News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Kanna : సహకార బ్యాంకుల్లో రూ. 5 వేల కోట్ల దోపిడి - విచారణకు టీడీపీ నేత కన్నా ఆదేశం !

ఏపీ సహకార బ్యాంకుల్లో ఐదు వేల కోట్ల రూపాయల స్కాం జరిగిందని కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

FOLLOW US: 
Share:

Kanna :   ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకుల్లో రుణాల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేత కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు.  రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి వైసీపీ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు సహకార రంగంలో రూ.5వేలకోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు.  దీనిపై దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే కేంద్రహోంమంత్రి అమిత్ షాకు, నాబార్డ్ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇసుక దోపిడీలో నియమించినట్టే, సహకారరంగంలో త్రిసభ్య కమిటీల పేరుతో పాలెగాళ్లను నియమించి, అధికారుల సాయంతో అధికారపార్టీ నేతలు రైతుల సొమ్ముని దోచేస్తున్నారపి ఆరోపించారు.                      

సహకార రంగంలో జరిగిన దోపిడీకి సంబంధించి తమ దృష్టికి వచ్చిన వివరాలు చాలా తక్కువని.. బయటకురావాల్సినవి ఇంకా ఉన్నాయని కన్నా  లక్ష్మినారాయణ తెలిపారు.   ఏలూరు జిల్లా టీ.నరసాపురం, చింతలపూడి, కామవరపుకోట, రంగాపురం, సరిపల్లిసహా, పలుసొసైటీల్లో దగ్గర దగ్గర రూ. 400కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఏలూరు సెంట్రల్ బ్యాంక్‌లో రూ.17 కోట్లు అన్యాక్రాంతమయ్యాయన్నారు. ఇటీవల గుంటూరు సెంట్రల్ బ్యాంక్‌లో డ్వాక్రా మహిళల పేర్లు మార్చి రూ.500కోట్ల వరకు కాజేశారన్నారు. కృష్ణాజిల్లా పెడనలో ఒక మహిళ పేరుతో ఉన్న 1.80 ఎకరాల భూమిని తనఖా పెట్టి, ఆమెకే తెలియకుండా రుణం తీసుకున్నారన్నారు. విశాఖపట్నం సెంట్రల్ బ్యాంక్‌లో కోటి రూపాయాలు, వినుకొండలో రూ.2 కోట్లు, తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి సహకార సంఘంలో రూ.23కోట్లు, కాకినాడ జయలక్ష్మి సహకార బ్యాంకులో రూ.560 కోట్లు కాజేశారని ఆయన తెలిపారు.                                 

ఇవి మాత్రమే కాదని..  చెప్పుకుంటూ పోతే సహకారరంగంలో వైసీపీ నేతలు, అధికారులతో కుమ్మక్కై చేసిన దోపిడీ చాలానే ఉందన్నారు. సహకార సొసైటీల్లో అవినీతిపై ఉన్న ఆధారాలను బయటపెడుతున్నామన్నారు. సహకార రంగంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగినా పట్టించుకునే నాథులు కరవయ్యారనీ…ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన సహకార రంగంలో జేబు దొంగలు చేరారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. సొసైటీల్లో త్రిసభ్య కమిటీల మాటున రైతుల సొమ్మును విచ్చలవిడిగా దోచుకుంటున్నారన్నారు. వైసీపీ నేతల్ని సహకార పదవుల్లో నామినేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై కేంద్రం స్పందించి చర్యలు తీసుకోవాలిన లేకపోతే రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని తెలిపారు.                            

తాను గతంలో విశాఖపట్నం ఇన్‌ఛార్జ్‌గా మంత్రిగా ఉన్నప్పుడు నగరంలోకి ప్రవేశించిన సంఘ విద్రోహశక్తుల్ని ఎన్‌కౌంటర్ చేయించినట్లు తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన కిడ్నాప్‌ను డీజీపీ తేలికచేసి మాట్లాడుతూ, రాష్ట్రమంతా బాగుందని చెప్పడం ఎంతమాత్రం సరైందికాదన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తల విధినిర్వహణే తమ గురుతరబాధ్యత అన్నట్టుగా పోలీస్ వ్వవస్థ అధికారపార్టీకి కంచెలా కాపలాకాస్తోందని మండిపడ్డారు. పదోతరగతి విద్యార్థిని పెట్రోల్ పోసి తగలబెట్టడం వైసీపీ నేతల దుర్మార్గానికి నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. 

Published at : 17 Jun 2023 03:25 PM (IST) Tags: AP Politics Kanna Lakshminarayana AP Cooperative Bank Loans TDP Leader Kanna

ఇవి కూడా చూడండి

Bhimavaram News: భీమవరంలో దారుణం, పొదల్లో బాలిక డెడ్ బాడీ - ఒంటిపై గాయాలు?

Bhimavaram News: భీమవరంలో దారుణం, పొదల్లో బాలిక డెడ్ బాడీ - ఒంటిపై గాయాలు?

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

TDP News: బుర్రకథల మంత్రి అసెంబ్లీలో కాగ్ నివేదికలు మాట్లాడరా? - టీడీపీ ఎమ్మెల్సీ

TDP News: బుర్రకథల మంత్రి అసెంబ్లీలో కాగ్ నివేదికలు మాట్లాడరా? - టీడీపీ ఎమ్మెల్సీ

MLA Anil Kumar: నెల్లూరులో ఆ పెద్దమనిషి కూడా త్వరలో జైలుకెళ్తాడు - మాజీ మంత్రి అనిల్ కీలక వ్యాఖ్యలు 

MLA Anil Kumar: నెల్లూరులో ఆ పెద్దమనిషి కూడా త్వరలో జైలుకెళ్తాడు - మాజీ మంత్రి అనిల్ కీలక వ్యాఖ్యలు 

Adani Meets CM Jagan : సీఎం జగన్ తో అదానీ భేటీ - అధికారిక పర్యటన కాదంటున్న ప్రభుత్వ వర్గాలు !

Adani Meets CM Jagan :  సీఎం జగన్ తో అదానీ భేటీ -   అధికారిక పర్యటన కాదంటున్న ప్రభుత్వ వర్గాలు !

టాప్ స్టోరీస్

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy :  చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత -  కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !