News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

CBI Court News : హైదరాబాద్ సీబీఐ కోర్టులో రోజంతా ఏపీ సీఎం జగన్ కేసుల విచారణ - లిస్ట్ వైరల్ !

హైదరాబాద్ సీబీఐ కోర్టులో రోజంతా జగన్ కేసుల విచారణే జరిగింది. కోర్టు నోటీసు బోర్డులో ఉంచిన ఈ వివరాలు వైరల్ అయ్యాయి.

FOLLOW US: 
Share:

CBI Court News  :  ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న సీబీఐ కేసుల విచారణ సీబీఐ కోర్టులో శుక్రవారం జరిగింది. శుక్రవారం కోర్టులో విచారణ జరగనున్న కేసుల జాబితాను నోటీస్ బోర్డులో అంటించారు. ఇందులో మొదటి నుంచి చివరి వరకూ ఉన్నవి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ వన్ గా ఉన్న కేసులే. అక్రమాస్తుల కేసులకు సంబంధించి దాఖలు చేసిన వివిధ రకాల పిటిషన్లపై విచారణ ఉన్నట్లుగా నోటీసు బోర్డులో అంటించిన వివరాల ద్వారా వెల్లడయింది. కాసేపటికే ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. సీబీఐ కోర్టులో రోజంతా జగన్ గురించే విచారణ జరిగిందని సోషల్ మీడియాలో ఇతర పార్టీల నేతలు సెటైర్లువేయడం ప్రారంభించారు. 

ఇలాంటి క్రిమినల్ రికార్డు ఉన్న ్సఎం దేశంలో లేరన్న టీడీపీ             
 
ఈ జాబితాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ  20 క్రిమినల్ కేసుల్లో ఏ-1 జగన్ రెడ్డే. ఇటువంటి క్రిమినల్ చేత పాలింపబడుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గర్వపడాలేమో! ఏది ఏమైనా...  దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా...  ఈ క్రిమినల్ రికార్డు అధిగమించాలంటే ఇప్పట్లో సాధ్యం కాదని విమర్శించారు. 

వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ అవినీతి చేసి అక్రమాస్తులు పోగేశారని సీబీఐ కేసులు          

తన తండ్రి సీఎంగా ఉన్న వైఎస్ జగన్ పెద్ద ఎత్తున క్విడ్ ప్రో కోకు పాల్పడి అక్రమార్జన చేశారని.. సీబీఐ కేసులు నమోదు చేసింది. సీబీఐ దాఖలు చేసిన మొత్తం 11 ఛార్జిషీట్లలో వైఎస్‌ఆర్‌సి అధ్యక్షుడు ఏ 1గా ఉన్నారు. మొత్తం 11 ఛార్జిషీట్‌లలో  జగన్  తన వ్యక్తిగత హోదాలో నిందితుడిగా ,  నిందితులుగా ఉన్న  కంపెనీల ప్రతినిధిగా ఉన్నారు.  ఈ కేసులో చివరి ఛార్జిషీటు దాఖలు చేసి పదేళ్లవుతున్నా విచారణ ప్రారంభం కాలేదు . దీనికి కారణం అక్రమాస్తుల కేసుల్లోని నిందితులు ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు..ఇతర పిటిషన్లు వేసి.. న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగులను  ఉపయోగించుకుని విచారణ ఆలస్యం చేస్తున్నరని సీబీఐ పలుమార్లు కోర్టుకు తెలిపింది.  

ఇప్పటికీ ప్రారంభం కాని ట్రయల్స్               

విచారణ సమయంలో వ్యక్తిగత విచారణకు మినహాయింపు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ప్రతిపక్ష నేతగా ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూనే పాదయాత్ర చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విచారణకు హాజరు కాలేదు. హైకోర్టు ఆయనకు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే కోర్టులో కేసుల విచారణ సాగుతూనే ఉంది. అక్రమాస్తుల కేసులో నిందితులు వేసిన పిటిషన్లపై కోర్టు విచారణ జరుపుతోంది.ఇంకా అసలు కేసుల ట్రయల్స్ ప్రారంభం కాలేదు. 

Published at : 30 Jun 2023 03:11 PM (IST) Tags: Jagan CBI cases Hyderabad CBI court investigation Jagan illegal cases investigation

ఇవి కూడా చూడండి

Top Headlines Today: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించాలన్న మంత్రి కాకాణి - పాలమూరుకు విచ్చేసిన ప్రధాని మోదీ

Top Headlines Today: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించాలన్న మంత్రి కాకాణి - పాలమూరుకు విచ్చేసిన ప్రధాని మోదీ

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Vote for Note Case: తెరపైకి ఓటుకు నోటు కేసు - 4న సుప్రీంకోర్టులో విచారణ

Vote for Note Case: తెరపైకి ఓటుకు నోటు కేసు - 4న సుప్రీంకోర్టులో విచారణ

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

టాప్ స్టోరీస్

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

Tiger Nageswara Rao: హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?

Tiger Nageswara Rao: హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా  ?