News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Posani Krishna Murali: కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డిలే కాబోయే ముఖ్యమంత్రులు- పోసాని సంచలన కామెంట్స్

Posani Krishna Murali: ఏపీలో సినిమా షూటింగ్ చేసినా శిక్ష లేకుండా చూడాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కాళ్లకు దండం పెట్టి మరీ అడుగుతానని నటుడు  పోసాని కృష్ణ మురళీ అన్నారు.  

FOLLOW US: 
Share:

 Posani Krishna Murali: తెలుగు సినిమాలను ఏపీలోనూ చిత్రీకరించినా ఎలాంటి శిక్ష లేకుండా చూడాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కాళ్లకు మొక్కి మరీ అడుగుతానని ఏపీ చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళీ తెలిపారు. ఏపీలో ఉచితంగా సినిమాలు తీసుకోవచ్చని చెప్పారని.. అలా అని అక్కడ షూటింగ్ చేస్తే తెలంగాణ స్థలాలిచ్చాం కదా, అక్కడికి ఎందుకు వెళ్లారని అని అడుగుతున్నారని మంగళవారం రోజు జరిగిన వెలగపూడి ప్రెస్ మీట్ లో ఆయన చెప్పారు. అలాగే తెలంగాణలోనే ఉంటే ఏపీలో స్థలాలు ఇస్తామన్నా ఎందుకు ఉండరని అంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి తెలుగు సినీ పరిశ్రమకు కటింగ్, ఫిటింగ్ అయిపోందంటూ కామెంట్లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇష్ట పడితేనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. అలాగే సీఎం కేసీఆర్ ను మనసారా అడిగితే కచ్చితంగా ఆయన సాయం చేస్తారని పోసాని కృష్ణ మురళీ వివరించారు. 

కేసీఆర్.. కేటీఆర్.. రేవంత్ రెడ్డిలే కాబోయే ముఖ్యమంత్రులు...

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారని.. భవిష్యత్తులో కేసీఆర్ కుమారుడు కేటీఆర్.. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు సీఎంలు అవుతారని అన్నారు. ఇలా వ్యవస్థ జరిగిపోతుందని.. అయితే ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు కేసీఆర్ తో ముడిపడి ఉందన్నారు. ఆయనకు చిత్ర పరిశ్రమ బాధలు అన్నీ చెప్పి ఒప్పిస్తే ఏపీలోనూ సినిమాలు తీసుకునేలా సాయం చేస్తారని స్పష్టం చేశారు. అదే జీవో పెడితే చించి బయట పడేసి.. మీకు ఇష్టం లేకపోతే తెలంగాణ నుంచి వెళ్లిపోండని అంటారని.. అదే జరిగితే మనం ఏ చేస్తామంటూ ప్రశ్నించారు. అందుకే మెళ్లిగా, బతిమాలుతూ మాట్లాడుకొని పని చేయించుకోవడం మంచిదని చెప్పారు. 

పద్యనాటక పోటీలకు నోటిఫికేషన్ - అన్ని రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకోవచ్చు

అలాగే రోజు రోజుకూ దేశ వ్యాప్తంగా కళాకారుల సంఖ్య తగ్గిపోతుందని.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మరింత తక్కువయ్యారని అన్నారు. ఈ క్రమంలోనే పద్య నాటకాలకు ఊపిరి పోయాలని తాము నిర్ణయించుకున్నట్లు పోసాని కృష్ణ మురళీ వెల్లడించారు. పద్య నాటక పోటీలకు బుధవారం రోజు నోటిఫికేషన్ కూడా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పద్య, సాంఘిక నాటకాలు, నాటికలు, బాలల నాటికలు, యువత నాటికలకు సంబంధించి ఐదు విభాగాల్లో 73 అవార్డులు ఇస్తామని తెలిపారు. ఆన్ లైన్ లో ఏపీఎఫ్డీసీ వెబ్ సైట్ ద్వారా .. అన్ని రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఈ నెలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే దరఖాస్తులను ఉప సంహరించుకోవడానికి వారం రోజులు గడువు కూడా ఇస్తామని స్పష్టం చేశారు. నాటక సమాజాలు ఎక్కుడ తమ కళారూపాలు పదర్శించాలని అనుకున్నాయో.. అక్కడికే జ్యూరీ వెళ్లి చూస్తుందని తెలిపారు. అయితే ప్రాథమిక పరిశీలనలో ఎంపిక అయిన సమాజాలు వారం రోజుల పాటు నాటికలను ప్రదర్శిస్తారని స్పష్టం చేశారు. విజేతలకు ఏడో రోజు అవార్డులను అందజేస్తామని ఏపీఎఫ్టీవీడీసీ ఎండీ టి. విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Published at : 05 Jul 2023 11:57 AM (IST) Tags: AP News Posani Krishna Murali Telangana News Cinema Shooting in Telangana Posani Comments on CM KCR

ఇవి కూడా చూడండి

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

AP News : కాగ్ అభ్యంతరాలు - కోర్టుల్లో పిటిషన్లు ! గ్రామ, వార్డు సచివాలయాలు రాజ్యాంగ వ్యతిరేకమా ?

AP News : కాగ్ అభ్యంతరాలు - కోర్టుల్లో పిటిషన్లు !  గ్రామ, వార్డు సచివాలయాలు రాజ్యాంగ వ్యతిరేకమా ?

ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు

ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Minister RK Roja: పెద్ద దొంగ కోసం చిన్న దొంగ ఢిల్లీ పర్యటన- చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Minister RK Roja: పెద్ద దొంగ కోసం చిన్న దొంగ ఢిల్లీ పర్యటన- చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Bigg Boss Season 7 Telugu: అరె ఏంట్రా ఇది - కన్నీళ్లతో గ్లాసు నింపాలట, కింద పడి మరీ ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్

Bigg Boss Season 7 Telugu: అరె ఏంట్రా ఇది - కన్నీళ్లతో గ్లాసు నింపాలట, కింద పడి మరీ ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్

Hyderabad: ఔటర్ సైకిల్ ట్రాక్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు, ఎప్పుడంటే? 

Hyderabad: ఔటర్ సైకిల్ ట్రాక్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు, ఎప్పుడంటే? 

Dates of Bathukamma in 2023: బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే - ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలో తెలుసా!

Dates of Bathukamma in 2023: బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే -  ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలో తెలుసా!