అన్వేషించండి

Kuppam TDP Leaders : నెల రోజుల తర్వాత బెయిల్ - కుప్పం టీడీపీ నేతలకు హైకోర్టులో రిలీఫ్ !

కుప్పం టీడీపీ నేతలకు నెల రోజుల తరవాత బెయిల్ మంజూరైంది. చంద్రబాబు పర్యటనల్లో జరిగిన ఘర్షణలతో పోలీసులు అట్రాసిటీ కేసులు నమోదు చేయడంతో వారు జైల్లో ఉన్నారు.

Kuppam TDP Leaders :  నెల రోజులుగా జైల్లో ఉన్న కుప్పం తెలుగుదేశం పార్టీ నేతలకు హైకోర్టులో ఊరట లభించింది.  మాజీ ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు నాయుడు, మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్, మునుస్వామి మరో నలుగురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 25 వేల రూపాయల బాండ్‌తో ఇద్దరు పూచికత్తు సమర్పించాలని సూచించింది. టీడీపీ అధినేత చంద్రబాబు   పర్యటన సందర్బంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నెల రోజులుగా టీడీపీ నేతలు చిత్తూరు జైలు లో ఉన్నారు. చిత్తూరు కోర్టు  బెయిల్ తిరస్కరించడంతో టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ నేతల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. పోసాని వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. దీంతో ఏడుగురికి బెయిల్ మంజూరైంది. 

చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తతల కారణంగా టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసులు

నెల రోజుల కిందట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వెళ్లారు.ఆ సమయంలో వైఎస్ఆర్‌సీపీ నాయకులు పోటీగా బ్యానర్లు కట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాత అన్నక్యాంటీన్‌పై దాడి జరిగింది.. ఈ క్రమంలో టీడీపీ నేతలు కూడా ఎదురు దాడులు చేశారు. ఆ ఘటనల్లో  రామకుప్పం  లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు సహా 8 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. హత్యాయత్నంతో పాటు 143,147, 148, 149, 424 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా మరో 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వైసీపీ కార్యకర్త గణేష్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లోనే టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. 

పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం

కుప్పం ఘర్షణలో కేవలం టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేయడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. పోలీసుల తీరును చంద్రబాబు తప్పుపట్టారు. డీజీపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు చంద్రబాబు. పోలీస్ వ్యవస్థను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. వైసీపీ కోసమే పోలీస్ వ్యవస్థ పని చేస్తోందని చంద్రబాబు విమర్శలు చేశారు. జైలులో ఉన్న టీడీపీ నేతలను ఓ సారి లోకేష్.. మరోసారి చంద్రబాబు పరామర్శించారు.  ధైర్యం కోల్పోవద్దన భరోసా ఇచ్చారు. మూడు దశాబ్దాలుగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు పర్యటనలో ఎప్పుడూ వివాదం కాలేదు. ఈ సారి ఘర్షణలు చోటు చేసుకోవడంతో వైఎస్ఆర్‌సీపీ నేతల పనేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

కుప్పంలో జగన్ పర్యటన ముగిసిన తర్వాత బెయిల్ 

కుప్పంలో సీఎం జగన్ పర్యటన ముగిసిన వెంటనే బెయిల్ లభించింది. సీఎం జగన్ పర్యటన సందర్భంగా టీడీపీ నేతలందర్నీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో  కుప్పంలో జగన్ పర్యటన సాఫీగా సాగిపోయింది. 

ఏపీలో పెన్షన్ పెంపు, వచ్చే జనవరి నుంచి అమలు - కుప్పానికి చంద్రబాబు ఏమీ చేయలేదు: జగన్

టాప్ హెడ్ లైన్స్

ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
YS Jagan Local Body Elections Strategy 2026: గెలుపోటములు కాదు.. పోటీ ముఖ్యం - లోకల్ పోల్స్‌లో క్యాడర్‌కు జగన్ సందేశం - అసలు ప్లానేంటి?
గెలుపోటములు కాదు.. పోటీ ముఖ్యం - లోకల్ పోల్స్‌లో క్యాడర్‌కు జగన్ సందేశం - అసలు ప్లానేంటి?
AP Municipal Elections: మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !
మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Embed widget