనే విధానాన్ని అమలుచేయాలి. 

6) కార్యకర్తే అధినేత: ఒక అంజిరెడ్డి తాత, ఒక మంజుల, ఒక తోట చంద్రయ్య నాకు స్పూర్తి. ఆనాడు పుంగనూరు నియోజకవర్గంలో అంజిరెడ్డి తాత తొడగొట్టి మీసాలు మెలేసి నామినేషన్ వేసి చూపించారు. ప్రత్యర్థుల దాడిలో రక్తం కారుతున్న భయపడకుండా బూత్ లో నిలబడింది మన అక్క మంజుల. తోట చంద్రయ్య గురించి ఎంత చెప్పినా తక్కువ. నడివీధిలో కత్తి గొంతుపై పెట్టి ఒక్కసారి వారి నాయకుడికి జై చెప్పమంటే... జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు కోల్పోయాడు చంద్రయ్య. ఎపిలో ఎప్పుడూ లేనివిధంగా చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చాం. అటువంటి కరుడుగట్టిన కార్యకర్తలే మన బలం, బలగం. దేశంలో ఏ పార్టీకి లేనివిధంగా కోటిమంది కుటుంబసభ్యులు మనకి ఉన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత. కార్యకర్త చెమట వల్లే ఈనాడు మేం ఇక్కడ కూర్చున్నాం. ఆనాడు మీరు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ప్రజల్లోకి తీసుకెళ్లారు.

కార్యకర్తలకు 5లక్షల ప్రమాద బీమా, విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ.  కార్యకర్తకు కష్టమొస్తే మొదట స్పందించేది తెలుగుదేశం పార్టీ. పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలకు అండగా నిలబడింది తెలుగుదేశం. అనంతపురంలో ఫ్యాక్షన్ లో చనిపోయిన కార్యకర్తల కుటుంబసభ్యులు అటువైపు వెళ్లకూడదని చంద్రబాబుగారు ఎన్టీఆర్ మోడల్ స్కూలు ఏర్పాటుచేశారు. వారికి తండ్రిగా నిలబడటం నా బాధ్యత అని చెప్పారు. యువగళం పాదయాత్రలో వారి కష్టాలు నేరుగా చూశాను. చంద్రబాబు సాయాన్ని ఆ పిల్లలు ఇప్పటికీ మర్చిపోవడం లేదు. అలాంటి కార్యకర్తలను ఆదుకోవడానికి, వారు సొంత కాళ్లపై నిలబడేందుకు పార్టీ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: పోలవరం-బనకచర్ల, నల్లమలసాగర్‌పై సుప్రీంకోర్టుకు తెలంగాణ- ఏపీతోపాటు కేంద్ర సంస్థలను ఆపాలని రిక్వస్ట్‌ 
పోలవరం-బనకచర్ల, నల్లమలసాగర్‌పై సుప్రీంకోర్టుకు తెలంగాణ- ఏపీతోపాటు కేంద్ర సంస్థలను ఆపాలని రిక్వస్ట్‌ 
Rishikonda Palace: పర్యాటకశాఖ చేతుల్లోకే రిషి కొండ ప్యాలెస్- ప్రజలకు ఉపయోగపడేలా, ఆదాయం తెచ్చేలా కీలక నిర్ణయం!
పర్యాటకశాఖ చేతుల్లోకే రిషి కొండ ప్యాలెస్- ప్రజలకు ఉపయోగపడేలా, ఆదాయం తెచ్చేలా కీలక నిర్ణయం!
Oscars 2026 - Homebound: ఆస్కార్స్ 2026 బరిలో జాన్వీ కపూర్ సినిమా... టాప్‌ 15లో ఇండియన్ ఫిల్మ్‌ 'హోమ్‌బౌండ్‌'
ఆస్కార్స్ 2026 బరిలో జాన్వీ కపూర్ సినిమా... టాప్‌ 15లో ఇండియన్ ఫిల్మ్‌ 'హోమ్‌బౌండ్‌'
Hyderabad Crime News: స్కూల్ ఐడీ కార్డు ట్యాగ్‌తోనే నాల్గో తరగతి విద్యార్థి ఆత్మహత్య! హైదరాబాద్‌లో సంచలన ఘటన 
స్కూల్ ఐడీ కార్డు ట్యాగ్‌తోనే నాల్గో తరగతి విద్యార్థి ఆత్మహత్య! హైదరాబాద్‌లో సంచలన ఘటన 

