(Source: Poll of Polls)
Jogi Ramesh: ఏపీ నకిలీ లిక్కర్ స్కాంలో సంచలనం - అద్దెపల్లితో జోగి రమేష్ వాట్సాప్ చాట్ వైరల్ !
Fake liquor scam: లిక్కర్ కేసు నిందితుడు జనార్దన్ రావుతో జోగి రమేష్ చాట్ లీక్ అయింది. ఆయనను ఆఫ్రికా పంపింది జోగి రమేషేనని క్లారిటీ వచ్చింది.

Jogi Ramesh chat with liquor case accused Janardhan Rao leaked: ఏపీలో కలకలం రేపుతున్న నకిలీ లిక్కర్ స్కాంలో ఏ 1 నిందితుడు అద్దెపల్లి జనార్ధన్ రావు .. మాజీ మంత్రి జోగి రమేష్ చెబితేనే చేశానని వాంగ్మూలం ఇచ్చారు. తాజాగా ఆయన జోగి రమేష్ తో జరపిన వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వాట్సాప్ చాట్ వైరల్ గా మారింది. జనార్దన్ రాను జోగి రమేష్ తన ఇంటికి రమ్మని పిలవడంతో పాటు.. ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావని ఆ వాట్సాప్ చాట్‌లో ఉంది. జోగి రమేష్ మొదటగా అసలు జనార్దన్ రావు ఎవరో తనకు తెలియదని తనపై కుట్ర చేస్తున్నరని ఆరోపణలు చేశారు. తర్వాత తనకు పరిచయం ఉంది కానీ స్నేహితుడు కాదని తెలిపారు. జనార్దన్ రావు తన ఇంటికి ఎప్పుడూ రాలేదని అంటున్నారు. మరో వైపు జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. సీసీ ఫుటేజీలు సేకరిస్తున్నారు పోలీసులు.
వీడియోలో అద్దేపల్లి జనార్ధన్ రావు ఏం చెప్పారంటే?
వైసిపి పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ చేశాం.. టిడిపి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో వ్యాపారం ఆపేశాం. ఈ ఏడాది ఏప్రిల్‌లో జోగి రమేష్ ఫోన్ చేసి — “టిడిపి ప్రభుత్వాన్ని చెడ్డపేరు తెచ్చేలా మళ్లీ తయారీ మొదలు పెట్టు” అని ఆదేశించాడు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే మొదలు పెట్టమని సూచించాడు “అక్కడి నుంచి మొదలుపెడితే చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లొచ్చు” అన్నాడు. వేరే పేర్లతో గదులు అద్దెకు తీసుకుని యంత్రాలు తెచ్చి మద్యం తయారు చేశాం. జోగి రమేష్ లీక్ ఇచ్చి రైడ్ చేయించి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్లాన్ వేసాడు! సాక్షి మీడియాను ముందే అక్కడ ఉంచారు. దొరికిపోతే బెయిల్ ఇప్పిస్తానని చెప్పి ఇప్పుడు తమ్ముడినీ కేసులో ఇరికించాడు. జై చంద్రారెడ్డి కి అసలు సంబంధం లేదు, అతన్ని కావాలనే టార్గెట్ చేశారు. చిన్నప్పటి పరిచయం ఉన్న జోగి రమేష్ నన్ను నమ్మించి మోసం చేశాడు.
🚨 నకిలీ మద్యం కేసులో సంచలనం! 🚨
— Venugopalreddy Chenchu (NRITDP Spokesperson) (@venuchenchu) October 13, 2025
జనార్ధన్ రావు వీడియోలో బహిర్గతం చేసిన షాకింగ్ నిజాలు!
🔸 వైసిపి పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ చేశానని అంగీకారం!
🔸 టిడిపి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో వ్యాపారం ఆపేశాం.
🔸 ఈ ఏడాది ఏప్రిల్‌లో జోగి రమేష్ ఫోన్ చేసి — “టిడిపి… pic.twitter.com/wLIPZw2LIm
ఈ కేసులో సిట్ ఏర్పాటు అయింది. ఏలూరు రేంజ్ ఐజీ నేతృత్వంలో ఏర్పాటు అయిన సిట్ దర్యాప్తు ప్రారంచనుంది. అసలు కుట్రదాడులుగా జోగి రమేష్ పేరు తెరపైకి రావడంతో.. సిట్ అధికారులు తీసుకోబోయే చర్యలు హైలెట్ కానున్నాయి. ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నందుకు.. ప్రభుత్వ పెద్దలు కూడా కఠినంగా ఉండాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.





















