Janasena news : స్కూల్ పిల్లల పేరుతో రూ. 120 కోట్ల దోపిడీ - మొదటి స్కాం బయటపెట్టిన జనసేన !
Janasena Nadendla Manohar : రోజుకో స్కాం బయటపెడతామన్న జనసేన తొలి రోజు స్కూల్ పిల్లల పేరుతో దోచేసిన 120 కోట్ల గురించి వెల్లడించింది. ఈడీ దాడుల్లో ఈ స్కాం వెలుగు చూసిందని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
![Janasena news : స్కూల్ పిల్లల పేరుతో రూ. 120 కోట్ల దోపిడీ - మొదటి స్కాం బయటపెట్టిన జనసేన ! Janasena news Jana Sena revealed about the 120 crore looted in the name of school children Janasena news : స్కూల్ పిల్లల పేరుతో రూ. 120 కోట్ల దోపిడీ - మొదటి స్కాం బయటపెట్టిన జనసేన !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/14/74a701eb2155ef491ba58c0304e339c71699961615845228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Janasena news : వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం విద్యాకానుక (Vidya Kanuka ) పేరుతో రూ. 120 కోట్ల దోపిడీ చేసిందని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో సాగుతున్న కుంభకోణాలు అక్రమాలపై రోజుకొకటి చొప్పున బయటపెడతామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వారం కిందటే ప్రకటించారు. అందులో భాగంగా విద్యా శాఖలో స్కామ్ ను ఈ రోజు వెల్లడించారు. ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థులకు ఇచ్చే జగనన్న విద్యా కానుకలో రూ.120 కోట్లు దారి మళ్ళాయని ఇటీవల ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ED ) 5 కంపెనీలపై దాడులు చేసిందన్నారు. ఢిల్లీలో తీగ లాగితే ఆంధ్ర ప్రదేశ్ లో డొంక కదిలిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఉత్తరాంధ్ర నుంచి వయా తాడేపల్లి మీదుగా రాయలసీమకు ఇవి చేరాయా అని నాదెండ్ల ప్రస్నించారు. నిధులు ఎలా దారి మళ్ళాయి అనేదానిపై ఈడీ సమగ్ర విచారణ మొదలుపెట్టిందని.. 5 కంపెనీలు సిండికేట్ గా మారాయి అనేది అర్థం అవుతోందన్నారు. విద్యార్థులకు నాసిరకం బూట్లు, చిరిగిపోతున్న బ్యాగులు ఇస్తున్నారని ఆరోపించారు. కమిషన్ల కోసం ప్రభుత్వ పెద్దలు లాలూచీపడ్డారు. ఇప్పటి వరకూ జగనన్న విద్యా కానుక పేరుతో రూ.2400 కోట్లు నిధులు వెచ్చించారని గుర్తు చేశారు. ఈ 5 కంపెనీలు వెనక ఎవరు ఉన్నారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
పేద విద్యార్థుల పేరుతో కోట్లు దోచేస్తున్నారని.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నది 35 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కానీ జగనన్న విద్యా కానుకకు పర్చేజ్ ఆర్డర్ పెట్టింది 42 లక్షలన్నారు. ఈ వ్యత్యాసంలో ఉన్న మొత్తం ఎటు పోతుందని ప్రశ్నించారు. విద్యాశాఖ శాఖ ముఖ్య కార్యదర్శి మాత్రం పెద్ద మాటలు చెబుతూ క్వాలిటీ వాల్ అని విద్యార్థులను మభ్యపెడుతున్నారు. గోడ మీద చూపించే వాటికీ విద్యార్థులకు ఇచ్చే బూట్లు, బ్యాగులకు సంబంధం ఉండటం లేదన్నారు. ఎడమ కాలుకి 3వ నెంబర్ సైజ్, కుడి కాలుకి 5వ నెంబర్ సైజ్ షూస్ ఇస్తున్నారని ఇదేం పద్దతని ప్రశ్నించారు. క్లాస్ వార్ అని చెప్పే జగన్ పేద విద్యార్థుల పేరుతో కోట్లు మళ్లిస్తున్నారు. పేద విద్యార్థులను, వారి తల్లితండ్రులను మోసం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
జగనన్న విద్యా కానుకపేరుతో స్కూల్ బ్యాగు, బట్టలు, షూస్ వంటివి ఇస్తున్నారు. అయితే అవి నాణ్యత లేనివి ఇస్తున్నారని..పెద్ద ఎత్తున డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయని కొంత కాలంగా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమలో ఢిల్లీలో ఈడీ జరిపిన దాడుల్లో ఏపీకి... ఈ విద్యా కానుక సరఫరా చేసిన కంపెనీల వివరాలు ఉన్నట్లుగా నాదెండ్ల మనోహర్ ప్రకటించడం సంచలనంగా మారింది. రొజుకొకటి చొప్పుననాదెండ్ల మనోహర్ స్కామ్ బయటపెడతామని చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)