Naga Babu Satires: భీమవరం సభపై నాగబాబు సెటైర్, పర్ఫార్మెన్స్ బాగుందంటూ ట్వీట్
Konidela Naga Babu Tweet: ఇటీవల భీమవరంలో జరిగిన అల్లూరి విగ్రహావిష్కరణ సభపైన నాగబాబు స్పందించారు. అందరిపైనా సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు.
Konidela Naga Babu Reaction on Alluri Statue Inaguration Programe: జూలై 4న భీమవరంలో అల్లూరి సీతారామరాజు 30 అడుగుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రావడంతో ఆ వేడుక అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నటుడు చిరంజీవిని, పవన్ కల్యాణ్‌ను కూడా ఆహ్వానించారు. చిరంజీవి హాజరైనప్పటికీ కొన్నికారణాలతో పవన్ కల్యాణ్ సభకు దూరంగా ఉన్నారు. అయితే, సభ జరిగిన నాలుగు రోజులకు ఆ కార్యక్రమం గురించి నాగబాబు స్పందించారు. ఈ మేరకు గురువారం ఉదయం ట్వీట్ చేశారు.
అల్లూరి సీతారామ రాజు విగ్రహావిష్కరణ సభ అద్భుతంగా జరిగిందని కొనియాడారు. ఆ సభలో తన అన్న చిరంజీవి తప్ప మిగిలిన వారంతా అద్భుతంగా నటించారంటూ, పర్ఫార్మెన్స్ బాగుందంటూ అందరికీ కలిపి సెటైర్ వేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
‘‘మన్యం వీరుడు "అల్లూరి సీతారామరాజు" విగ్రహావిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగింది, ఆ మహానుభావుడికి నా నివాళి. ఆ సభలో మా అన్నయ్య చిరంజీవి గారు తప్ప అందరూ (?) అద్భుతంగా పెరఫార్మెన్సు చేశారు. ఆ మహనటులందరికీ ఇదే నా అభినందనలు.’’ అని నాగబాబు ట్వీట్ చేశారు.
మన్యం వీరుడు
— Naga Babu Konidela (@NagaBabuOffl) July 6, 2022
"అల్లూరి సీతారామరాజు" విగ్రహావిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగింది,
ఆ మహానుభావుడికి నా నివాళి🙏
ఆ సభ లో మా అన్నయ్య చిరంజీవి గారు తప్ప అందరూ (?) అద్భుతంగా పెరఫార్మెన్సు చేశారు,,
— Naga Babu Konidela (@NagaBabuOffl) July 6, 2022
ఆ మహనటులంంరికి ఇదే నా అభినందనలు 🌺🌷🌷🌷🌺🌺
స్పెషల్ ఎట్రాక్షన్ గా చిరంజీవి
భీమవరం అల్లూరి సభలో చిరంజీవి మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఆయన ఏ పార్టీకి చెందిన వారు కాదు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేనని గతంలోనే ప్రకటించారు. సోదరుడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు కూడా ఆయన ప్రత్యక్షంగా ఎలాంటి మద్దతు తెలియచేయలేదు. ఈ క్రమంలో ఆ సభలో మోదీ చిరంజీవికి ఇచ్చిన ప్రాధాన్యం మాత్రం చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
చిరంజీవితో ఆత్మీయంగా మాట్లాడిన మోదీ!
అల్లూరి విగ్రహావిష్కరణ సభలో మోదీని చిరంజీవి సన్మానించారు. ఈ సందర్భంగా మోదీ ఓ నిమిషం పాటు చిరంజీవితో ఆత్మీయంగా సంభాషించారు. ఈ సంభాషణ సభకు వచ్చిన వారితో పాటు టీవీల్లో చూస్తున్న వారికి కూడా ఆసక్తి కలిగించింది. బాగా పరిచయమున్న వారిలా మాట్లాడుకోవడమే దీనికి కారణం. మోదీతో చిరంజీవికి ఇంత సాన్నిహిత్యం ఉందా అని కొంత మంది ఆశ్చర్యపోయారు. కార్యక్రమం అసాంతం చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.