Tanuku Janasena: తణుకులో జనసేన సీటు కోసం రచ్చ! రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత
Janasena: జనసేన ఇంచార్జ్ విడివాడ రామచంద్రకి సీట్ కేటాయించాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. జనసేన జిల్లా అధ్యక్షులు గోవిందరావు ఆధ్వర్యంలో ఈ విషయంలో నేడు చర్చలు జరిగాయి.
Tensions in Mandapaka village of Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జనసేన సీటు విషయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నియోజకవర్గంలోని మండపాక గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. జనసేన ఇంచార్జ్ విడివాడ రామచంద్రకి సీట్ కేటాయించాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. జనసేన జిల్లా అధ్యక్షులు గోవిందరావు ఆధ్వర్యంలో ఈ విషయంలో నేడు చర్చలు జరిగాయి. విడివాడ ఇంటివద్ద చర్చలు సఫలం కాకపోవడంతో మళ్లీ నేరుగా నాదెండ్ల మనోహర్ తో చర్చలు జరిపేందుకు అలంపురం జయ గార్డెన్ కు జనసేన నాయకులు బయలుదేరారు.
ఈ క్రమంలో తణుకులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాదయాత్రను అడ్డుకుంటామని విడివాడ బహిరంగంగా ప్రకటించారు. దీంతో జనసేన నాయకులు జై విడివాడ అంటూ నినాదాలు చేశారు. నాదెండ్ల మనోహర్ తో నేరుగా చర్చలు జరిపిస్తామంటూ జిల్లా అధ్యక్షులు గోవింద్ హామీ ఇవ్వడంతో నేరుగా మనోహర్ వద్దకు విడివాడ బయలుదేరారు. ఎట్టి పరిస్థితిల్లోనూ తణుకులో విడివాడకే సీటు ఇప్పించాలంటూ నినాదాలు చేశారు. తణుకులో టీడీపీ, జనసేన వర్గాల మధ్య సీటు విషయంలో హాట్ టాపిక్ అయింది.