వీడియోలు

Prashant Veer Kartik Sharma CSK IPL 2026 Auction | ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ | ABP Desam
Auqib Nabi IPL 2026 Auction | ఐపీఎల్ 2026 వేలంలో భారీ ధర పలికిన అనామక ప్లేయర్ | ABP Desam
Matheesha Pathirana IPL 2026 Auction | భారీ ధరకు వేలంలో అమ్ముడుపోయిన పతిరానా | ABP Desam
Quinton de Kock IPL 2026 Auction Surprise | సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ కు అంత తక్కువ రేటా.? | ABP Desam
Cameron Green IPL Auction 2026 | ఆసీస్ ఆల్ రౌండర్ కు ఐపీఎల్ వేలంలో ఊహించని జాక్ పాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: పోలవరం-బనకచర్ల, నల్లమలసాగర్‌పై సుప్రీంకోర్టుకు తెలంగాణ- ఏపీతోపాటు కేంద్ర సంస్థలను ఆపాలని రిక్వస్ట్‌ 
పోలవరం-బనకచర్ల, నల్లమలసాగర్‌పై సుప్రీంకోర్టుకు తెలంగాణ- ఏపీతోపాటు కేంద్ర సంస్థలను ఆపాలని రిక్వస్ట్‌ 
Rishikonda Palace: పర్యాటకశాఖ చేతుల్లోకే రిషి కొండ ప్యాలెస్- ప్రజలకు ఉపయోగపడేలా, ఆదాయం తెచ్చేలా కీలక నిర్ణయం!
పర్యాటకశాఖ చేతుల్లోకే రిషి కొండ ప్యాలెస్- ప్రజలకు ఉపయోగపడేలా, ఆదాయం తెచ్చేలా కీలక నిర్ణయం!
Oscars 2026 - Homebound: ఆస్కార్స్ 2026 బరిలో జాన్వీ కపూర్ సినిమా... టాప్‌ 15లో ఇండియన్ ఫిల్మ్‌ 'హోమ్‌బౌండ్‌'
ఆస్కార్స్ 2026 బరిలో జాన్వీ కపూర్ సినిమా... టాప్‌ 15లో ఇండియన్ ఫిల్మ్‌ 'హోమ్‌బౌండ్‌'
Hyderabad Crime News: స్కూల్ ఐడీ కార్డు ట్యాగ్‌తోనే నాల్గో తరగతి విద్యార్థి ఆత్మహత్య! హైదరాబాద్‌లో సంచలన ఘటన 
స్కూల్ ఐడీ కార్డు ట్యాగ్‌తోనే నాల్గో తరగతి విద్యార్థి ఆత్మహత్య! హైదరాబాద్‌లో సంచలన ఘటన 
AP government employees: ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
Kumram Bheem Asifabad District: మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ- కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసుల అదుపులో బడే చొక్కారావు! 
మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ- కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసుల అదుపులో బడే చొక్కారావు! 
Akhanda 2 Success Meet: అమరావతిలో 'అఖండ 2' సక్సెస్ మీట్... ఎప్పుడంటే - పవన్ వస్తారా?
అమరావతిలో 'అఖండ 2' సక్సెస్ మీట్... ఎప్పుడంటే - పవన్ వస్తారా?
Alluri Sitarama Raju District: రీల్ కాదు రియల్‌! వేదిక దిగే లోపు రోడ్డు మంజూరు ఉత్తర్వులు! కానిస్టేబుల్ అభ్యర్థను క్షణాల్లో తీర్చిన ప్రభుత్వం
రీల్ కాదు రియల్‌! వేదిక దిగే లోపు రోడ్డు మంజూరు ఉత్తర్వులు! కానిస్టేబుల్ అభ్యర్థను క్షణాల్లో తీర్చిన ప్రభుత్వం
Embed widget